Breaking: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మంత్రి లోకేశ్ భేటీ
ABN , First Publish Date - Dec 15 , 2025 | 07:38 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 15, 2025 21:54 IST
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.
రాష్ట్రంలో విద్యాప్రమాణాల పెంపునకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీకి 11 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని మంత్రి లోకేశ్ కోరారు.
స్టార్స్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి రూ.4,400 కోట్లు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రూ.1,270 కోట్ల అదనపు నిధుల మంజూరుకు ఆమోదం తెలపాలని మంత్రి లోకేశ్ కోరారు.
‘పీఎం పోషణ్’ కింద ఏపీలో 155 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
-
Dec 15, 2025 21:27 IST
వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును పెంచుతున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది.
జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో పెంచిన సర్వీసు ఫీజు అమల్లోకి రానుంది.
భారత్ సహా 25 దేశాల్లో ఈ పెంపును చేపడుతున్నట్లు వెల్లడించింది.
నిర్వహణపరమైన ఖర్చులు ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
-
Dec 15, 2025 21:16 IST
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
పట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ మహిళ హిజాబ్‌ను సీఎం నితీశ్ కుమార్ లాగారు.
దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇది ఆయన మానసిక చర్యను తెలియజేస్తోందంటూ కాంగ్రెస్, ఆర్జేడీ విమర్శలు గుప్పిస్తున్నాయి.
-
Dec 15, 2025 21:05 IST
జగన్ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంలో కీలక మలుపు
NGT విధించిన రూ.18 కోట్ల జరిమానా మొత్తంలో ప్రస్తుతానికి రూ . 7 కోట్లు చెల్లించాలని జేపి వెంచర్స్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మూడు వారాల్లో రూ 7 కోట్లు చెల్లిస్తామని జేపి వెంచర్స్ కోర్టు కి తెలిపింది.
NGT విధించిన 18 ఈసీలలో 7 మాత్రమే తమ పేరుతో ఉన్నాయని జేపి వెంచర్స్ తెలిపింది.
తమ పేరుతో 7 ఈసీ లు మాత్రమే ఉన్నాయని , మిగతా రూ . 12 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని జేపి వెంచర్స్ న్యాయస్థానికి తెలిపింది.
సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను జనవరి కి వాయిదా వేసింది.
-
Dec 15, 2025 20:57 IST
వరల్డ్ కప్2025లో సత్తా చాటి శ్రీచరణికి నగదు బహుమతి.
ఏపీ ప్రభుత్వం తరుఫున శ్రీచరణికి రూ.2.50 కోట్ల నగదు బహుమతి.
కడపలో 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలం కేటాయించిన ప్రభుత్వం.
గ్రూప్-1 హోదాలో శ్రీచరణిని నియమించిన కూటమి ప్రభుత్వం
శ్రీచరణిని గ్రూప్-1 జాబ్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
-
Dec 15, 2025 18:52 IST
జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరగాల్సిన మెస్సీ భేటీ రద్దైంది.
ఇవాళ(సోమవారం) వీరిద్దరూ 21 నిమిషాల పాటు భేటీ కావాల్సి ఉంది.
-
Dec 15, 2025 18:48 IST
అరుణ్ జైట్లీ స్టేడియంలో మెస్సీ భావోద్వేగంగా ప్రసంగించారు. ' భారతీయులు చూపిన ప్రేమ, అభిమానంకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు చూపిన ప్రేమను మేము మాతో పాటు తీసుకువెళ్తున్నాము. మేము ఖచ్చితంగా తిరిగి వస్తాము. ఏదో ఒక రోజు ఒక మ్యాచ్ ఆడటానికి లేదా మరో సందర్భంలోనైనా, ఇండియాను సందర్శించడానికి ఖచ్చితంగా తిరిగి వస్తాము. మాపై ఎంతో అభిమానం చూపిన మీకు చాలా ధన్యవాదాలు' అని మెస్సీ అన్నారు.
-
Dec 15, 2025 18:35 IST
ఈ కార్యక్రమం తర్వాత మెస్సీ ఢిల్లీలోని పురానా ఖిలాకు బయలుదేరుతారు.
అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తి, ఆర్మీ చీఫ్, అర్జెంటీనా రాయబారితో పై పాటు మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులను మెస్సీ కలుస్తారు.
-
Dec 15, 2025 18:30 IST
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏతో తలపడనుంది.
ఫిబ్రవరి 7న వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రావాలని మెస్సిని జై షా కోరాడు.
