MLA: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు తీహార్ జైలుకే..
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:52 PM
మరో నాలుగేళ్ళలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలను తీహార్ జైలులో వేస్తామని చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్(Chikkaballapur MLA Pradeep Eshwar) మండిపడ్డారు.
- సుబ్బారెడ్డిని అన్యాయంగా ఇరికించారు
- ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్
బెంగళూరు: మరో నాలుగేళ్ళలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలను తీహార్ జైలులో వేస్తామని చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్(Chikkaballapur MLA Pradeep Eshwar) మండిపడ్డారు. బెంగళూరులో గురువారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డిపై ఈడీ దాడిని తీవ్రంగా ఖండించారు. సుబ్బారెడ్డి ఎంతోకష్టపడి ఎదిగిన వారన్నారు. ప్రజల విశ్వాసం పొందేందుకు ఎన్నో ఏళ్ళు కష్టపడి బాగేపల్లిలో ఎమ్మెల్యే అయ్యారన్నారు.
బీజేపీలో అందరూ నిజాయితీ పరులేనా అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కుమారుడు జైషా కంపెనీలు అన్నీ సవ్యంగానే సాగుతున్నాయా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ఏకంగా 17 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని అవి ఐటీ, ఈడీ అధికారులకు కనిపించవా అంటూ నిలదీశారు. బీజేపీ నేతలకు ఒక్కటే చెబుతున్నానని ఎన్నివిధాల టార్గెట్ చేసినా వెనుకాడేది లేదన్నారు.

2029 ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ వారిని వెంటాడి తీహార్ జైలుకు పంపుతామని సవాల్ విసిరారు. వారు రాళ్ళతో కొడితే మేం పూలు చల్లుతామా అన్నారు. అందుకు మీడియా ప్రతినిధులు పదేళ్ళ యూపీఏ పాలనలో బీజేపీని మీరు రాళ్ళతో కొట్టారా అని అడుగగా అలా ఏం కాదని మేం ఎవరినీ టార్గెట్ చేయలేదంటూ దాటవేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..
నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు
Read Latest Telangana News and National News