Share News

Delhi Ministers Portfolio: ఢిల్లీలో సీఎంతోపాటు మంత్రులకు ఏ శాఖలు ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 20 , 2025 | 05:32 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఎట్టకేలకు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం తిరిగి కొలువుదీరింది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రితోపాటు ప్రమాణ స్వీకారణం చేసిన మంత్రుల వివరాలు, వారి శాఖల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Delhi Ministers Portfolio: ఢిల్లీలో సీఎంతోపాటు మంత్రులకు ఏ శాఖలు ఉన్నాయంటే..
Delhi Ministers Portfolio

ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఆరుగురు ఎమ్మెల్యేలను మంత్రులుగా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. వారిలో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ ఇంద్రజ్ ఉన్నారు. అయితే వీరికి తాజాగా శాఖలు కూడా కేటాయించారు. ఈ క్రమంలో ఎవరికి ఏ శాఖ ఉందనే విషయాలను ఇక్కడ చూద్దాం.


  • రేఖా గుప్తా (ముఖ్యమంత్రి) - హోం, ఆర్థిక, సేవలు, నిఘా, ప్రణాళిక

  • పర్వేష్ వర్మ (ఉప ముఖ్యమంత్రి) - విద్య, ప్రజాపనులు, రవాణా

  • మంజీందర్ సింగ్ సిర్సా - ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు

  • రవీంద్ర కుమార్ ఇంద్రాజ్ - సాంఘిక సంక్షేమం, ఎస్సీ/ఎస్టీ వ్యవహారాలు, కార్మిక

  • కపిల్ మిశ్రా - నీరు, పర్యాటకం, సంస్కృతి

  • ఆశిష్ సూద్ - రెవెన్యూ, పర్యావరణం, ఆహారం & పౌర సరఫరాలు

  • పంకజ్ కుమార్ సింగ్ - చట్టం, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణం


మంత్రులు ఎంత చదువుకున్నారు?

రేఖ గుప్తా ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇద్దరు గ్రాడ్యుయేట్లు, ఇద్దరు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు. కాగా మంజీందర్ సింగ్ సిర్సా మంత్రివర్గంలో అతి తక్కువ చదువుకున్న మంత్రి. సిర్సా 12వ తరగతి పాస్. ఇద్దరు గ్రాడ్యుయేట్ మంత్రులలో జనక్‌పురి నుంచి గెలిచిన ఆశిష్ సూద్, బవానా నుంచి గెలిచిన రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్ ఉన్నారు. రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్ బి.ఎ. పట్టా పొందగా, ఆశిష్ సూద్ బి.కాం. డిగ్రీ చేశారు. ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ మంత్రులలో ముఖ్యమంత్రి రేఖ గుప్తా, వికాస్‌పురి నుంచి గెలిచిన పంకజ్ కుమార్ సింగ్ ఉన్నారు.

వృత్తిరీత్యా దంతవైద్యుడైన పంకజ్, BDS డిగ్రీని కలిగి ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి రేఖ గుప్తా మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. న్యూఢిల్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ, కరవాల్ నగర్ నుండి గెలిచిన కపిల్ మిశ్రా అత్యంత విద్యావంతులైన మంత్రులు. కపిల్ మిశ్రా సోషల్ వర్క్‌లో ఎంఏ డిగ్రీ చేశారు. కాగా ప్రవేశ్ వర్మ MBA డిగ్రీ పూర్తి చేశారు.


ఇవి కూడా చదవండి:

UP Budget 2025: రైతులకు ఇచ్చిన హామీలు ఏవి.. యూపీ బడ్జెట్‌పై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..


Deputy CM: డిప్యూటీ సీఎంకు బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News


Updated Date - Feb 20 , 2025 | 05:39 PM