-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Live Updates Friday 16th May 2025 Top Headlines and Major Events Across India Shiva
-
Breaking News: లిక్కర్ స్కామ్.. మరో ఇద్దరి అరెస్ట్..
ABN , First Publish Date - May 16 , 2025 | 10:09 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 16, 2025 19:43 IST
లిక్కర్ స్కామ్.. మరో ఇద్దరి అరెస్ట్..
లిక్కర్ కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన సిట్ అధికారులు
-
May 16, 2025 19:35 IST
అమరావతి: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో చంద్రబాబు సమీక్ష
ఇకపై రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని అధికారులకు ఆదేశం
రైతుల దగ్గర మిగిలిన పొగాకును కంపెనీలు కొనాల్సిందే: చంద్రబాబు
ధర తగ్గకూడదు.. కొనుగోళ్లు ఆగకూడదు: సీఎం చంద్రబాబు
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదు: చంద్రబాబు
కోకో కొనుగోళ్లకు త్వరలో ఆయిల్‌పామ్ తరహా విధానం: చంద్రబాబు
తక్కువ ధరతో నష్టపోయిన మిర్చి రైతుల జాబితా రూపొందించాలి
సన్నరకాలు పండించేలా వరి రైతులను ప్రోత్సహించాలి: చంద్రబాబు
-
May 16, 2025 19:02 IST
మెుదలైన తిరంగా ర్యాలీ..
విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ
పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ర్యాలీ
ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ
-
May 16, 2025 19:01 IST
అల్లర్లు.. 20 మంది మృతి..
ఇండోనేషియాలో అల్లర్లు, 20 మంది మృతి
ఇండోనేషియాలోని పపువా రీజియన్‌లో అల్లర్లు
18 మంది రెబల్స్, ఇద్దరు పోలీసు అధికారులు మృతి
ఇండోనేషియాలో భద్రతా బలగాలు, వేర్పాటువాదులకు మధ్య అల్లర్లు
-
May 16, 2025 18:18 IST
జైలు సూపరింటెండెంట్ బదిలీ
విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ హంసపాల్ బదిలీ
రాజమండ్రి సెంట్రల్ జైలుకి అటాచ్ చేస్తూ ఆదేశాలు
హంసపాల్ స్థానంలో ప్రకాశం జిల్లా సబ్ జైలు అధికారి మహమ్మద్ ఇర్ఫాన్ పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్
విజయవాడ జిల్లా జైలులోనే లిక్కర్, ఏపీపీఎస్సీ, వల్లభనేని వంశీ కేసు నిందితులు
-
May 16, 2025 18:17 IST
విచారణ వాయిదా..
లిక్కర్ కేసులో గోవిందప్ప కస్టడీ పిటిషన్‌పై ACB కోర్టు విచారణ
కౌంటర్ దాఖలు చేయాలని ఈనెల 19కి కేసు విచారణ వాయిదా
-
May 16, 2025 18:16 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు
రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు ACB కోర్టు అనుమతి
కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ కసిరెడ్డికి కోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల19కి వాయిదా
-
May 16, 2025 16:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాల పేరుతో అనేక రూల్స్ ప్రకటించారు. దీంతో అనేక దేశాలు అసృంతృప్తి వ్యక్తం చేయగా, ట్రంప్ తాజాగా మరో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.
-
May 16, 2025 16:29 IST
పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటి వేళ.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది.
-
May 16, 2025 16:19 IST
అడ్డుకునేది రేవంత్ రెడ్డే: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
కేబినెట్ విస్తరణ అడ్డుకుంటున్నది రేవంతే: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సీఎంకు కేబినెట్‌లో అనుకూలం కంటే.. వ్యతిరేకతే ఎక్కువ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
తెలంగాణ దివాళా తీసిందని రేవంత్ ప్రకటించినా భట్టి ఎందుకు స్పందించడం లేదు?: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రేవంత్, భట్టికి విభేదాలున్నాయి: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
ఉద్యోగుల అంశంపై మంత్రివర్గంలో విభేదాలు: మహేశ్వర్‌రెడ్డి
ఆర్థిక ఎమర్జెన్సీ స్టేట్‌మెంట్‌ను మంత్రులు వ్యతిరేకిస్తున్నారు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సీఎం, హైకమాండ్‌కు దూరం పెరుగుతోంది: మహేశ్వర్‌రెడ్డి
-
May 16, 2025 16:18 IST
హరీష్‌రావు ఇంటికి కేటీఆర్
హైదరాబాద్: హరీష్‌రావు ఇంటికి కేటీఆర్
అనారోగ్యంతో బాధపడుతున్న హరీష్‌రావు తండ్రి
హరీష్‌రావు తండ్రిని పరామర్శించిన కేటీఆర్
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
-
May 16, 2025 14:14 IST
లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం..