ఈ మేరకు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్‌ను మెస్సికి అందించాడు.
ఈ కార్యక్రమానికి డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ హాజరయ్యారు.
-
Dec 15, 2025 18:25 IST
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో లియోనెల్ మెస్సీ ప్రేక్షకులను ఉత్సాహాపరిచారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఐసిసి అధ్యక్షుడు జై షాలు ఈ ఫుట్‌బాల్ దిగ్గజాన్ని కలిశారు.
-
Dec 15, 2025 18:11 IST
ఢిల్లీలో మెస్సీ.. తరలివచ్చిన అభిమానులు..
మెస్సీ మ్యాచ్ చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
పొగమంచు కారణంగా ఆలస్యమైన మెస్సీ ప్రత్యేక విమానం..

-
Dec 15, 2025 17:18 IST
మావోయిస్టులకు రిమాండ్ పొడిగింపు
విజయవాడ: మావోయిస్టులకు రిమాండ్ పొడిగింపు
పెనమలూరులో పట్టుబడిన మావోయిస్టులకు ఈనెల 29 వరకు రిమాండ్ పొడిగించిన కోర్టు..
వర్చువల్‌గా మావోయిస్టులను న్యాయమూర్తి ముందు హాజరుపరచిన జైలు అధికారులు..
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా మొత్తం 25 మంది మావోయిస్టులు.
-
Dec 15, 2025 17:04 IST
బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్
బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ సరవాగిని నియమించిన బిజెపి అధిష్టానం
ప్రస్తుతం బీహార్‌లో ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ సరవాగి
వివిధ రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను మరింత వేగం చేసిన బీజేపీ.
-
Dec 15, 2025 16:52 IST
స్టీల్ కంపెనీలో పేలుడు.. కార్మికుడు మృతి..
మెదక్: మనోహరబాద్ రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో బట్టీలు పేలి కార్మికుడు మృతి..
మరో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు .. ఆసుపత్రికి తరలింపు..
కంపెనీలో నుంచి దట్టమైన పొగ వెలువడుతుండడంతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.
-
Dec 15, 2025 16:42 IST
ఎన్నికల అధికారిని గదిలో బంధించి..
సూర్యాపేట : చిలుకూరు మండలం సీతారామపురం గ్రామంలో ఉద్రిక్తత..
ఎన్నికల అధికారిని గ్రామ పంచాయతీ గదిలో బంధించిన గ్రామస్థులు..
ఉపసర్పంచ్ పదవి ముందుగానే ప్రకటించారంటూ ఆర్వో నాగరాజు నిర్ణయంపై గ్రామస్తుల ఆగ్రహం..
పంచాయతీ గేటు ముందు ప్రజల నిరసన.
-
Dec 15, 2025 16:27 IST
ఐపీఎస్ సంజయ్‌కు బెయిల్..
విజయవాడ: ఐపీఎస్ సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు..
ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసిన ఏసీబీ కోర్టు..
బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు..
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న సంజయ్..
ఇదే కేసులో అరెస్టు అయిన కొండలరావు కు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.
-
Dec 15, 2025 16:25 IST
ఎమ్మెల్యే సునీత రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..
మెదక్: కొల్చారం మండలం రంగంపేటలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ..
రంగంపేటలో స్వల్ప ఉద్రిక్తత, ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట..
ఇరువర్గాల వారిని చెదరగొట్టిన పోలీసులు.
-
Dec 15, 2025 15:27 IST
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్..
ముంబై: ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు..
ఉగ్రవాదులు సాజన్, మనీష్ బేడీగా గుర్తింపు..
ISI ఆదేశాల మేరకు పనిచేస్తున్న ఉగ్రవాదులుగా గుర్తింపు..
అర్మేనియా నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తింపు.
-
Dec 15, 2025 15:15 IST
రెండు బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
లోక్‌సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం..
వికసిత్ భారత్ శిక్ష అధిష్ఠాన్, ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లులు..
వికసిత్ భారత్ బిల్లును జేపీసీకి పంపే అవకాశం.
-
Dec 15, 2025 15:13 IST
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో లోకేష్ భేటీ
ఢిల్లీ: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ..
నైపుణ్య గణనకు సహకారం అందించాలని కోరిన లోకేష్ ..
పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో చర్చించిన మంత్రి లోకేష్..
-
Dec 15, 2025 14:55 IST
నకిలీ నెయ్యి కేసులో చిన్నపన్నకు షాక్..
శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ చిన్నపన్నకు హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.
ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
-
Dec 15, 2025 14:52 IST
డీ లిమిటెషన్‌పై హైకోర్టులో పిటిషన్..
హైదరాబాద్ : GHMC లో డీ లిమిటెషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు రిట్ పిటిషన్..
డీ లిమిటెషన్ అసంబంద్ధంగా ఉండంటూ పిటిషన్..
ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డీ లిమిటెషన్ చేసారని పిటిషన్..
లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ కుమార్..
మధ్యాహ్నం 3గంటలకి విచారించునున్న హైకోర్టు.
-
Dec 15, 2025 14:24 IST
లిక్కర్ కేసు విచారణ వాయిదా..
విజయవాడ: ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు నిందితుల బెయిల్‍పై విచారణ..
చాణక్య బెయిల్ పిటిషన్‍పై 17న వాదనలు విననున్న కోర్టు..
అనిల్ చోఖ్రా బెయిల్‍పై కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సిట్..
తదుపరి విచారణను డిసెంబర్ 17కు వాయిదా.
-
Dec 15, 2025 14:05 IST
మరోసారి పెద్దపులి కలకలం..
కామారెడ్డి: జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం..
దోమకొండ మండలం అంబారిపేట శివారులో పెద్దపులి సంచారం..
పులి కదలికలు ట్రాక్ కెమెరాలో రికార్డు..
నిన్న స్వామి గౌడ్ అనే రైతు దూడలపై దాడి చేసి చంపింది పెద్దపులిగా గుర్తింపు..
మొదట చిరుతగా భావించి తనిఖీలు చేపట్టిన అటవీ అధికారులు..
చివరికి పెద్దపులి ఆనవాళ్ళు గుర్తింపు..
టైగర్ సంచారంతో భయాందోళనలో గ్రామస్తులు..
టైగర్ కోసం బోన్ ఏర్పాటుచేసిన ఫారెస్ట్ అధికారులు.
-
Dec 15, 2025 13:32 IST
నెల్లూరుకి చేరుకున్న సుపరిపాలన బస్సుయాత్ర.
నెల్లూరుకి చేరుకున్న అటల్... మోది సుపరిపాలన బస్సుయాత్ర.
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహం ఆవిష్కరణ.
పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు ఆనం, సత్యకుమార్, ఎంపీలు వేమిరెడ్టి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్టి, ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేశ్, ఇంటూరి.
-
Dec 15, 2025 13:13 IST
బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా
ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా..
వచ్చేనెల 21 కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ..
ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా..
రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన కౌంటర్లపై రిజాయిండర్ దాఖలుకు సమయం కోరిన నిందితుల తరపు న్యాయవాదులు..
మద్యం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌ని రద్దు చేసిన రాష్ట్ర హైకోర్టు..
హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన ముగ్గురు నిందితులు.
-
Dec 15, 2025 13:04 IST
పార్లమెంట్‌కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్..
పార్లమెంట్‌లో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన ఎంపీలు, మంత్రులు..
టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్..
మరికాసేపట్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ లతో సమావేశం కానున్న లోకేష్..
విద్య, ఐటీ శాఖలకు సంబంధించిన పలు అంశాల పై కేంద్ర మంత్రులతో చర్చించనున్న మంత్రి.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరి భేటీ.
-
Dec 15, 2025 12:08 IST
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్
ఈసీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఖైదీ 420గా చిత్రీకరిస్తున్నారని బీజేపీ ఆరోపణ
-
Dec 15, 2025 12:06 IST
ప్రధానిపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: నడ్డా
రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చింది: జేపీ నడ్డా
దేశానికి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలి: నడ్డా
-
Dec 15, 2025 12:05 IST
ఢిల్లీ: పార్లమెంట్‌లో బీజేపీ సభ్యుల ఆందోళన
మోదీని సమాధి చేస్తామంటూ నిన్న కాంగ్రెస్ ర్యాలీలో నినాదాలు
కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ సభ్యులు డిమాండ్
-
Dec 15, 2025 10:51 IST
పార్లమెంట్ ఉభయసభల్లో బీజేపీ సభ్యులకు విప్ జారీ
డిసెంబర్ 15-19 మధ్య సభలో ఉండాలని ఆదేశం
కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం
-
Dec 15, 2025 07:38 IST
నేడు 11వ రోజు పార్లమెంట్ సమావేశాలు
ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం
కాలుష్యంపై చర్చకు బీఏసీలో నిర్ణయం తీసుకునే అవకాశం