Share News

Bihar Assembly Election: ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

ABN , Publish Date - Nov 13 , 2025 | 07:47 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Bihar Assembly Election: ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ, నవంబర్ 13: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుపుతారు. అనంతరం అంటే.. 8.30 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతుంది. అందుకోసం 243 రిటర్నింగ్ అధికారులు, 243 పరిశీలకుల ఈ ఓట్ల లెక్కింపును పర్యవేక్షించనున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో- ఆబ్జర్వర్లతో సిబ్బందిని ఏర్పాటు చేశారు. అందుకోసం ఎన్నికల సంఘం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు నియమించిన 18 వేల మందికిపైగా ఏజెంట్స్ సైతం ఈ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు.


రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. నవంబర్ 6వ తేదీన 121 స్థానాలకు, నవంబర్ 11వ తేదీన 122 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ రెండు విడతల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. దీంతో 67.13 శాతం పోలింగ్ నమోదయింది. 1951 తర్వాత.. ఆ రాష్ట్రంలో ఇంత భారీగా పోలింగ్ నమోదకావడం ఇదే తొలిసారి. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందంటూ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు స్పష్టం చేశాయి. మరి ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనే దానిపై శుక్రవారం సాయంత్రానికి స్పష్టత రానుంది.


మరో వైపు ఈ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజు ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లును ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. అందులో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం సైతం ఉంది. ఈ అసెంబ్లీ స్థానానికి మంగళవారం అంటే.. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికను నిర్వహించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

లోకేశ్ ఆసక్తికర ట్విట్.. యువతలో తీవ్ర చర్చ

For More National News And Telugu News

Updated Date - Nov 13 , 2025 | 09:09 PM