ITR Deadline Extended: గుడ్ న్యూస్, ఐటీఆర్ గడువు పొడిగింపు..ఎప్పటివరకు ఉందంటే..
ABN , Publish Date - Sep 16 , 2025 | 07:33 AM
ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు కొంత ఊరట లభించింది. ఎందుకంటే ఐటీఆర్ ఫైలింగ్ గడువు మరోసారి నిన్న రాత్రి పొడిగించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఐటీఆర్ ఫైల్ చేసే వారికి ఊరట కలిగించే వార్త వచ్చేసింది. అసలు గడువు నిన్న అర్థరాత్రితో అయిపోయేదే. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) మరో అవకాశం కల్పించింది. 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తేదీని మరో రోజు పొడిగిస్తూ సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 16, 2025 వరకు పెంచామని (ITR Deadline Extended) అధికారికంగా ప్రకటించింది.
ఇది ముఖ్యంగా చివరి నిమిషంలో రిటర్న్ ఫైల్ చేయాలనుకునే వారికి మంచి అవకాశమని చెప్పవచ్చు. ఇంకా దాఖలు చేయని వారు గడువు ముగిసేలోగా.. అంటే ఈరోజు అర్థరాత్రి 12 గంటలలోపు తగిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. చివరి క్షణాల్లో జాప్యం చేయకుండా, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సరికొత్త రికార్డ్
ఈ సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డ్ వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2025 నాటికి 7.3 కోట్లకు పైగా ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి. ఇది గత సంవత్సరం 7.28 కోట్ల రికార్డును బీట్ చేసింది. ఈ విజయానికి కారణం పన్ను చెల్లింపుదారులు, ప్రొఫెషనల్స్ సకాలంలో రిటర్న్‌లు సమర్పించడం. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను విభాగం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలియజేసింది.
ఎలా పరిష్కరించాలి?
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలు ఎదురైనప్పుడు, ఐటీ విభాగం సోమవారం సాయంత్రం బ్రౌజర్ సెట్టింగ్‌లను సరిచేసే మార్గదర్శకాలను విడుదల చేసింది. కొంతమంది ఈ సూచనలు పాటించినప్పటికీ సమస్యలు కొనసాగాయని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ఐటీ విభాగం పోర్టల్‌ను మెరుగుపరచడానికి నిర్వహణ పనులు చేపట్టింది. మీరు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ చిట్కాలను పాటించాలని తెలిపింది.
బ్రౌజర్ కాష్ క్లియర్ చేయండి: మీ బ్రౌజర్‌లోని కాష్, కుకీలను తొలగించండి.
తాజా వెర్షన్ ఉపయోగించండి: మీ బ్రౌజర్ తాజా వెర్షన్‌లో ఉందని నిర్ధారించుకోండి.
ఇతర బ్రౌజర్‌ను ప్రయత్నించండి: గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి వేరొక బ్రౌజర్‌ను ఉపయోగించి ప్రయత్నించండి.
ఇంటర్నెట్ కనెక్షన్: ఇంటర్నెట్ కనెక్షన్ స్థిరంగా ఉందని నిర్ధారించుకోండి.
ఐటీఆర్ ఫైలింగ్ ఎందుకు ముఖ్యం?
ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడం అనేది ప్రతి పన్ను చెల్లింపుదారుడి బాధ్యత. ఇది మీ ఆదాయం, పన్ను చెల్లింపులు, రిఫండ్‌లను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల జరిమానాలు, చట్టపరమైన సమస్యలను నివారించవచ్చు. అంతేకాకుండా రుణాలు, వీసాలు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల కోసం ఐటీఆర్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి