Elon Musk: సోషల్ మీడియా Xలో అంతరాయం.. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిందన్న ఎలాన్ మస్క్
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:52 AM
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో నిన్న పలు మార్లు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు అనేక ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ తాజాగా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ X (గతంలో ట్విట్టర్)లో మార్చి 10, 2025న మూడు సార్లు సేవల్లో ఇబ్బందులు వచ్చాయి. దీంతో సంస్థ ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ సేవా అంతరాయాలను ఎదుర్కొంది. ఈ సమస్య US, భారతదేశం, UK, ఆస్ట్రేలియా, కెనడా వంటి వివిధ దేశాలలో వినియోగదారులను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆ క్రమంలో వెబ్, మొబైల్ యాప్‌ల ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో అనేక మందికి ఇబ్బందులు వచ్చాయి.
ఏ సమయాల్లో వచ్చింది..
ఆన్‌లైన్ సేవా అంతరాయాలను ట్రాక్ చేసే Downdetector.com ప్రకారం ఈ అంతరాయం గురించి ఫిర్యాదులు మొదట ఉదయం 6:00 గంటలకు మొదలయ్యాయని తెలిపింది. మళ్లి 10 గంటలకు వినియోగదారుల ఫిర్యాదులు పెరిగాయన్నారు. ఆ తర్వాత 12:00 PMకి సేవల్లో అంతరాయం ఏర్పడి దాదాపు గంట పాటు కొనసాగినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో US తీరప్రాంతాల ప్రజలకు ఇదే అంతరాయాలు వచ్చాయి. ఆ సమయంలో 56 శాతం వినియోగదారులు X మొబైల్ యాప్‌లో సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో 33 శాతం వినియోగదారులు వెబ్‌సైట్‌లో సమస్యల గురించి ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మిగిలిన 11 శాతం వినియోగదారులకు సర్వర్ కనెక్షన్ లోపాలు వచ్చినట్లు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా అంతరాయం
ఈ అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లను ప్రభావితం చేసింది. భారతదేశం సహా అనేక దేశాలలో వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో సాయంత్రం 7:00 IST నాటికి ఫిర్యాదులు చేసేవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండియా నుంచి 2,600 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంతరాయం అనేక ఇతర దేశాల వినియోగదారులపై కూడా ప్రభావం చూపింది. దీంతో అనేక మంది వినియోగదారులు X సేవలను యాక్సెస్ చేయలేకపోయారు.
సైబర్ దాడి సమస్య..
దీనిపై స్పందించిన X యజమాని ఎలాన్ మస్క్, ఈ అంతరాయానికి సైబర్ దాడి కారణం కావచ్చన్నారు. తమ సంస్థపై పెద్ద ఎత్తున సైబర్ దాడి జరిగిందని, ఇది సేవల్లో అంతరాయాలను తెచ్చేలా చేసిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం X భద్రతా వ్యవస్థలపై అనేక ప్రశ్నలను రేపుతున్నాయి. అయితే నిజంగా ఈ అంతరాయం సైబర్ దాడి వల్ల జరిగిందా? లేక X సాంకేతిక వ్యవస్థలో లోపాలు వల్ల వచ్చిందా అనేది తేలాల్సి ఉంది.
కొనసాగుతున్న సాంకేతిక సమస్యలు
ఇది X ప్లాట్‌ఫారమ్‌కు తొలి సారి కాదు. గతంలో కూడా X (అప్పుడు ట్విట్టర్) పెద్ద అంతరాయాలను ఎదుర్కొంది. 2023 మార్చిలో, ట్విట్టర్ సేవలు దాదాపు గంట పాటు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో లాగిన్ వైఫల్యం, ఇమేజ్-లోడింగ్ వంటి పలు రకాల సమస్యలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News