Share News

Curfew: 48 గంటల కర్ఫ్యూ.. 2 రోజులు స్కూల్స్, అంగన్‌వాడీలు బంద్..

ABN , Publish Date - Jan 27 , 2025 | 08:05 AM

ఇటీవల జరిగిన ప్రాణాంతకమైన పులి దాడి నేపథ్యంలో ప్రభుత్వం 48 గంటల కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు పాఠశాలలు, అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ కేంద్రాలు మూసివేయాలని నిర్ణయించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

 Curfew: 48 గంటల కర్ఫ్యూ.. 2 రోజులు స్కూల్స్, అంగన్‌వాడీలు బంద్..
48 Hour Curfew Mananthavady

కేరళలోని వయనాడ్ జిల్లాలోని మనంతవాడిలో 48 గంటల కర్ఫ్యూ విధించారు. శుక్రవారం ఉదయం ప్రియదర్శిని ఎస్టేట్‌లో కాఫీ కోస్తున్న 47 ఏళ్ల రాధ అనే మహిళను పులి చంపిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పులి తరచూ దాడులు చేయడం, ప్రాణాలను ప్రమాదంలో పడేసిన క్రమంలో ఆ పులిని నరమాంస భక్షకుడిగా ప్రకటించారు. అంతేకాదు రాధను చంపిన పులి ఆదివారం ఆ ప్రాంతంలో గస్తీ చేస్తున్న రాపిడ్ రెస్పాన్స్ టీం (RRT) సభ్యుడు, బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ జయసూర్యపై కూడా దాడి చేసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు, వెంటనే పులిని పట్టుకోవడానికి చర్యలు ముమ్మరం చేశారు.


మూసివేయాలని నిర్ణయం..

ఈ పరిణామాలను పరిశీలించిన ప్రభుత్వం ఆ సమీప ప్రాంతాలలో విద్యా సంస్థలు, అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డివిజన్ 1 (పంచ్రకొల్లి), డివిజన్ 2 (పిల్కావు), డివిజన్ 36 (చిరక్కర) ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు 27, 28 తేదీలలో సెలవులను ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థులకు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు తమ డివిజనల్ కౌన్సిలర్లను సంప్రదించి వెళ్లాలని సూచించారు.


పులి ప్రవర్తన నేపథ్యంలో..

ఈ సందర్భంగా కేరళ రాష్ట్ర మంత్రి శశీంద్రన్ ప్రకటనలో ఈ ఘటనకు సంబంధించి పులిని నరమాంస భక్షకుడిగా ప్రకటించడంపై వివరణ ఇచ్చారు. పులి ప్రవర్తన నేపథ్యంలో ప్రభుత్వం గమనించి, ఆ అడవిలో పులి సంచారం పెరిగిందని, ఎప్పటికప్పుడు దాడులు జరగడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. కాబట్టి అలా దాడులు చేసే పులిని వెంటనే పట్టుకొని, ప్రజలను కాపాడుకోవడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. సాధారణంగా పులుల వల్ల ఇలాంటి ప్రమాదాలు చెలరేగిన సందర్భాలు ఈ ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటాయి.


రెండు రోజుల కర్ఫ్యూ

కానీ ఇప్పుడు ఈ ఘటనలపై సమీక్షించిన అధికారులు, పులి దాడులను అరికట్టాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజులు ఈ కర్ఫ్యూ విధించడం ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. ముఖ్యమంత్రి, మంత్రులతో కలసి, అడవిలోని వన్యప్రాణులపై ప్రతిఘటన కలిగించే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జనవరి 31 నాటికి వయనాడ్ జిల్లాలో 100 కొత్త కెమెరాలు, రాష్ట్రవ్యాప్తంగా 400 AI కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జనవరి 29 నాటికి ముఖ్యమంత్రి, అధికారులు మరో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

Siddaramaiah: సీఎం బహుమతి తిరస్కరించిన ఖోఖో ప్రపంచ కప్ ఆటగాళ్లు.. కారణమిదే..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 27 , 2025 | 08:07 AM