అమరావతి: లిక్కర్ స్కామ్‌లో నేడు మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు తప్పదంటున్న పోలీసు వర్గాలు.
ఇప్పటివరకు ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప అరెస్టు.
తవ్విన కొద్దీ బయటపడుతున్న వాస్తవాలు.
రెండు రోజులుగా విచారణకు హాజరవుతున్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.
సిట్ విచారణలో అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిందితుల ఉక్కిరిబిక్కిరి.
లిక్కర్ స్కాంలో వీరి పాత్రపై నిర్థారణకు వచ్చిన విచారణ అధికారులు.
ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలకు సుప్రీం కోర్టులోనూ ముందస్తు బెయిల్ నిరాకరణ.
తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు అధికారుల అరెస్టుపై జోరుగా చర్చ.
-
May 16, 2025 13:57 IST
మాజీ మంత్రి కాకాణికి సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట
ముందస్తు బెయిల్‌కు సుప్రీం ధర్మాసనం నిరాకరణ.
క్వార్ట్జ్ అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో A4గా కాకాణి.
రెండు నెలలుగా పోలీసులకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న కాకాణి.
గతంలో ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు.
పిటీషన్ డిస్మిస్ చేసిన సుప్రీం ధర్మాసనం.
విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరుపు న్యాయవాదులు బ్రతిమిలాడినా కరుణించని ధర్మాసనం.
ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాదులు గుంటూరు ప్రేరణ , గుంటూరు ప్రమోద్.
కాకాణి తరపున వాదనలు వినిపించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు.
-
May 16, 2025 13:51 IST
ఫేక్ సర్టిఫికెట్ ముఠా గుట్టు రట్టు..
ఫేక్ సర్టిఫికెట్ల ముఠాలో 6 గురిని అరెస్టు చేశాం: సీపీ సుధీర్ బాబు
భాను ప్రకాష్, సాగరిక దంపతులు సాత్విక్ ఏంటర్‌ప్రైజెస్ పేరుతో నోటరీ ప్రారంభించారు.
అధిక డబ్బులు కోసం నకిలీ ధ్రువపత్రాల తయారీని ప్రారంభించారు.
లోన్ తీసుకున్న వ్యక్తుల డాక్యుమెంట్లు బ్యాంక్‌లో ఉంటాయి.
అలాంటి వారు మళ్ళీ లోన్ తీసుకునేందుకు నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నారు.
భూముల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు.
భూముల కొనుగోలుదారులు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి.
కొన్ని మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించే ముఠాను నిందితులు ఏర్పాటు చేసుకున్నారు.
ఈ నకిలీ పత్రాలను ఎవరెవరు పొందారు.. ఎలాంటి వాటికి ఉపయోగించారు అనేది దర్యాప్తు చేస్తున్నాం.
181 నకిలీ డాక్యుమెంట్లు ఇంకా స్వాదీనం చేసుకోవాల్సి ఉంది.
పక్క వారి ల్యాండ్లను కూడా మరొకరి పేరుపై ఉన్నట్లు సృష్టించి ఎక్కువ మొత్తంలో బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందేలా చేస్తున్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా కూడా లబ్ధి పొందేలా చేస్తున్నారు.
నకిలీ పత్రాలు కొనుగోలు చేసి లబ్ధి పొందినవారిపై చర్యలు ఉంటాయి.
