BJP Annamalai: పరాజయం.. విజయానికి సోపానం
ABN , Publish Date - Aug 27 , 2025 | 11:18 AM
క్రీడాకారులు ఓటమిచెందితే క్రుంగి పోకూడదని, విజయం కోసం తీవ్రంగా పోరాడాలని, చివరకు ఓటములే విజయానికి సోపానాలవుతాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. పుదుకోట సమీపం కీరనూరు వద్ద గన్ షూటింగ్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.
- బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై
చెన్నై: క్రీడాకారులు ఓటమిచెందితే క్రుంగి పోకూడదని, విజయం కోసం తీవ్రంగా పోరాడాలని, చివరకు ఓటములే విజయానికి సోపానాలవుతాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) పేర్కొన్నారు. పుదుకోట సమీపం కీరనూరు వద్ద గన్ షూటింగ్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్, పుదుకోట రాయల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో గన్ షూటింగ్ పోటీలు ఈ నెల 22న ప్రారంభమయ్యాయి.

మంగళవారం సాయంత్రం అన్నామలై బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అన్నామలై తుపాకీ పట్టుకుని లక్ష్యం కేసి కాల్పులు జరిపారు. ఆ తర్వాత విజేతలకు పతకాలను ప్రదానం చేసి ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలపైనే కాకుండా చదువుపై కూడా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మనవడు సూర్యరాజ్‌కు అన్నామలై పతకం ఉన్న ట్యాగ్‌ను మెడలో వేయడానికి ప్రయత్నించినప్పుడు అడ్డుకుని పతకాన్ని చేతిలోకి తీసుకోగా, క్రీడాకారులందరూ అన్నామలైతో గ్రూప్‌ఫొటో తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News