BJP: తమిళనాడు బీజేపీకి నూతన ఎన్నికల ఇన్‌చార్జ్‌ల నియామకం..
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:30 AM
వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నూతన ఎన్నికల చార్జులను నియమించింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మొహోల్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
- బైజయంత్ పాండా, మురళీధర్ మొహోల్
చెన్నై: వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ(BJP) సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నూతన ఎన్నికల చార్జులను నియమించింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మొహోల్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్(Arun Singh) ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నూతన ఇన్‌చార్జుల నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.

శాసనసభకు వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటికే ముమ్మర సన్నాహాలు చేపట్టాయి. అన్నాడీఎంకే(AIADMK)తో పొత్తు పెట్టుకున్న బీజేపీ(BJP) కూడా కింది స్థాయి నుంచి ప్రచారం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో, పార్టీ నూతన ఎన్నికల చార్జ్‌లు నియమితులయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News and National News