Parrot: జైలులో చిలుకను పెంచుతున్న ఖైదీ..
ABN , Publish Date - Mar 07 , 2025 | 02:01 PM
జైలులో ఉన్న ఓ ఖైదీ రామచిలుకను పెంచుకున్నాడు. అయితే.. విషయం తెలుసుకున్న జైలు వార్డెన్ ఆ చిలుకను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా అతనిపై దాడికి పాల్పడ్డాడు.

- స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళిన వార్డెన్‌పై దాడి
చెన్నై: సేలం సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ పెంచుకున్న రామచిలుక(Parrot)ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన వార్డెన్‌పై జరిగిన దాడికి సంబంధించి అస్తంపట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. సేలం సెంట్రల్ జైలో తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి గ్రామానికి చెందిన శివలబెరియన్ (37) అనే యావజ్జీవ ఖైదీ ఉన్నాడు. అతను ఓ చిలుకను పెంచుతున్నట్లు జైలు సూపరెండెంట్ వినోద్‌కుమార్‌కు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు బుధవారం జైలర్ రాజేంద్రన్, వార్డెన్ మాయవన్ వెళ్లి చిలుకను అప్పగించాలని శివలబెరియన్‌ను కోరారు.
ఈ వార్తను కూడా చదవండి: AC Helmets: ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు..
దీంతో ఆ ఖైదీ కోపంతో వారిపై దాడికి పాల్పడంతో తీవ్రంగా గాయపడిన వార్డెన్ మాయవన్ స్పృహ కోల్పోయారు. వెంటనే జైలులోవున్న వైద్యసిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్సచేసి, సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చిలుకను స్వాధీనం చేసుకున్న జైలు అధికారులు వార్డెన్‌పై జరిగిన దాడిపై అస్తంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా వుండగా జైలు ప్రాంగణంలో ఓ ఖైదీ చిలుకను పెంచుతున్నా పట్టించుకోని జైలర్ రాజేంద్రన్, సబ్ జైలర్ శివ, వార్డెన్లు రాజశేఖర్, ముత్తుకుమార్, తిరునావుక్కరసు, మహేంద్రన్లకు జైలు ఎస్పీ వినోద్‌కుమార్ మెమో జారీచేశారు.
ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి
ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!
ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు!?
ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News and National News