Share News

BJP Leader: బీజేపీ నేతకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య..

ABN , Publish Date - Mar 11 , 2025 | 08:01 AM

ఓ బీజేపీ రాజకీయ నేతను ప్లాన్ ప్రకారం పక్కాగా హత్య చేసి పారిపోయారు. కానీ అందుకోసం కత్తులు, గన్స్ వంటి వాటిని ఉపయోగించలేదు. మెల్లగా వచ్చి మాటల్లో పెట్టి, ఆ నేతకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణించేలా చేశారు.

BJP Leader: బీజేపీ నేతకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య..
BJP Leader Gulfam Singh Yadav

ఓ బీజేపీ నేతను దారుణంగా హత్య చేశారు. ప్లాన్ వేసి పథకం ప్రకారం విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణించేలా చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే, 60 ఏళ్ల గుల్ఫం సింగ్ యాదవ్‌, జునావాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్తారా గ్రామంలోని తన పొలంలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి, యాదవ్‌ను కలిసేందుకు వచ్చారు. ఆ తర్వాత అతని పక్కనే కూర్చుని, అతని క్షేమం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలో మంచినీరు కావాలని అడిగారు. యాదవ్ వారికి నీళ్లు ఇచ్చిన తర్వాత, దుండగులు అతనికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయారు.


ఇది జరిగిన వెంటనే యాదవ్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. అతను నొప్పితో అరుపులు చేశాడు. దీంతో అతని కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల ఉన్న వారు కూడా వచ్చి, యాదవ్‌ను చికిత్స కోసం అలీఘర్‌కు తరలించారు. కానీ మార్గమధ్యలోనే అతను మరణించాడు. అయితే ఇప్పటివరకు బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేసును దర్యాప్తు చేయడానికి పోలీసు బృందాన్ని నియమించామని గన్నౌర్ సర్కిల్ ఆఫీసర్ దీపక్ తివారీ తెలిపారు.


యాదవ్ మృతికి కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఫోరెన్సిక్ బృందాలను ఘటనా స్థలానికి పంపించి, ఆధారాలను సేకరించారు. అందులో ఖాళీ ఇంజెక్షన్, హెల్మెట్ వంటివి ఉన్నాయి. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ASP అనుకృతి శర్మ అన్నారు. యాదవ్ 2004 ఉప ఎన్నికల్లో గన్నౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. దీంతోపాటు ఆయన బీజేపీలో అనేక పదవులను నిర్వహించారు.


యాదవ్ మరణం తరువాత, సోమవారం ఆలస్యంగా అనేక మంది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు అలీఘర్ మెడికల్ కాలేజీలో సమావేశమై, ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని, దుండగులను పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీంతో ఆ నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Elon Musk: సోషల్ మీడియా Xలో అంతరాయం.. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిందన్న ఎలాన్ మస్క్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 11 , 2025 | 08:01 AM