BJP State Chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకేనే..
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:36 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకే పార్టీనేనని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడాలని తాము ఆశిస్తున్నామన్నారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మెజారిటీ విజయాన్ని సాధిస్తుందని, అన్నాడీఎంకే తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP State President Nayanar Nagendran) స్పష్టం చేశారు. మదురైలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మతవాదాన్ని గట్టిగా నమ్ముతున్న బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నందు వల్ల అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడదని డీఎంకే అసత్యప్రచారాలు చేస్తోందని,

వాస్తవానికి రాష్ట్రంలో కమలం పార్టీ అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడాలని తాము ఆశిస్తున్నామని, పలు చీలికలుగా విడిపోయిన ఆ పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందన్నారు. మాజీ బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు అన్నామలై ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా పార్టీ ప్రారంభించబోరని, ఆయన బీజేపీతో సన్నిహితంగానే ఉన్నారన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News