Share News

Chennai News: కరూర్‌ దుర్ఘటనకు విజయ్‌నే కారణం..

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:37 AM

కరూర్‌ రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోవటానికి, వందమందికిపైగా గాయపడటానికి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌నే కారణమని ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ (ఎన్టీకే) సమన్వయకర్త సీమాన్‌ ఆరోపించారు.

Chennai News: కరూర్‌ దుర్ఘటనకు విజయ్‌నే కారణం..

- ఎన్టీకే అధినేత సీమాన్‌ ఆరోపణ

చెన్నై: కరూర్‌ రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోవటానికి, వందమందికిపైగా గాయపడటానికి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌నే కారణమని ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ (ఎన్టీకే) సమన్వయకర్త సీమాన్‌(Seeman) ఆరోపించారు. బుధవారం ఉదయం తిరునల్వేలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాస్తవానికి సెప్టెంబర్‌ 27న విజయ్‌ సేలం జిల్లాలో రోడ్‌షోలో జరపాల్సి ఉండగా ఆఖరిక్షణంలో తన పర్యటన మార్చుకుని కరూర్‌కు ఎందుకు వెళ్ళారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


nani2.3.jpg

రోడ్‌షోకు నిర్దేశిత సమయంలో వెళ్ళకుండా ఏడు గంటలకు పైగా ఆలస్యంగా విజయ్‌ వెళ్లటం వల్లే ఆయన్ని దగ్గరగా చూడాలన్న తపనతో పెద్ద సంఖ్యలో గుమికూడారన్నారు. కరూర్‌ దుర్ఘటనపై సీబీఐ(CBI) విచారణ సక్రమంగా జరుగుతుందనే నమ్మకం తనకు లేదని, సీబీఐ విచారణ జరుగుతుందని ప్రకటన రాగానే ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు బెయిలు కోసం ప్రయత్నించిన టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ కోర్టులో దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ వెనక్కితీసుకోవటం వెనుక దాగి ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు.


nani2.2.jpg

కేంద్రంలోని బీజేపీ పాలకులు తమ కూటమిలో చేరాలని టీవీకేకు పిలుపునివ్వటం వల్లే సీబీఐ విజయ్‌పై కేసు నమోదు చేయడానికి తటపటాయిస్తోందని సీమాన్‌ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఎన్డీయేలో చేరకపోతే విజయ్‌పై, బుస్సీ ఆనంద్‌, ఆదవ్‌ అర్జునాపై కేసులు నమోదు చేయటం ఖాయమని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరుగుతాయన్న ఊహాగానాలపై ఆయన వ్యాఖ్యానిస్తూ ముందస్తు ఎన్నికలు జరిగినా, నిర్దేశిత సమయంలో ఎన్నికలు జరిగినా ఫలితాల్లో ఎలాంటి మార్పులు సంభవించవని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో భారీగా తగ్గుదల

భయపెడుతున్న మొంథా తుఫాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2025 | 11:37 AM