-
May 16, 2025 13:29 IST
అనంతపురం: గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి లోకేశ్ పర్యటన
హైబ్రీడ్ పవర్ జనరేషన్ కాంప్లక్స్‌కు శంకుస్థాపన చేసిన లోకేశ్
2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్లతో రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్
పవన, సౌర, బ్యాటరీ అధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం
భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశాం: లోకేశ్
రూ.22 వేల కోట్లతో రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం.
భవిష్యత్ ఆశల వారధిగా రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్.
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ముందుకెళ్లాం.
అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తీసుకువచ్చాం.
-
May 16, 2025 13:27 IST
నిజాలు మాట్లాడిన మంత్రి కొండా సురేఖకు అభినందనలు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోంది.
30% కమీషన్ తీసుకోకుండా ఫైళ్లపై మంత్రులు సంతకాలు పెట్టరని.. మంత్రి కొండా సురేఖ బహిరంగంగా చెప్పారు.
కాంట్రాక్టర్లు ధర్నా చేసి ప్రభుత్వ కమీషన్ వ్యాపారాన్ని బయటపెట్టారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు.
-
May 16, 2025 13:25 IST
హైదరాబాద్: హరీశ్‌రావు ఇంటికి కేటీఆర్
అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్‌రావు తండ్రి
హరీశ్‌రావు తండ్రిని పరామర్శించిన కేటీఆర్
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
-
May 16, 2025 13:25 IST
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్‌రెడ్డి
మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని సురేఖనే ఒప్పుకున్నారు
ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో దర్యాప్తు చేయాలి: కిషన్‌రెడ్డి
మంత్రుల కమీషన్ల వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలి: కిషన్‌రెడ్డి
-
May 16, 2025 13:24 IST
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీ: భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.
ఆపరేషన్ సింధూర్‌పై కీలక కామెంట్స్ చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి.
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు.
ఏమి జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమే.
సరైన సమయం వచ్చినప్పుడు, మేము పూర్తి సినిమాను ప్రపంచానికి చూపిస్తాము.
-
May 16, 2025 11:34 IST
విజయవాడ : వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.
గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై ఫిర్యాదు చేసిన గనుల శాఖ ఏడి.
మొత్తం 58 పేజీలతో ఫిర్యాదు చేసిన గనుల శాఖ అధికారులు.
క్రైమ్ నెంబర్ 142/2025తో కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు.
దీనిపైన పిటి వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయం.
-
May 16, 2025 10:50 IST
హైదరాబాద్‌లో కిలేడీలతో జాగ్రత్త..
ఒంటరిగా ఉన్నట్లు నటిస్తూ వాహనదారులను లిఫ్ట్ అడిగి పర్సు, ఫోన్ కొట్టేస్తున్న కిలేడీలు.
దొరికితే వేధింపుల కేసు పెడుతామని బెదిరిస్తున్న కొందరు.
మరి కొందరేమో చాటింగ్ పేరిట దగ్గరై చివరకు బ్లాక్‌మెయిల్ చేస్తున్న కిలేడీలు.
పోలీసులను సైతం వదలకుండా సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్ నుంచి రూ.లక్ష కొట్టేసిన యువతి.
మరొకరిని మోసం చేయబోయి పోలీసుల వలకు చిక్కిన యువతి.
-
May 16, 2025 10:13 IST
విజయవాడ: సిట్ విచారణకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్
లిక్కర్ కేసులో నిన్న 13 గంటల పాటు కొనసాగిన విచారణ
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ ఫోన్లు పరిశీలించిన సిట్
విడివిడిగా, కలిపి విచారణ చేస్తూ ప్రశ్నలు
-
May 16, 2025 10:10 IST
హైదరాబాద్: ప్రారంభమైన కాళేశ్వరం కమిషన్ విచారణ
హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్
2 వారాల పాటు హైదరాబాద్‌లోనే జస్టిస్ పీసీ ఘోష్
ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనున్న కమిషన్
ఈ నెల 31తో ముగియనున్న కాళేశ్వరం కమిషన్ గడువు
-
May 16, 2025 10:09 IST
పహల్గామ్ దాడిని ఖండించిన తాలిబన్ విదేశాంగ శాఖ
స్వాగతించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి సహకరిస్తామన్న జైశంకర్