Jharkhand maoist leader killed: మళ్లీ ఎన్‌కౌంటర్.. మరో అగ్రనేత హతం
ABN , Publish Date - Sep 15 , 2025 | 10:19 AM
వరుస ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం ఎరుపెక్కింది. తాజాగా మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
రాంచీ, సెప్టెంబర్ 15: జార్ఖండ్‌లోని హజారిబాగ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరు సహదేవ్ సోరెన్ హతమయ్యారు. అతడి తలపై రూ. కోటి రివార్డు ఉందని భద్రతా దళాలు ఈ సందర్భంగా వెల్లడించాయి. గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పండిత్రి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయి. ఈ విషయాన్ని మావోయిస్టులు పసిగట్టి.. భద్రతా దళాలపైకి కాల్పులకు తెగబడ్డారు.
దీంతో భద్రతా దళాలు వెంటనే స్పందించి.. ఎదురు కాల్పులకు దిగాయి. ఈ నేపథ్యంలో ఇరు వైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి. 2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులు నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం పక్క ప్రణాళికతో ఒక వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది.
ఈ నేపథ్యంలో జార్ఖండ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లోని మావోయిస్టులపై ఉక్కు పాదంతో అణిచివేసేందుకు భద్రతా దళాలు తమ కూబింగ్‌ను తీవ్ర తరం చేశాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో ఇప్పటి వరకు వందలాది మంది మావోయిస్టులు మరణించారు. పలువురు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
అలాగే భారీగా మావోయిస్టులు అర్టెయ్యారు. ఇంకోవైపు దండాకారణ్యంలోని అధిక ప్రాంతం.. ఇప్పటికే భద్రతా దళాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అదీకాక పలువురు మావోయిస్టు అగ్రనేతలు సైతం వివిధ ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. ఇక కేంద్రం ఇంతటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నా.. మావోయిస్టులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా తెలంగాణకు చెందిన తిరుపతిని నియమించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For National News And Telugu News