Central Government: ఆ 28 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చండి
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:14 AM
రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉండి కేంద్రంలో ఓబీసీ జాబితాలో లేని 28 కులాలను ఆ జాబితాలో చేర్చాలని
కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉండి కేంద్రంలో ఓబీసీ జాబితాలో లేని 28 కులాలను ఆ జాబితాలో చేర్చాలని కేంద్రప్రభుత్వానికి బీజేపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఓబీసీ సాధన సమితి అధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఓబీసీ సెమినార్‌కు బీజేపీ ఎంపీలు ఆర్.కృష్ణయ్య, ఈటల రాజేందర్, గోడం నగేష్, డీకే అరుణ, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ నేతలు మాట్లాడుతూ.. 28 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చే అంశాన్ని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఈ కులాల్లో 16 కులాలు సంచార జాతులే ఉన్నాయన్నారు. సొండి, వీరశైవ లింగాయత్, గొంగిడి, అరె మరాఠి, భైరికమ్మరి, భాగవతుల, కాటిపాపల తదితర 28 కులాలను 20 ఏళ్ల కిందటే రాష్ట్ర బీసీ కులాల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. కేంద్రంలో ఓబీసీ జాబితాలో చేర్చకపోవడంతో ఈ 28 కులాలకు చెందిన యువత విద్య, ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News