Alka Lamba: ప్రభుత్వ వ్యతిరేకత ఉంది.. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:03 PM
కాంగ్రెస్ 140 సంవత్సరాల పార్టీ అని, అటు అధికారంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ కూడా ఉందని తెలిపారు. షీలాదీక్షిత్ ఫ్లైఓవర్లు నిర్మించి ఉండకపోతే ఢిల్లీలో ప్రతిచోటా ట్రాఫిక్ జామ్‌లే ఉండేవని అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని ఆ పార్టీ అభ్యర్థి అల్కా లంబా (Alka Lamba) అన్నారు. ఆప్, బీజేపీలు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున ఢిల్లీలోని వాతావరణ కాలుష్యం, నేరాలు, పాలన వంటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం కాంగ్రెస్‌కే ఉందని చెప్పారు. ఢిల్లీలోని కాలుష్యంతో పోరాడే రోడ్‌మ్యాప్ తమ పార్టీ వద్ద ఉందని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కల్గాజీ నియోకవర్గం నుంచి ముఖ్యమంత్రి అతిషిపై అల్కా లంబా పోటీ చేస్తున్నారు.
Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే
''కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయోజనాలు చేకూర్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. 2000 నుంచి 2500 ఆర్థిక సాయం నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నాం'' అని అల్కాలంబా తెలిపారు. కాంగ్రెస్ 140 సంవత్సరాల పార్టీ అని, అటు అధికారంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ కూడా ఉందని తెలిపారు. షీలాదీక్షిత్ (మాజీ సీఎం) ఫ్లైఓవర్లు నిర్మించి ఉండకపోతే ఢిల్లీలో ప్రతిచోటా ట్రాఫిక్ జామ్‌లే ఉండేవని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో వృద్ధులు, పిల్లలు విషవాయువులు పీల్చాల్సి వస్తోందని, అంటువ్యాధుల భయం కూడా కనిపిస్తోందని, కాలుష్య నివారణకు తమ వద్ద సమగ్ర రోడ్ మ్యాప్ ఉందని చెప్పారు.
శాశ్వత పరిష్కారం కావాలి
ఒక వేవ్‌లా 2015, 2020లో ఆప్‌కి ఢిల్లీలో సీట్లు వచ్చాయని, దాని ఫలితం ఇవాళ ఢిల్లీ కాలుష్యం బారినపడిందని అల్కాలంబా అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలన్నారు. ఢిల్లీ నేరాల రాజధానిగా మారిందని, దానికి కూడా శాశ్వత పరిష్కారం అవసరమని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చెప్పడాన్ని అల్కా లంబా తప్పుపట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళ పట్ల చూపాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. "నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఇది ఐదోసారి. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో సిట్టింగ్ సీఎంను టెంపరరీ సీఎం అని సంబోధించడడం నేను ఎప్పుడూ చూడలేదు. అందులోనూ ఒక మాజీ సీఎం ఈ విధంగా మాట్లాడటం మహిళల గౌరవాన్ని కించపరచడమే అవుతుంది'' అని అన్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎన్నికల తేదీని ఈసీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Grameen Bharat Mahotsav 2025: రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
BJP: ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం..
Read More National News and Latest Telugu News