Share News

Education Funding India: తమిళనాడు, కేరళకు కేంద్రం గుండు సున్నా

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:46 AM

సమగ్ర శిక్ష అభియాన్‌ ఎస్ఎస్ఏ , పీఎం శ్రీ పథకాల కింద 2024-25లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎలాంటి నిధులు..

Education Funding India: తమిళనాడు, కేరళకు కేంద్రం గుండు సున్నా

  • 2024-25లో విద్యా నిధుల కింద ఒక్క రూపాయి ఇవ్వని కేంద్రం.. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, జూలై 22: సమగ్ర శిక్ష అభియాన్‌ ఎస్ఎస్ఏ , పీఎం శ్రీ పథకాల కింద 2024-25లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎలాంటి నిధులు.. ఇవ్వలేదని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. 2023-24లో ఎస్‌ఎస్‌ఏ కింద తమిళనాడుకు రూ.1876.16 కోట్లు, కేరళకు రూ.141.66 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించింది. అయితే, జాతీయ విద్యా విధానం-2020 అమలు కోసం రూపొందించిన పీఎం-శ్రీ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు నిరాకరించడంతో ఆ రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జూలై 21న పార్లమెంటుకు లిఖిత పూర్వక వివరణ ఇచ్చింది. మరోపక్క, 2024-25లో ఎస్‌ఎ్‌సఏ కింద ఉత్తరప్రదేశ్‌కు రూ.6,264.79 కోట్లు, పీఎం-శ్రీ కింద రూ.246.86 కోట్లు అందాయి. అలాగే, మధ్యప్రదేశ్‌కు ఎస్‌ఎ్‌సఏ కింద రూ.3,434.71 కోట్లు, పీఎం-శ్రీ కింద రూ.145.32 కోట్లు అందాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందన్న విమర్శలు అధికమయ్యాయి. అయితే, పీఎం- శ్రీ పాఠశాలల్లో జాతీయ విద్యా విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం చెబుతోంది. కానీ, జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు, కేరళలు ఎప్పట్నించో వ్యతిరేకిస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:46 AM