Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్.. యువతలో తీవ్ర చర్చ
ABN , Publish Date - Nov 13 , 2025 | 08:47 PM
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో అందరిలో టెన్షన్ నెలకొంది.
విశాఖపట్నం, నవంబర్ 13: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర అయింది. ఈ సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తాయి. విశాఖపట్నం వేదికగా సీఐఐ సారథ్యంలో భాగస్వామ్య సదస్సు గురువారం ప్రారంభంకానుంది. అలాంటి వేళ.. ఒక రోజు ముందుగా అంటే.. గురువారం రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో అందరిలో టెన్షన్ నెలకొంది.
నారా లోకేశ్.. తన ఎక్స్ ఖాతా వేదికగా..రేపు ఉదయం అంటే.. శుక్రవారం ఉదయం 9 గంటలకు పెద్ద ఆవిష్కరణ జరగనుందన్నారు. అదేమిటో ఎవరైనా ఊహించగలారా ? అంటూ ప్రశ్నించారు. బోర్డు రూమ్‌లో చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్, చూజ్ స్పీడ్, చూజ్ ఏపీలకు హ్యాష్ ట్యాగ్ చేశారు.
భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, సీఈఓలు, ఆయా దేశాల ఉన్నతాధికారులు విశాఖకు చేరుకున్నారు. వారంతా సీఎం చంద్రబాబుతో వరుసగా సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఉంటుందని లోకేశ్ ట్విట్ చేసిన తర్వాత ఒక చర్చ ఊపందుకుంది. సదరు సంస్థ రాష్ట్రంలో అతి భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అందుకే లోకేశ్ ఈ ప్రకటన చేసి ఉంటారనే ఒక ప్రచారం సైతం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
విశాఖకు త్వరలో 30 వేల ఉద్యోగాలు: నారా లోకేశ్
For More AP News And Telugu News