Share News

Breaking News: చూస్తూ ఉండండి.. గట్టిగానే కొడతా.. కేసీఆర్ సంచలన ప్రకటన

ABN , First Publish Date - Jan 31 , 2025 | 10:44 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: చూస్తూ ఉండండి.. గట్టిగానే కొడతా.. కేసీఆర్ సంచలన ప్రకటన
Today Breaking News

Live News & Update

  • 2025-01-31T15:18:00+05:30

    కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

    • మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

    • కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు

    • ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ

    • ప్రభుత్వ పనితీరును గంభీరంగా, మౌనంగా చూస్తున్నా

    • ఎప్పుడు ఏమి చేయాలో బాగా తెలుసు

    • ఈ ప్రభుత్వంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయి

  • 2025-01-31T14:02:05+05:30

    భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    • 750 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌

    • 250 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ

  • 2025-01-31T13:50:11+05:30

    సీఐడీ మాజీ డీజీ సంజయ్‌కు బిగ్ షాక్..

    • ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ డీజీ, ఐపీఎస్ అధికారి సంజయ్‌పై సస్పెన్షన్ పొడిగింపు.

    • ఈ ఏడాది మే 31 వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు.

    • సంజయ్ సస్పెన్షన్‌ను నిర్ధారించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.

    • సంజయ్ సస్పెన్షన్‌పై నియమించిన కమిటీ ఇటీవల భేటీజ

    • సంజయ్‌పై సస్పెన్షన్ పొడిగించాలని నిర్ణయించిన కమిటీ.

    • దీంతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

  • 2025-01-31T12:17:07+05:30

    ఉస్మానియా కొత్త ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన

    • గోషామహల్‌ మైదానంలో ఆస్పత్రి నూతన భవన నిర్మాణం

    • 2 వేల పడకలతో 26.3 ఎకరాల్లో ఆస్పత్రి భవన నిర్మాణం

    • రూ.2,400 కోట్లతో 14 అంతస్తుల్లో ఆస్పత్రి భవన నిర్మాణం

    • అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాల్లో వైద్య సేవలు

    • కొత్త ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీలు చేసేలా సౌకర్యాలు

    • కొత్త ఆస్పత్రిలో అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు

  • 2025-01-31T12:13:19+05:30

    ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

    • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్ధేశం

    • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్,..

    • ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ కూటమి అభ్యర్ధులుగా బలపరిచాం: చంద్రబాబు

    • ఫిభ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుంది..27న ఎన్నికలు..

    • కౌంటింగ్ మార్చి 3న జరుగుతాయి: సీఎం చంద్రబాబు

    • ప్రతి గ్యాడ్యుయేట్‌ను కలిసి భారీ మెజారిటీ సాధించాలి

    • చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారు: చంద్రబాబు

    • ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దు: చంద్రబాబు

    • ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పని చేయాలి

    • క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్‌చార్జ్‌లతో పాటు,..

    • జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలి: చంద్రబాబు

    • ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎన్నికలు

  • 2025-01-31T12:10:17+05:30

    గోషామహల్‌లో నిరసనలు.. పలువురు అరెస్ట్..

    ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ..బంద్‌కు పిలుపునిచ్చిన గోషామహల్ పరిరక్షణ సమితి. పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. ముందస్తుగా పలువురు హౌస్ అరెస్ట్. గత నెల రోజులుగా గోషామలో మైదానంలో ఉస్మానియా ఆస్పత్రి వద్దంటూ గోషామహల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు వినోద్ యాదవ్, కోటి సైలెస్, అల పురుషోత్తంరావు, బేజిని శ్రీనివాస్, కేడి దినేష్, దత్తు, గొడుగు గోపి యాదవ్‌లు స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఎవరైనా ఆందోళనకారులు ముఖ్యమంత్రి శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటారేమోనని ముందస్తుగా తెల్లవారుజాము నుంచి గోషామహల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులను, ఆందోళనకాలను అరెస్టు చేశారు. అదేవిధంగా గోషామహల్ మైదానానికి, అన్ని వైపులా ఉన్న రహదారుల వద్ద భారి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకుస్థాపనకు ఎంట్రీ పాస్ ఉంటేనే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.

  • 2025-01-31T11:56:28+05:30

    కాసేపట్లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం..

    • గోషామహల్ స్టేడియానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

    • కాసేపట్లో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం.

  • 2025-01-31T11:54:31+05:30

    • సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు.

    • సుమారు 1190 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసిన పోలీసులు.

    • రికవరీ చేసిన మొబైల్ లను బాధితులకు అప్పగించనున్న సైబరాబాద్ పోలీసులు

    • మరికాసేపట్లో క్రైమ్స్ డీసీపీ నరసింహ ఆధ్వర్యంలో బాధితులకు సెల్ఫోన్లు అప్పగింత...

    • ఇప్పటికే మూడు విడతల్లో వేలల్లో రికవరీ చేసిన మొబైల్ లను బాధితులకు అప్పగించిన పోలీసులు

  • 2025-01-31T11:32:07+05:30

    రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం..

    • రఘురామ కృష్ణ రాజు కస్టడీయల్ టార్చర్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన డాక్టర్ ప్రభావతి.

    • ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు

    • విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతికి ఆదేశించిన సుప్రీంకోర్టు

    • డాక్టర్ ప్రభావతి పిటీషన్ పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశం

    • తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

    • ముందస్తు బెయిల్ కొట్టివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన డాక్టర్ ప్రభావతి.

    • ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం

  • 2025-01-31T10:47:54+05:30

    ఘోరంగా మోసం చేశారు..

    • గుంటూరు: తిరుచానూరుకు చెందిన కుటుంబాన్ని మోసం చేసిన గుంటూరు జిల్లా ముఠా.

    • నగదుకు రెట్టింపు నగదు ఇస్తామని చెప్పి మోసం.

    • రెట్టింపు డబ్బు వస్తుందనే ఆశతో తిరుచానూరు నుంచి వచ్చిన ఓ కుటుంబం నుంచి కాజా టోల్ ప్లాజా వద్ద రూ. 15 లక్షలు తీసుకున్న ముఠా.

    • పైనా, కింద అసలు నోట్లు మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి ఇచ్చినముఠా.

    • డబ్బు చేతులు మారగానే పరారైన ముఠా.

    • మోసపోయామని గ్రహించి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.

  • 2025-01-31T10:44:27+05:30

    నెల్లూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.

    • ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన 'లోకల్ వీరప్పన్లు' కథనానికి స్పందన.

    • ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ అనుచరులు, స్నేహితులమంటూ రెచ్చిపోయిన కలప మాఫియా.

    • అగ్రిగోల్డ్ భూముల్లో రూ.కోట్ల విలువైన జామాయిల్ తోటల అక్రమ నరికివేత, రవాణా‌ వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.

    • ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో పరారైన కలప మాఫియా.

    • కలప మాఫియా ఆగడాలపై సీఐడీ, ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా.

    • కలప మాఫియా వెనుక బడాబాబుల వివరాలు సేకరణ.