Traffic Plan: నగరంలో ట్రాఫిక్ జాం కట్టడికి రూ.73 వేల కోట్లతో స్పెషల్ ప్లాన్
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:29 PM
ట్రాఫిక్ సమస్య అనేది వాహనదారులకు నిత్యం ఒక సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్ ప్రకటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ. 73,600 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
వాహనాల రద్దీ, గంటల కొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, లేటుగా ఆఫీస్ చేరడం. ఇవన్నీ ఎక్కడ హైదరాబాద్ మాత్రం కాదు. కానీ బెంగళూరువాసులకు ఇది నిత్యం ఏర్పడే సమస్యగా మారింది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసింది. దక్షిణ భారత టెక్ హబ్ అయిన బెంగళూరు, ట్రాఫిక్‌ను అధిగమించేందుకు ఏకంగా రూ. 73,600 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో బెంగళూరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో లైన్‌లు, ఫ్లైఓవర్‌లు, బస్సు కారిడార్‌లు, మెట్రో బస్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కలపి నగరంలో కీలక ప్రణాళికలు అమలు చేయనున్నారు.
ప్రణాళికలో ఏముంది
భారతదేశంలోనే అతిపెద్ద భూగర్భ రోడ్లు: రూ. 42,000 కోట్ల వ్యయంతో 40 కి.మీ. పొడవు గల సొరంగ రోడ్లు నిర్మించనున్నారు. ఇవి నగరంలోని ముఖ్య ప్రాంతాలను ట్రాఫిక్‌లేని భూగర్భ మార్గాలతో అనుసంధానించనున్నాయి.
అదనపు మెట్రో రైలు మార్గాలు: ఫేజ్ 3 & 3A కింద 80 కి.మీ. కొత్త మెట్రో మార్గాల నిర్మాణానికి సమానంగా ఖర్చు చేస్తారు.
ఎలివేటెడ్ కారిడార్లు & డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు: రూ. 13,200 కోట్ల వ్యయంతో 110 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్లు.
రూ. 9,000 కోట్లతో 40 కి.మీ. ఎలివేటెడ్ రోడ్లు. ఇవి మెట్రో రైల్‌తో అనుసంధానమయ్యే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లుగా మారుతాయి
కాలువల వెంట కొత్త రోడ్లు: నగరంలోని స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌ల బఫర్ జోన్‌లో 300 కి.మీ. మేర కొత్త రోడ్లు నిర్మించే ప్లాన్
బడ్జెట్‌లో ప్రత్యేక స్థానం
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను మార్చి 7న సమర్పించిన 2025-26 కర్ణాటక బడ్జెట్‌లో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీ మేరకు నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఏడాది నగర బడ్జెట్‌ను రూ. 6,500 కోట్ల నుంచి రూ. 12,500 కోట్లకు పెంచారు. ఈ ప్లాన్ అమల్లోకి వస్తే బెంగళూరు వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరే ఛాన్సుంది.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News