CM Atishi About Kejriwal : ఎన్నికల వేళ ఆతిషీ సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:03 PM
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు ఢిల్లీలో భారీ కుట్ర జరుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషీ ఆరోపించారు. కేజ్రీవాల్‌పై ఒకదాని తర్వాత ఒకటి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న హరి నగర్‌లో అరవింద్ కేజ్రీవాల్ కారు వద్దకు కొందరు దుండగులు రాళ్లు, కర్రలతో వచ్చి దాడి చేసినా, ఢిల్లీ పోలీసులు అక్కడే ఉండి కూడా వారిని అడ్డుకోలేదని ఆరోపించారు. ఈ కుట్రలో ఇద్దరు ప్లేయర్లు ఉన్నారని, ఒకరు బీజేపీ కార్యకర్త కాగా మరొకరు ఢిల్లీ పోలీసులు అని ఆమె పేర్కొన్నారు. పార్టీ దర్యాప్తులో బీజేపీ కార్యకర్త దాడి చేసినట్లు తేలడంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనపై జరిగిన దాడులపై ఎన్నికల కమిషన్ ఆడిట్ నివేదిక ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్నికలకు ముందు హత్య చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ సీఎం ఆతిషీ ఆరోపిస్తున్నారు. నిన్న హరి నగర్‌లోని అరవింద్ కేజ్రీవాల్ కారు వద్దకు దాడి చేసేందుకు కొందరు దుండగులు రాళ్లు, కర్రలతో రావడం చూసి కూడా ఢిల్లీ పోలీసులు వారిని ఆపలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అడ్డుతొలగించుకోవాలనేదే బీజేపీ ఏకైక లక్ష్యమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 21, 22 తేదీల్లో ఎలాంటి హింస లేదా బెదిరింపులు జరగలేదని పేర్కొన్న తప్పుడు ప్రకటనలపై సంతకం చేయమని పోలీసులు ఆప్ వాలంటీర్లను బెదిరించారని అన్నారు. నిందితులైన పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఢిల్లీ పోలీసులు, ఫిర్యాదును మూసివేయడానికి బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సీఎం ఆతిషీ ఢిల్లీ ఎన్నికల అధికారికి లేఖ రాశారు.
బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మూకుమ్మడిగా ఆప్ వాలంటీర్లను ఆప్ వాలంటీర్లను బెదిరిస్తున్నారని ఆతిషీ అన్నారు. మా ఫిర్యాదులను విచారించడానికి బదులుగా ఎస్‌హెచ్‌ఓ ధరమ్‌వీర్, ఇన్‌స్పెక్టర్ సుశీల్ శర్మ, కానిస్టేబుల్ జై భగవాన్ మా వాలంటీర్‌లను సంప్రదిస్తున్నట్లు తెలిసిందని వెల్లడించారు. తప్పుడు స్టేట్‌మెంట్‌లు దాఖలు చేసి కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు.