Share News

Mallikarjun Kharge: 'తేరే బాప్' అంటూ రెచ్చిపోయిన ఖర్గే

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:43 PM

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోయిందని అన్నారు. వెంటనే నీరజ్ శేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడటంతో ఖర్గే ఒక్కసారిగా సహనం కోల్పోయారు.

Mallikarjun Kharge: 'తేరే బాప్' అంటూ రెచ్చిపోయిన ఖర్గే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) రాజ్యసభలో తన ప్రసంగానికి బీజేపీ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుపడటంతో ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ''నేను మీ తండ్రి సమాకాలికుడిని. ఇంకా నువ్వు చిన్నపిల్లాడిడివే. కూర్చో'' అని ఖర్గే గద్దించారు.

Indian Migrants: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి వెనక్కి.. ఇండియా చేరుకున్న వలసదారుల విమానం.. ఎంతమందంటే..


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోయిందని అన్నారు. వెంటనే నీరజ్ శేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడటంతో ఖర్గే ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ''నేను మీ తండ్రి (తేరేబాప్) సమకాలికుడిని. నువ్వేం మాట్లాడతావు? షట్ అప్ అండ్ సిట్'' అని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వెంటనే ఇరువర్గాలను శాంతపరచేందుకు ప్రయత్నించారు. చంద్రశేఖర్ ఈ దేశంలోనే పెద్ద నాయకులలో ఒకరని, ఆయన గౌరవానికి కొలమానాలు లేవని అన్నారు. మాజీ ప్రధానిపై ఖర్గే చేసిన సంబోధనను ఉపసంహరించుకోవాలని కోరారు.


దివంగత చంద్రశేఖర్, తాను కలిసి ఒకేసారి అరెస్టు అయ్యామని, ఆ కారణంగానే మీ తండ్రి నా సమకాలికుడని చెప్పానని ఖర్గే వివరణ ఇచ్చారు. దీనిపై ధన్‌ఖడ్ స్పందిస్తూ, మీరు 'ఆప్‌కే బాప్' అనడాన్ని సమర్ధించుకుంటున్నారా? మరొక గౌరవ సభ్యుడితో మాట్లాడుతూ మీరు 'ఆప్ కే బాప్' అనడం సరికాదు. దయచేసి మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి అని మరోసారి ఖర్గేను కోరారు. దీనిపై ఖర్గే తిరిగి మాట్లాడుతూ, ఎవరీ అవమానించడం తన అలవాటు కాదని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఎన్నోసార్లు బీజేపీ అవమానించిందని గుర్తు చేశారు. స్నానం చేసేటప్పుడు రైన్‌కోట్ వేసుకుంటారని, ఆయన మాట్లాడరని, ప్రభుత్వాన్ని నడపలేరని ఎన్నోసార్లు సభ్యులు వ్యాఖ్యలు చేశారని, కానీ మన్మోహన్ మాత్రం దేశ ప్రయోజనాల దృష్ట్యా మౌనంగా ఉండిపోయారని అన్నారు. మౌని బాబా అని పిలిచినా ఆయన మాట్లాడలేదని, వ్యక్తులను అవమానపరచడం బీజేపీ అలవాటు అయితే, అవమానాలను భరించే అలవాటు తమదని అన్నారు.


సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అయన నీరజ్ చంద్రశేఖర్ 2019లో బీజేపీలో చేరారు. సోషలిస్ట్ అగ్రనాయకుల్లో ఒకరైన ఆయన తండ్రి చంద్రశేఖర్ 1990 అక్టోబర్ నుంచి 1991 జూన్ వరకూ ఆరు నెలలు దేశ ప్రధానిగా సేవలందించారు.


ఇవి కూడా చదవండి..

Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:46 PM