Share News

Breaking News: తొక్కిసలాట ఘటనపై జ్యూడిషియల్ విచారణ.. చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - Jan 09 , 2025 | 08:46 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: తొక్కిసలాట ఘటనపై జ్యూడిషియల్ విచారణ.. చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu Naidu

Live News & Update

  • 2025-01-09T18:11:30+05:30

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు

    • తిరుమలలో ఉద్యోగులు సేవా భావంతో పనిచేయాలి

    • ఎవరూ పెత్తందారీలుగా వ్యవహారించకూడదు

    • తిరుమల పవిత్రతను కాపాడతానని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా

    • ఓ పనిచేస్తుంటే జవాబుదారీతనం ఉండాలి

    • వైకుంఠ ద్వార దర్శనాన్ని పదిరోజులకు పెంచడం సరికాదు

    • ఎవరి అభిప్రాయాలతో ఇలా చేశారో తెలియదు

    • అధికారులకు పూర్తి స్వేచ్చనిచ్చాను

    • ప్రతి విషయంలో ఇన్వాల్ అవ్వబోను

    • టోకెన్ల జారీ కోసం ఎంపిక చేసిన ప్రదేశం సరైనది కాదు

    • ప్రతి దాంట్లో తాను ఇన్వాల్వ్ కాను.. తాను ఎవరికి బాధ్యతలు అప్పగించానో వారు బాధ్యతతో పనిచేయాలి

  • 2025-01-09T18:05:16+05:30

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు

    • తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది

    • తిరుమలపై ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేయాలి

    • వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తుంటారు

    • సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంటుంది

    • పదిరోజులకు వైకుంఠ దర్శనాన్ని పెంచారు

    • ఎవరిని అడిగి చేశారో ఎవరికి తెలియదు

    • తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు అవకాశం లేదు

    • దైవసేవలో రాజకీీయాలు ఉండకూడదు

    • క్యూలైన్లలో ఎన్నిగంటలైనా ఉంటామని భక్తులు చెబుతున్నారు

    • మృతుల్లో విశాఖకు చెందిన ముగ్గురు ఉన్నారు

    • విశాఖకు చెందిన లావణ్య, శాంతి, రజని తొక్కిసలాట ఘటనలో మృతిచెందారు

    • మృతులకు టీటీడీ నిధుల నుంచి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

    • తీవ్ర గాయాలైన ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

    • మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు

    • 33 మంది క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం

    • కొందరు అధికారులు బాధ్యత లేకుండా పనిచేశారు

    • డిఎస్పీ రమణకుమార్ బాధ్యతలేకుండా పనిచేశారు

    • గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిపై కూడా చర్యలు

    • రమణ కుమార్, హరనాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం

    • ముగ్గురు అధికారులను బదిలీ చేస్తున్నాం

    • బాధ్యతగా వ్యవహారించాల్సిన అధికారులు అది మర్చిపోయారు

    • తొక్కిసలాట ఘటనపై జ్యూడిషియల్ ఎంక్వైరీ

  • 2025-01-09T17:55:43+05:30

    తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు

    • ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం

    • తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం

    • తిరుమల ట్రస్టు బోర్డు, అధికారులకు కీలక ఆదేశాలు

  • 2025-01-09T17:53:55+05:30

    తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు

    • తిరుపతిలో బాధాకరమైన ఘటన జరిగింది

    • తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత అందరిది

    • తొక్కిసలాట ఘటనతో మనసు కలచివేసింది

  • 2025-01-09T17:18:01+05:30

    ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ

    • ఫార్ములా ఈ- రేసు కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ

    • ఆరున్నర గంటలపాటు కొనసాగిన విచారణ

    • విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలన్న ఏసీబీ

    • ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానన్న కేటీఆర్

    • ఫార్ములా ఈ- రేసులో మంత్రిమండలి ఆమోదం లేకుండా నిధులల విడుదలపై ప్రశ్నలు

    • నాలుగైదు ప్రశ్నలే 40 విధాలుగా అడిగారన్న కేటీఆర్

    • ప్రశ్నలు తిప్పి.. తిప్పి అడిగారన్న కేటీఆర్

    • తాను చెప్పాల్సిన సమాధానం చెప్పానన్న కేటీఆర్

    • ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమన్న కేటీఆర్

    • తనకు తెలిసిన సమాచారం ఏసీబీకి చెప్పానన్న కేటీఆర్

  • 2025-01-09T13:34:57+05:30

    భారీ ఎన్‌కౌంటర్..

    • చత్తీస్‌గడ్: సుక్మా- బీజాపూర్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్.

