Share News

Bomb Threat Nashik: నాసిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు..ఇది కూడా నకిలీనా?

ABN , Publish Date - Sep 16 , 2025 | 08:28 AM

దేశంలో మళ్లీ బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాసిక్‌లోని కేంబ్రిడ్జ్ హైస్కూల్ లక్ష్యంగా బాంబు బెదిరింపు మెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది.

Bomb Threat Nashik: నాసిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు..ఇది కూడా నకిలీనా?
Bomb Threat Nashik

దేశంలో మళ్లీ బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాసిక్‌(Nashik)లోని కేంబ్రిడ్జ్ హైస్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో స్కూల్ యాజమాన్యం సెప్టెంబర్ 16న తెల్లవారుజామున 2:45 గంటలకు ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించింది. ఆ మెయిల్లో స్కూల్ బాత్రూమ్‌లో బాంబు ఉందని దుండగులు పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.


బాంబు స్క్వాడ్ వచ్చి

ఇన్‌స్పెక్టర్ తృప్తి సోనావణే ఈ విషయంపై స్పందిస్తూ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సమాచారం అందగానే మేము బాంబు స్క్వాడ్‌ను పిలిచి తనిఖీలు చేశామని తెలిపారు. బాంబు స్క్వాడ్ స్కూల్‌లో ప్రతి మూలా సోదా చేసింది. కానీ, ఎలాంటి అనుమానాస్పద వస్తువూ కనిపించలేదు. ప్రస్తుతం స్కూల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ఇన్‌స్పెక్టర్ సోనావణే స్పష్టం చేశారు.

ఇప్పుడు ఈమెయిల్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. దీని వెనక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ మాత్రం యథావిధిగా నడుస్తోంది. ఆ తర్వాత ఎలాంటి బెదిరింపులు రాలేదు.


ఇది మొదటిసారి కాదు

ఇలాంటి బెదిరింపులు కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం బాంబే హైకోర్టుకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ సమయంలో కోర్టులో ఉన్న జడ్జిలు, లాయర్లు, సిబ్బంది, సందర్శకులు అందరినీ తొందరగా ఖాళీ చేయించారు. ముంబై పోలీసులు కోర్టు ప్రాంగణంలో సోదా చేసి, ఎలాంటి ప్రమాదకర వస్తువు లేదని నిర్ధారించారు. ఆ బెదిరింపు కూడా నకిలీదని తేలింది.


ఇస్కాన్ టెంపుల్‌కు కూడా

గత నెలలో ఆగస్టు 22న ముంబైలోని గిర్గావ్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) రాత్రి పూట సోదాలు చేసి, ఎలాంటి బాంబులూ లేవని నిర్ధారించింది.

ఎందుకు వస్తున్నాయి

పలువురు ఈ బెదిరింపులను డబ్బు కోసం పంపుతుంటారు. మరికొందరు కావాలని చేస్తుంటారు. ఇంకొందరు పలు రకాల టూల్స్ ఉపయోగించి తమ ఐడెంటిటీ దాచుకుంటూ ఆందోళన సృష్టించేందుకు కూడా చేస్తారు. ఇటీవల బెదిరింపు వచ్చిన వాటిలో డిల్లీలో 50కిపైగా పాఠశాలలు, బెంగళూరులో 40 స్కూళ్లు, ముంబైలో అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో వీటి కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 16 , 2025 | 08:30 AM