Share News

Metro trains: మెట్రోరైళ్లలో యాంటీ ట్రాక్‌ సిస్టమ్‌..

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:54 PM

మెట్రోరైళ్లకు సంబంధించి కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా.. మెట్రోరైళ్ల తలుపుల్లో బట్టలు, బ్యాగులు ఇరుక్కుపోకుండా కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) అధికారులు తెలిపారు.

Metro trains: మెట్రోరైళ్లలో యాంటీ ట్రాక్‌ సిస్టమ్‌..

చెన్నై: మెట్రోరైళ్ల(Metro trains) తలుపుల్లో బట్టలు, బ్యాగులు ఇరుక్కుపోకుండా కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) అధికారులు తెలిపారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ... ప్రస్తుతం నగరంలో నడుపుతున్న మెట్రోరైలు డోర్‌ సెన్సార్లు 10 మి.మీ మందం ఉంటేనే అడ్డంకులను గుర్తించగలవని తెలిపారు. అయినా, చాలా వరకు దుస్తులు, బ్యాగు పట్టీలు 0.3 మి.మీ కంటే తక్కువగా ఉండడంతో సెన్సార్లు వాటిని గుర్తించలేకపోతున్నాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: High Court: ప్రభుత్వోద్యోగంలో చేరాలంటే తమిళం రాయడం, చదవడం తెలియాల్సిందే..


nani4.2.jpg

అలాంటి సమయంలో భద్రతా సిబ్బంది, ప్రయాణికులు ఎమర్జెన్సీ బటన్‌ నొక్కాల్సి ఉందన్నారు. ఈ సమస్య పరిష్కరించేలా అన్ని మెట్రోరైళ్లలో ‘యాంటీ ట్రాక్‌ సిస్టమ్‌’(‘Anti-track system’) అనే కొత్త టెక్నాలజీ అమర్చనున్నామని, ఇందుకు రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. మెట్రోరైలు డోర్ల మధ్య రబ్బర్‌ బెల్స్‌ మార్చి ఈ కొత్త టెక్నాలజీతో కూడిన సెన్సార్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేయనున్నామన్నారు. మెట్రోరైలు డోర్లలో చిక్కుకున్న వస్తువుల నుంచి వచ్చే స్వల్ప శక్తిని కూడా ఇది గుర్తించగలదని, అలాగే, ప్రయాణికుడిని లాగే సమయంలోనూ అత్యవసర బ్రేక్‌ పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.


nani4.4.jpg

ఈ వార్తలను కూడా చదవండి:

Harish Rao: సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి

కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు

Farmers: పంటతడి.. కంటతడి!

కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Mar 11 , 2025 | 01:54 PM