    • ముగ్గురు మావోయిస్టులు మృతి మరికొంతమందికి హతమైనట్లు సమాచారం.

    • రాత్రి నుంచి కొనసాగుతున్న భీకర ఎదురు కాల్పులు.

    • మావోయిస్ట్ బెటాలియన్ ప్రాంతంలోకి ప్రవేశించిన DRG కోబ్రా STF, CRPF బలగాలు.

  • 2025-01-09T13:33:22+05:30

    తెలంగాణ భవన్‌లో హరీష్ రావు

    • బిఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి ఏసీబీ విచారణను సమీక్షించనున్న హరీష్ రావు

    • ఏసీబీ విచారణ నేపధ్యంలో తెలంగాణ భవన్ లో ఉండి మానిటరింగ్ చేస్తున్న హరీష్ రావు

    • మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,

    • కొత్త ప్రభాకర్ రెడ్డి,పాడి కౌశిక్ రెడ్డి,మాజీ ఎంపీ మాలోత్ కవిత,బిఅరెస్ నేతలు.

  • 2025-01-09T12:09:13+05:30

    వైఎస్ జగన్ పిటిషన్.. కోర్టు కీలక ఉత్తర్వులు..

    • పులివెందుల ఎమ్మెల్యే జగన్ విదేశీ పర్యటనకు నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతి.

    • ఈనెల 11 నుండి 30 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతించిన నాంపల్లి కోర్టు.

    • ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన జగన్.

  • 2025-01-09T12:09:12+05:30

    కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు వేసిన ప్రశ్నలు..?

    HMDA నిధుల దుర్వినియోగంపై వరుసగా ప్రశ్నలు..

    1. రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు?

    2. ఇది నిబంధనలకు విరుద్దమని మీకు తెలియదా?

    3. RBI పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు?

    4. కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు మళ్లింపా?

    5. ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం లేదనుకున్నారా?

    6. అగ్రిమెంట్లు, చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా?

    7. KTR ఆదేశాలమేరకే నగదు రిలీజ్ చేశామన్న అధికారులు చెపుతున్నారు మీ సమాధానం ఏంటి ?

  • 2025-01-09T11:50:50+05:30

    భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

    • తిరుపతి ఘటన మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా.

    • ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రెవెన్యూ మంత్రి అనగాని

    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తాం: అనగాని

  • 2025-01-09T11:25:33+05:30

    కేటీఆర్‌కు మరో షాక్..

    • ఢిల్లీ: కేటిఆర్‌కు సుప్రీంలో చుక్కెదురు.

    • ఫార్ములా ఈ కార్ రేసు కేసులో క్వాష్ పిటీషన్‌ను రేపు విచారణకు తీసుకోవడానికి సిజెఐ నిరాకరణ.

    • 15న కేటిఆర్ క్వాష్ పిటీషన్ పై సుప్రీంలో విచారణ.

    • రేపు కేటిఆర్ క్వాష్ పిటీషన్ విచారణకు నిరాకరించిన సిజెఐ సంజీవ్ ఖన్నా.

    • 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున ఆ రోజే విచారిస్తానని స్పష్టం చేసిన సిజెఐ సంజీవ్ ఖన్నా.

    • అంతకు కేటిఆర్ క్వాష్ పిటీషన్ ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిన సిజెఐ సంజీవ్ ఖన్నా.

  • 2025-01-09T10:21:00+05:30

    తిరుమలలో తొక్కీసలాటపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్..

    rajasingh-mla.jpg

    • టిడిడి ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ జరపాలి: బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్

    • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, టిటిడి బోర్డ్ పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలి.

    • తప్పిదం ఎవరిదో తేల్చి చర్యలు తీసుకోవాలి.

    • నిత్యం లక్షలాది మంది భక్తులు విసిట్ చేసే చోట అలాంటి ఘటన జరగడం బాధాకరం.

  • 2025-01-09T10:18:26+05:30

    తెలంగాణ కోసం చనిపోవడానికైనా రెడీ..: కేటీఆర్‌

    KTR.jpg

    • హైదరాబాద్‌: ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్‌

    • కేటీఆర్‌ వెంట ఏసీబీ కార్యాలయానికి అడ్వకేట్‌ రామచంద్రరావు

    • నేను క్విడ్‌ప్రోకు పాల్పడలేదు: కేటీఆర్‌

    • మా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది: కేటీఆర్‌

    • కేసీఆర్‌ కొడుకుగా చెబుతున్నా.. అవసరమైతే తెలంగాణ కోసం చనిపోతా: కేటీఆర్‌

    • తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను ప్రపంచ పటంలో పెట్టడానికి కృషి చేశా

