Chennai News: రాష్ట్రంలో పెరుగుతున్న జ్వరాలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:58 AM
రాష్ట్రంలో గత రెండు వారాలుగా జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా రాజధాని నగరం చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్ళూరు జిల్లాల్లో జ్వర పీడితులు అధికంగా ఉన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా మూడు రకాలైన వైర్‌్‌సలు వ్యాపించి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జ్వరం బారిన పడుతున్నట్టు సమాచారం.
- అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
- నగరంలోనే అధిక కేసులు
చెన్నై: రాష్ట్రంలో గత రెండు వారాలుగా జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా రాజధాని నగరం చెన్నై(Chennai)తో పాటు కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్ళూరు జిల్లాల్లో జ్వర పీడితులు అధికంగా ఉన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా మూడు రకాలైన వైర్‌్‌సలు వ్యాపించి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జ్వరం బారిన పడుతున్నట్టు సమాచారం. ఈ మూడు రకాలైన వైర్‌సల్లో ‘ఇన్‌ఫ్లుయెంజా-ఎ’ రకం ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వైరస్ కారణంగా వచ్చే జ్వరం మూడు రోజుల్లోనే నయమవుతుందని వైద్యులు అంటున్నారు. అదేసమయంలో రద్దీ ప్రదేశాల్లో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చని,
అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఇదేవిషయంపై ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు సోమసుందరం మాట్లాడుతూ, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వాతావరణంలో మార్పులు జరగడం, వర్షాల కారణంగా వైరస్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా తుమ్ములు, జ్వరం, తలనొప్పి, జలుబు, వళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఇలాంటి లక్షణాలతో బాధపడేవారు సొంత వైద్యం కాకుండా, ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించి వారు చెప్పినట్టుగా ఆ మందులను వాడాలని ఆయన కోరారు.
ఆందోళన వద్దు..
- మంత్రి ఎం.సుబ్రమణ్యం
చెన్నై: రాష్ట్రంలో వ్యాప్తిస్తున్న వైరల్ జ్వరాలు వర్షాకాంలో వచ్చే సీజనల్ వ్యాధులని, వీటిపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో గురవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కొత్త వ్యాధుల వ్యాప్తి లేదన్నారు. అపరిశుభ్రమైన నీటి ద్వారా కేరళలో మెదడుపై ప్రభావం చూపే అమీబా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు అమీబా వ్యాప్తి లేదన్నారు. మాస్క్ తప్పనిసరంటూ వదంతులు వ్యాపిస్తున్నాయని, ప్రజల స్వీయరక్షణ కోసం మాస్క్ ధరించవచ్చని మంత్రి తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ... జీఎస్టీ పన్ను పెంచింది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రస్తుతం తగ్గించింది ఆ ప్రభుత్వమేనని మంత్రి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News