Sabarimala Telugu Devotee Attack: పళనిలో తెలుగు భక్తుడిపై దాడి..
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:58 PM
తమిళనాడు రాష్ట్రంలోని పళనిలో తెలుగు భక్తుడిపై దాడి జరిగింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు స్థానిక వ్యాపారి గాజు సీసాతో దాడి చేశాడు. అంతేకాకుండా..
ఇంటర్నెట్ డెస్క్: శబరిమల యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి జరిగింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు స్థానిక వ్యాపారి దాడి చేశాడు. గాజు సీసాతో భక్తుడి తల పగులగొట్టాడు. గాజుసీసాతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది.
విషయం తెలుసుకున్న తెలుగు భక్తులు ఘటనాస్థలికి చేరుకుని వ్యాపారి దాడికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అయితే, స్థానిక వ్యాపారులంతా ఒక్కటై తెలుగు భక్తులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు తెలుగు భక్తులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కూడా వ్యాపారులకే మద్దతు ఇస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.
Also Read:
నిబంధనలకు 'నీళ్లు'.. నీటి నాణ్యత గాలికి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
For MOre Latest News