Share News

Chennai News: విద్యుత్‌ రైళ్లలో సీట్లపై కాళ్లు పెడితే శిక్ష

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:56 PM

నగరం నుంచి శివారు ప్రాంతాలకు నడుపుతున్న విద్యుత్‌ సబర్బన్‌ రైళ్లలో ప్రయాణం చేస్తున్నవారు ఎదురుగా వున్న సీట్లపై కాళ్లు పెడితే చట్టపరమైన చర్యలుంటాయని దక్షిణ రైల్వే హెచ్చరించింది. నగరం నుంచి ప్రతిరోజు తిరువళ్లూరు, ఆవడి, అరక్కోణం, తిరుత్తణి, గుమ్మిడిపూండి, సూళ్లూరుపేటలకు నడుపుతున్న విద్యుత్‌ సబర్బన్‌ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు.

Chennai  News: విద్యుత్‌ రైళ్లలో సీట్లపై కాళ్లు పెడితే శిక్ష

- హెచ్చరించిన దక్షిణ రైల్వే

చెన్నై: నగరం నుంచి శివారు ప్రాంతాలకు నడుపుతున్న విద్యుత్‌ సబర్బన్‌ రైళ్లలో ప్రయాణం చేస్తున్నవారు ఎదురుగా వున్న సీట్లపై కాళ్లు పెడితే చట్టపరమైన చర్యలుంటాయని దక్షిణ రైల్వే హెచ్చరించింది. నగరం నుంచి ప్రతిరోజు తిరువళ్లూరు, ఆవడి, అరక్కోణం, తిరుత్తణి, గుమ్మిడిపూండి, సూళ్లూరుపేట(Sullurupet)లకు నడుపుతున్న విద్యుత్‌ సబర్బన్‌ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు.


అయితే ప్రయాణికుల్లో కొంతమంది చేసే అనాగరిక చర్యల కారణంగా మిగతా ప్రయాణికులు ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రమాదాల బారిన పడుతున్నారు. రైళ్లలో ఇలాంటి అనాగరిక చర్యలు జరగకుండా పూర్తిస్థాయిలో అడ్డుకునేలా రైల్వేశాఖ ప్రయాణికులకు కొన్ని షరతులు విధించింది. ప్రయాణికులు రైళ్లలో తమకు ఎదురుగా ఉన్న ఖాళీ సీట్లలో కాళ్లు పెట్టరాదని, తమ బంధువులు,


nani2.2.jpg

మిత్రుల కోసం సీట్లు ఆక్రమించుకోరాదని, ముఖ్యంగా బోగీల ఎంట్రన్స్‌లో కూర్చోరాదని, మిగతా ప్రయాణికులు ఎక్కి దిగేందుకు ఆటంకం కలిగించరాదని, కదులుతున్న రైలులో ఎక్కడం, దిగడం వల్ల ప్రమాదంలో చిక్కుకుంటారని దక్షణ రైల్వే సూచించింది. ఈ తాజా నిబంధనలను అతిక్రమించే ప్రయాణికులపై చుట్టపరమైన చర్యలుంటాయని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది.


nani2.2...jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 12:56 PM