Share News

Amit Shah Alleges Sudarshan Reddy: సుదర్శన్‌రెడ్డి నక్సల్స్‌ మద్దతుదారు

ABN , Publish Date - Aug 23 , 2025 | 02:46 AM

విపక్ష కూటమి ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ‘నక్సలిజం మద్దతుదారు’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు. ఛత్తీ్‌సగఢ్‌లో ఒకప్పుడు నక్సలైట్లపై పోరాటానికి...

Amit Shah Alleges Sudarshan Reddy: సుదర్శన్‌రెడ్డి నక్సల్స్‌ మద్దతుదారు

అందుకే సల్వాజుడుంను నిషేధిస్తూ తీర్పునిచ్చారు

  • ఆ తీర్పు రాకపోతే ఐదేళ్ల కిందే నక్సలిజం అంతమయ్యేది

  • వామపక్షాల ఒత్తిడితోనే ఆయనను కాంగ్రెస్‌..ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది

  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆరోపణలు

  • నైతిక విలువల కోసమే పీఎం, సీఎం ‘పదవీచ్యుతి’ బిల్లులు తీసుకొచ్చామని వెల్లడి

కొచి, ఆగస్టు 22: విపక్ష కూటమి ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ‘నక్సలిజం మద్దతుదారు’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు. ఛత్తీ్‌సగఢ్‌లో ఒకప్పుడు నక్సలైట్లపై పోరాటానికి నడుంకట్టిన సల్వాజుడుంను నిషేధిస్తూ 2011లో ఆయన ఇచ్చిన తీర్పే దీనికి నిదర్శమన్నారు. సల్వాజుడుంను నిషేధించకపోతే నక్సలిజం 2020 నాటికే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేదని చెప్పారు. కేరళకు చెందిన ప్రముఖ మీడియాసంస్థ ‘మలయాళ మనోరమ’ శుక్రవారం కొచిలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం భావజాలానికి ప్రేరేపితులైనందువల్లే సుదర్శన్‌రెడ్డి.. సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. నక్సలిజానికి మద్దతివ్వటానికి ఆయన సుప్రీంకోర్టు వంటి అత్యున్నత సంస్థను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్‌ పార్టీ సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని విమర్శించారు. నక్సలిజం సమస్యతో కేరళ కూడా ఒకప్పుడు సతమతమైందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు లేవని అమిత్‌షా పేర్కొన్నారు. జెలుపాలైన ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించి తాజాగా తీసుకొచ్చిన మూడు బిల్లులను అమిత్‌షా ప్రస్తావించారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ గతంలో జైలులో ఉన్నప్పటికీ సీఎం పదవికి రాజీనామా చేయని విషయాన్ని పరోక్షంగా పేర్కొంటూ.. ‘జైలు నుంచే ఒక సీఎం ప్రభుత్వాన్ని నడిపించారు. అటువంటప్పుడు, ఈ బిల్లులు తీసుకురావాలా? వద్దా?’ అని ప్రశ్నించారు. బిల్లులపై ప్రతిపక్షాల నిరసనను, రాజ్యాంగంలో ఇది లేదన్న వారి వాదనను ఖండించారు. ‘ఇది నైతిక విలువలకు సంబంధించిన విషయం. ముఖ్యమంత్రి జైలు పాలైనప్పటికీ.. రాజీనామా చేయకుండా ఉంటారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించి ఉండరు. అందుకనే ఇప్పుడు కొత్తగా రాజ్యాంగానికి సవరణ చేస్తున్నాం’ అని అమిత్‌షా వివరించారు.


DGNHZ.jpg

సల్వాజుడుం నిషేధం వెనుక నేపథ్యం

2005లో ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో సల్వాజుడుం (శాంతియాత్ర అని అర్థం) అనే సాయుధ గ్రూపు ఏర్పాటైంది. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి మహేంద్రకర్మ దీని ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. సల్వాజుడుం కింద ఆదివాసీ యువతకు సాయుధ శిక్షణ ఇచ్చి, నక్సల్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో ఉపయోగించేవారు. అయితే, సల్వాజుడుం సభ్యులు ఆదివాసీలను ఊచకోత కోస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. సల్వాజుడుంను నిషేధించాలన్న పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. విచారించిన కోర్టు 2011 డిసెంబరులో సల్వాజుడుంను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 05:12 AM