Share News

BJP: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేతల మేధోమథనం

ABN , Publish Date - Sep 17 , 2025 | 10:44 AM

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కూటమిలో కొత్త పార్టీల చేరిక తదితర అంశాలపై మంగళవారం జరిగిన బీజేపీ చింతనా సమావేశంలో పార్టీ నేతలు సమీక్ష జరిపారు. మహాబలిపురం సమీపంలోని ఓ హాలులో ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీఎల్‌ సంతోష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

BJP: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేతల మేధోమథనం

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కూటమిలో కొత్త పార్టీల చేరిక తదితర అంశాలపై మంగళవారం జరిగిన బీజేపీ(BJP) చింతనా సమావేశంలో పార్టీ నేతలు సమీక్ష జరిపారు. మహాబలిపురం(Mahabalipuram) సమీపంలోని ఓ హాలులో ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీఎల్‌ సంతోష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌, మాజీ అధ్యక్షుడు అన్నామలై, కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌, రాష్ట్ర ఇన్‌చార్జులు అరవింద్‌ మేనన్‌, డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్‌ రాధాకృష్ణన్‌, డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హెచ్‌.రాజా, వ్యవస్థాపక కార్యదర్శి కేశవ వినాయకన్‌, కరు నాగరాజన్‌, పార్టీ జిల్లా శాఖల కార్యదర్శులు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమిలో సమస్యలపై నేతలు సమగ్రంగా చర్చించారు.


nani2.3.jpg

కూటమి బలోపేతానికి నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం ఆరుగంటల దాకా సాగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, రాష్ట్రంలో డీఎంకే అవినీతి, అక్రమాలపై, ఆ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలను ముద్రించి ఇంటింటా ప్రచారం చేయాలని సీనియర్‌ నేతలు జిల్లా నేతలకు సూచించారు.


nani2.2.jpg

అక్టోబర్‌ నుంచి నయినార్‌ ప్రచారం...

ఈ సమావేశంలో పాల్గొన్న అన్నామలై మాట్లాడుతూ.. అక్టోబర్‌ మొదటి వారం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ రాష్ట్రంలో పర్యటిస్తారని ప్రకటించారు. ఈ ప్రచార పర్యటనలో కీలకమైన ప్రాంతాల్లో బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పర్యటనకు పార్టీ స్థానిక నాయకులు మద్దతునివ్వాలని, జనసమీకరణకు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?

సిందూర్‌ తో మసూద్‌ కుటుంబం చిన్నాభిన్నం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 17 , 2025 | 10:51 AM