Share News

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. అవినీతికి ఆద్యుడు ఎంపీ రాజా

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:32 PM

కంటికి కనిపించని, గాలిలో కూడా అవినీతికి పాల్పడి కటకటాలు లెక్కించిన డీఎంకే ఎంపీ ఎ.రాజా అవినీతికి ఆధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శించారు.

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. అవినీతికి ఆద్యుడు ఎంపీ రాజా

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌

చెన్నై: కంటికి కనిపించని గాలిలో కూడా అవినీతికి పాల్పడి కటకటాలు లెక్కించిన డీఎంకే ఎంపీ ఎ.రాజా అవినీతికి ఆధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌(BJP Tamil Nadu chief Nayinar Nagendran) విమర్శించారు. టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కమలాలయంలో బుధవారం ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్ళిన సమరయోధుల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు నయినార్‌ నాగేంద్రన్‌ నివాళులర్పించారు.


అనంతరం 1975 జూన్‌ 25వ తేదీ అమలుపరిచిన ఎమర్జెన్సీ గురించి ముద్రించిన ‘ఎమర్జెన్సీ డైరీ’ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కించపరచేలా ఎ.రాజా మాట్లాడటంపై స్పందించిన నయినార్‌ నాగేంద్రన్‌, కేంద్రంలో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో వున్న సమయంలో డీఎంకే నుంచి మంత్రిగా వ్యవహరించిన ఎ.రాజా స్పెక్ట్రమ్‌ కుంభకోణానికి పాల్పడి జైలు పాలై ప్రజలచేత ఛీ కొట్టించుకున్నారని విమర్శించారు.


nani3.2.jpg

గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, మహిళలపై వేధింపులు, దోపిడీ, దొంగతనాలు అధికమయ్యాయని నాగేంద్రన్‌ ఎద్దేవా చేశారు. నేరాలు, అవినీతికి దాసోహమై ప్రజా ధనాన్ని దోచుకోవడంలో ప్రావీణ్యుడైన ఎ.రాజా తన గతాన్ని మర్చిపోయి ఇతరులను విమర్శిస్తున్న తీరును నయినార్‌ నాగేంద్రన్‌ ఖండించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 26 , 2025 | 04:18 PM