MLA: చేతులు ఎత్తితే సభాపతి కావచ్చు.. ఎమ్మెల్యే కాలేరు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:16 PM
రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే కానీ ఇటీవల అన్ని విషయాలలోను కాంగ్రెస్‌కు చెందిన వారు హాట్‌టాపిక్ గా మారుతున్నారు. అటువంటి వారిలో చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా ఒకరు.
- ప్రదీప్ ఈశ్వర్
బెంగళూరు: రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే కానీ ఇటీవల అన్ని విషయాలలోను కాంగ్రెస్‌కు చెందిన వారు హాట్‌టాపిక్ గా మారుతున్నారు. అటువంటి వారిలో చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్(Chikkballapura MLA Pradeep Eeshwar) కూడా ఒకరు. ఇటీవల మీడియాతో మాట్లాడిన పరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రదీప్ ఈశ్వర్ ఓ ఆకస్మిక ఎమ్మెల్యే అన్నారు. అందుకు ప్రదీప్ ఈశ్వర్ శుక్రవారం స్పందిస్తూ.. పరిషత్‌లో సభ్యులు చేతులు ఎత్తితే సభాపతి కాగలరని కానీ ఎమ్మెల్యే కావడం సాధ్యం కాదన్నారు.

కనీసం లక్ష ఓట్లు కావాలన్నారు. అయితే ప్రదీప్ ఈశ్వర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభాపతి బసవరాజ హొరట్టి ఏడుసార్లు వరుసగా ఒకే స్థానం నుంచి ఎమ్మెల్సీ(MLC)గా ఎన్నికైన వారు. అటువంటి చరిత్ర కలిగిన వారు బహుశా దేశంలోనే లేరు. అటువంటి సీనియర్ నేతపైనా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని విమర్శలు వ్యక్తం కాగా కొందరు ప్రదీప్ ఈశ్వర్‌కు మద్దతుగాను సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
Read Latest Telangana News and National News