Share News

Car Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, ఆరుగురికి గాయాలు..

ABN , Publish Date - May 31 , 2025 | 10:52 AM

కొంత మంది ఒక వివాహ వేడుకకు సంతోషంగా వెళ్లి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు పల్టీ కొట్టింది (Hardoi car accident). దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

Car Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, ఆరుగురికి గాయాలు..
UP Hardoi car accident

పలువురు పెళ్లి వేడుకకు హాజరై కారులో తిరిగి వస్తున్న క్రమంలో అనుకోకుండా అది బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి సహా ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతోపాటు మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ హర్దోయ్ జిల్లా (Hardoi car accident) మజ్హిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని భూప్ప పూర్వా మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పటియానీం గ్రామంలో నిర్వహించిన నీరజ్ వివాహ వేడుక ముగించుకుని, పలీ గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. అందరూ ఒకే కారులో ప్రయాణిస్తున్న సమయంలో అతి వేగంగా వెళ్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అలమ్నగర్ రోడ్డుపై మలుపు వద్ద డిచ్‌లోకి పడిపోయింది.


పోలీస్ స్టేషన్ పరిధిలో..

ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు ప్రకటించారు. మిగతా ఆరుగురిని ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. శహాబాద్ సర్కిల్ ఆఫీసర్ అనుజ్ మిశ్రా మృతుల వివరాలను వెల్లడించారు. వారిలో జితేంద్ర (22), ఆకాష్ (18), సిద్ధార్థ్ (6), రాము (35), జౌహరి (40) ఉన్నారు. ఈ ఐదుగురు హర్దోయిలోని పలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నవారే. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని హర్దోయి జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదం వారి కుటుంబాల్లోనే కాదు, వారి గ్రామాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.


కారణాలు ఇవేనా..

పోలీసుల సమాచారం ప్రకారం పటియానీంగ్రామానికి చెందిన వారంతా, కుస్మాలోని నీరజ్ వివాహానికి హాజరై తిరిగి పాలి గ్రామానికి వెళ్తున్నారు. ఆ క్రమంలోనే భూప్ప పూర్వా వద్ద ఉన్న మలుపు సమీపంలో డ్రైవర్ కారు కంట్రోల్ తప్పి ప్రమాదానికి గురైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్న క్రమంలో ప్రమాదం జరిగిందా లేదా మద్యం సేవించాడా అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు ఇదే రోజు ఉదయం జౌన్‌పూర్ జిల్లాలో కూడా మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బక్షా పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖౌవా గ్రామం వద్ద ప్రయాణికులతో నిండిన ఒక ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.


ఇవీ చదవండి:

మరో షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఆ సుంకం 50 శాతానికి పెంపు

ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 11:47 AM