    • కేబినెట్‌లో ఉండి నా కుమారుడికి కాంట్రాక్టులు ఇవ్వలేదు: కేటీఆర్‌

    • పైసా కూడా అవినీతి చేయలేదు: మాజీమంత్రి కేటీఆర్‌

    • ఆరు గ్యారంటీలు అమలు చేయాలని అడుగుతున్నాం: కేటీఆర్‌

    • ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయిన దొంగను కాదు నేను: కేటీఆర్‌

    • మేము నిజయితీగా ఉంటాం.. మీలా నీచపు పనులకు పాల్పడం: కేటీఆర్‌

    • అన్యాయాన్ని నిలదీస్తాం.. ప్రశ్నిస్తాం.. పోరాడుతూనే ఉంటాం: కేటీఆర్‌

    • అక్రమ కేసులకు భయపడం.. కేసులకు చట్టపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్‌

    • కాంగ్రెస్‌ కబంధహస్తాల నుంచి తెలంగాణ బయపడే వరకు పోరాడతాం: కేటీఆర్‌

  • 2025-01-09T10:15:57+05:30

    క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యుల బృందంతో టీటీడీ ఈవో ఆరా

    • ఘటనలో ఆరుగురు మృతి, 41 మంది గాయపడ్డారు

    • ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నాం: టీటీడీ ఈవో

    • డీఎస్పీ గేట్లు తెరవడంతోనే ఘటన జరిగింది: టీటీడీ ఈవో

    • పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది: టీటీడీ ఈవో

  • 2025-01-09T10:10:40+05:30

    ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..

    • బంజారాహిల్స్: నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరిన కేటీఆర్

    • కేటీఆర్ వెంట ఆయన అడ్వకేట్ రామచంద్రరావు

    • 10నిమిషాల్లో ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్న కేటీఆర్

  • 2025-01-09T09:08:09+05:30

    డాకు మహారాజ్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు..

    • నేడు అనంతపూర్‌లో జరగాల్సిన డాకు మహారాజ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..

    • తిరుమలలో జరిగిన తొక్కిసలాట నేపధ్యంలో ఈవెంట్ క్యాన్సిల్.

  • 2025-01-09T09:06:15+05:30

    తిరుపతిలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం: పవన్

    • అమరావతి: వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి అవకాశం ఉంటుంది.

    • భక్తుల పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా భావించాలని, గాయపడిన ప్రతీ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీటీడీ అధికారులను, పాలక మండలినీ కోరుతున్నాను.

    • తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం.

    • తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల వద్ద, క్యూ లైన్ల దగ్గర అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తోడ్పాటు అందించాలి.

    • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.

    • జనవరి 10 నుండి 19 వరకూ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనున్నారు.

    • దర్శనం టికెట్ కోసం తిరుపతి నగరంలో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

    • 7 లక్షల మందికి పైగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

    • కావున ప్రతీ భక్తుడు సంయమనం పాటించాలని కోరుతున్నాను.

  • 2025-01-09T08:46:01+05:30

    టెన్షన్ టెన్షన్.. వర్రా ఎవరి పేరు చెబుతాడో..

    • కడప : వైసీపీ సోషల్ మీడియాకేసులో కీలకనిందితుడు వర్రా రవీందర్ రెడ్డి నేడు చివరిరోజు విచారణ.

    • వర్రా నురెండురోజులు పోలీసు కస్టడీకి అనుమతినిచ్చిన కడప కోర్టు.

    • మొదటిరోజు వాంగ్మూలంలో సంచలనం నిజాలు వల్లడించిన వర్రా రవీందర్ రెడ్డి.

    • సజ్జలు తండ్రి కొడుకులు రామ క్రష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిలు చెబితేనే నేను అందరిపై అసభ్యకర పోస్టులు పెట్టానని వెల్లడి.

    • వారిద్దరు చెబితే.. చంద్రబాబు, పవన్ కళ్యాన్, అనిత, షర్మిళ, విజయలక్ష్మి, ఇతరులపై పోస్టులు పెట్టినట్లు వెల్లడి.

    • మాకుడబ్బులు ఇస్తానని చెప్పి సజ్జల భార్గవ్ రెడ్డి డబ్బులు కొట్టేశాడని వెల్లడి.

    • నీకు మంచి రాజకీయ భవిష్యత్తు వుంటుందని, పార్టీ అండగా వుంటుందని చెప్పారని వెల్లడి.

    • నేడు చివరిరోజు ఎవరి పేర్లు చెబుతాడోనని టెన్షన్‌లో కొందరు వైసీపీ నేతలు.