Assembly Elections: హీరో విజయ్ పర్యటనలో మార్పు
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:19 AM
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేయనున్నారు. గతంలో విజయ్ పర్యటన కోసం తయారు చేసిన రూట్‌మ్యా్‌పలో స్వల్పమార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నిర్వాహకులు తెలిపారు.
- రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం
చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్(Vijay) రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేయనున్నారు. గతంలో విజయ్ పర్యటన కోసం తయారు చేసిన రూట్‌మ్యా్‌పలో స్వల్పమార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నిర్వాహకులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ‘ప్రజలతో భేటీ’ అనే నినాదంతో ఈ నెల 13న తిరుచ్చిలో విజయ్ తన పర్యటనకు శ్రీకారం చుట్టారు.

ఆ రోజు తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు(Trichy, Perambalur, Ariyalur) మూడు జిల్లాల్లో విజయ్ పర్యటిస్తారని పార్టీ ప్రకటించింది. అయితే తిరుచ్చి, అరియలూరు ప్రాంతాల్లో రద్దీ కారణంగా నిర్ణీతకాలం కంటే ప్రచారానికి ఎక్కువ సమయం పట్టింది. ఇందువల్ల పెరంబలూరు పర్యటన విజయ్ రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 20వ తేదీ తిరువారూర్, నాగపట్నం జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని పార్టీ కార్యాలయం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News