Mosquito Drone: సీక్రెట్ డ్రోన్‌ను రూపొందించిన చైనా.. దోమలాగే ఎగురుతూ..
ABN , Publish Date - Jun 22 , 2025 | 09:24 PM
సైనిక కార్యకలాపాల కోసం చైనాకు చెందిన శాస్త్రవేత్తలు దోమ పరిమాణంలో ఉండే డ్రోన్‌ను అభివృద్ధి చేశారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మధ్య చైనా పరిధి హునాన్ ప్రావిన్స్‌లోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలోని రోబోటిక్స్ ప్రయోగశాలలో ఈ మైక్రో డ్రోన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది..
సైనిక కార్యకలాపాల కోసం చైనాకు చెందిన శాస్త్రవేత్తలు దోమ పరిమాణంలో ఉండే డ్రోన్‌ను అభివృద్ధి చేశారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మధ్య చైనా పరిధి హునాన్ ప్రావిన్స్‌లోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (NUDT)లోని రోబోటిక్స్ ప్రయోగశాలలో ఈ మైక్రో డ్రోన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు దీన్ని వినియోగించనున్నారట. ఈ డ్రోన్ చూసేందుకు అచ్చం దోమలాగానే ఉంది. అది ఎగురుకుంటూ వెళ్లినా దోమలాగే ఉండడంతో ఎవరికీ అనుమానం వచ్చే అవకాశమే ఉండదు. దీన్ని వినియోగించి సైనిక కార్యకలాపాలతో పాటూ శత్రు దేశాలపై నిఘా పెట్టనున్నారని తెలుస్తోంది.
ఎన్‌యూడీటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన అనేక సూక్ష్మ రోబోలను సెంట్రల్ చైనాకు (Central China) సంబంధించిన సైనిక చానల్లో ఇటీవల ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ దోమ డ్రోన్ (Mosquito Drone) గురించి ఎన్‌యూడీటీ విద్యార్థి వివరించారు. ఈ తరహా మైక్రో డ్రోన్లు యుద్ధ సమయాల్లో శత్రువులకు సంబంధించిన సైనిక రహస్యాలను చిత్రీకరిస్తాయని తెలిపాడు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో శిథిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని వివరించాడు.
దోమ పరిమాణంలో ఉన్న ఈ డ్రోన్‌కు రెండు వైపులా ఆకు తరహాలో చిన్న రెక్కలను అమర్చారు. అలాగే దీనికి వెంట్రక తరహాలో సన్నని కాళ్లు కూడా ఉన్నాయి. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో నియంత్రించేలా సెట్ చేశారు. ఈ డ్రోన్ పొడవు సుమారు 1.3 సెంటీమీటర్ల పొడవు ఉండేలా రూపొందించారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరిన మరో 311 మంది భారతీయులు
ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు
For National News And Telugu News