Nitin Nabin: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:35 PM
బిహార్ మంత్రి నితిన్ నబిన్‌ను బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ నియమించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వచ్చింది.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) కీలక నియామకం చేపట్టింది. బిహార్ మంత్రి నితిన్ నబిన్ (Nitin Nabin)ను బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BJP National Wroking President)గా నియమించింది. తక్షణం ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారంనాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నితిన్ నబిన్ నియామకాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించినట్టు ఆయన తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా 2020 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆయన తన పదవీకాలం పూర్తిచేశారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక ఎన్నికల సందర్భాలను పురస్కరించుకుని ఆయన పదవీకాలాన్ని పార్టీ పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో సంస్థాగత పునర్వవస్థీకరణను పార్టీ చేపట్టింది.
నితిన్ నబిన్ ఎవరు?
నితిన్ నబిన్ బీహార్‌కు చెందిన బీజేపీ నేత. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక నేతగా పేరు తెచ్చుకున్నారు. పాట్నాలో ఆయన జన్మించారు. బీజేపీ వెటరన్ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడే నితిన్ నబిన్. తన తండ్రి మరణాంతరం ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన నితీష్ ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. నితిన్ నబిన్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి పాట్నా వెస్ట్ నుంచి గెలిచారు. ఆ తర్వాత బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు 2010, 2015, 2020, 2025లో నెగ్గారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంకీపూర్ నుంచి తమ సమీప ప్రత్యర్థిపై 51 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణమిదే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి