Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సాయంత్రం 5 గంటల వరకూ 57.7 శాతం పోలింగ్
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:16 PM
సాయంత్రం 5 గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ నమైదనట్టు అధికారులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 63.83 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సౌత్ ఈస్ట్ ఢిల్లీలో 53.77 శాతం పోలింగ్ నమోదైంది.
న్యూఢిల్లీ: ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 63.83 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సౌత్ ఈస్ట్ ఢిల్లీలో 53.77 శాతం పోలింగ్ నమోదైంది.
Mallikarjun Kharge: 'తేరే బాప్' అంటూ రెచ్చిపోయిన ఖర్గే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, అప్ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీజేఐ సంజీవ్ ఖన్నా, సీఈసీ రాజీవ్ కుమార్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీలాంపూర్, జాంగ్‌పుర, కస్తూర్బా నగర్‌లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయంటూ ఆరోపణలు రావడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పార్టీల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని నిర్ధారించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కీలక అభ్యర్థులు, నియోజకవర్గాలు
ఆప్ సుప్రీం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయనపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ పడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ ఢిల్లీ విభాగం చీఫ్ రమేష్ బిధూరి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా పోటీలో ఉన్నారు. మరో కీల నియోకవర్గం జాంగ్‌పుర. ఆప్ వరుసగా రెండు సార్లు గెలిచిన ఈ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థిగా మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి తర్వీందర్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఫర్హద్ సూరి పోటీ పడుతున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్యనే ఉంది. కాంగ్రెస్ సైతం మెరుగైన ఫలితాలు ఆశిస్తోంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్
Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి