CM Stalin: ప్రధానికి సీఎం లేఖ.. రైలు చార్జీలు పెంచొద్దు
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:50 AM
రైలు టిక్కెట్ ధరలు జూలై నెల ఒకటో తేదీ నుంచి స్వల్పంగా పెంచేందుకు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
చెన్నై: రైలు టిక్కెట్ ధరలు జూలై నెల ఒకటో తేదీ నుంచి స్వల్పంగా పెంచేందుకు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Nrebdra Modi)కి లేఖ రాశారు. ఈ విషయంపై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భారతీయ రైల్వే అనేది పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఒక ప్రయాణ సౌకర్యం మాత్రమేకాకుండా, వారి జీవితాల్లో ఒక అంతర్భాగమన్నారు. ఇదిలావుంటే, తాను చెన్నై నుంచి కాట్పాడికి రైలులో ప్రయాణించగా, కాట్పాడి ప్రజలు స్వాగతం పలకడం ఆనవాయితీ అన్నారు. అయితే, ఈసారి ప్రజల్లో అంత ఉత్సాహం కనిపించలేదన్నారు.

దీనికి కారణం వచ్చే నెల నుంచి రైల్వే చార్జీలు పెంచబోతున్నారనే విషయం వారిని తీవ్రగా కలచివేస్తుందనే విషయాన్ని గ్రహించానన్నారు. ఈ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలపై రైలు చార్జీలను పెంచి ప్రయాణ భారాన్ని మోపొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌లకు ప్రజల తరపున విఙ్ఞప్తి చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు
Read Latest Telangana News and National News