-
-
Home » Mukhyaamshalu » Today Breaking News and Live updates in Telugu Saturday 18th January 2024 Siva
-
Latest News in Telugu: మంచు ఫ్యామిలీలో మరొక ట్విస్ట్..
ABN , First Publish Date - Jan 18 , 2025 | 08:15 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-18T14:03:00+05:30
వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత..
అమరావతి: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.
ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి బీజేపీలో చేరారు.
శనివారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
-
2025-01-18T13:53:41+05:30
మంచు ఫ్యామిలీలో మరొక ట్విస్ట్..
తన ఆస్తులను ఉన్న అందర్నీ వేకెట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కి మోహన్ బాబు ఫిర్యాదు.
జల్ పల్లి లో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారు.
తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే కాళీ చేయించి, తనకు అప్పగించాలని కోరిన మోహన్ బాబు.
గత కొన్ని రోజుల నుంచి తిరుపతిలో ఉంటున్న మోహన్ బాబు.
జల్‌పల్లి ఇంటిలో నివాసం ఉంటున్న మంచు మనోజ్.
సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కోరిన మోహన్ బాబు.
మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్.
పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.
జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్‌కి నోటీసు ఇచ్చిన జిల్లా కలెక్టర్.
-
2025-01-18T11:52:15+05:30
ఓయో రూమ్‌లో యువతి, యువకుడు.. షాకింగ్ సీన్..
ఓయో రూమ్‌లో ఉంటూ గంజాయి వ్యాపారం.
కొండాపూర్ లో యువతి యువకుడు అరెస్టు.
మధ్యప్రదేశ్ కు చెందిన సంజన, కావలికి చెందిన రాజు గా గుర్తింపు.
ఎట్టకేలకు ఎస్టిఎఫ్ పోలీసులకు పట్టుబడ్డ యువతి యువకుడు.
ఇద్దరి నుండి 1.2కేజీల గంజాయి సీజ్.
-
2025-01-18T11:20:20+05:30
8 కిలోల బంగారం.. అదిరిపోయే ఆఫర్ అంటూ..
తక్కువ ధరకు బంగారం అంటూ బురిడీ కొట్టించే యత్నం.
రాజస్థాన్ నుంచి వచ్చిన మోసగాడు అరెస్ట్.
నకిలీ బంగారం బిస్కెట్స్ తో ఫిలిం నగర్ వచ్చిన మోసగాడు ఇనాముల్ హసన్.
8 కిలోల బంగారం రెండు కోట్ల రూపాయలకే అమ్ముతానంటూ ఫోన్ కాల్.
తనకి అవసరం లేదని చెప్పిన టోలిచౌకికి చెందిన అబ్దుల్లా ఇబ్రహీం.
అబ్దుల్లాకు విక్రయించడానికి కేజీ నకిలీ బంగారాన్ని తెచ్చిన కేటుగాడు.
అనుమానం వచ్చి పరిశీలించిన అబ్దుల్లా,నకిలీది అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు.
అతడిని కారులో కూర్చోబెట్టుకుని నేరుగా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అబ్దుల్లా ఇబ్రహీం.
షాక్ తిన్న కేటుగాడు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
-
2025-01-18T09:51:16+05:30
చరిత్రలో మరణం లేని నాయకుడు ఎన్టీఆర్: రఘు రామకృష్ణంరాజు
ప్రజలు హృదయాల్లో ఆయన చిరస్మరణీయంగా జీవించి ఉంటారు.
గత ఏడాది ఇదే రోజు టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని ఇక్కడే చెప్పాను.. అది నిజమైంది.
ఎన్టీఆర్‌కు భారతరత్న నిజమైన గౌరవంగా భావిస్తున్నాం.
ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వడం వల్ల భారతరత్నకే గౌరవం వస్తుంది.
ఈఏడాది అది నిజమవుతుంది భావిస్తున్నాను.
ఎన్టీఆర్ సంఘ సంస్కర్తనే కాదు.. సంక్షేమ పథకాలకు ఆద్యుడు.
పాలన దక్షిత ఉన్న నాయకుడు ఎన్టీఆర్.
-
2025-01-18T09:47:18+05:30
ఎన్టీఆర్ వర్ధంతి..
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన, నారా భువనేశ్వరి, ఏపీ మంత్రి నారా లోకేష్
-
2025-01-18T09:45:23+05:30
మహానుభావుడు ఎన్టీఆర్: బాలకృష్ణ
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, నందమూరి సుహాసిని, కుటుంబ సభ్యులు
బాలకృష్ణ కామెంట్స్..
నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి.
పేదల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
ఎన్టీఆర్ తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చింది.
టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు.
ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు.
ఎన్టీఆర్ ముందు.. తర్వాత అనే విధంగా తెలుగు రాజకీయాలు.
ప్రజల వద్దకు పాలన తీసుకురావటానికి ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
ఇప్పటికీ ఎన్టీఆర్ పథకాలనే ప్రస్తుతం ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
నానా జాతులకు ఎన్టీఆర్ ధైవ సమానం.
కార్యకర్తలను నాయకులుగా తయారుచేసింది ఎన్టీఆర్ మాత్రమే.
మద్రాసు నగరానికి మంచి నీళ్ళిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్.
-
2025-01-18T08:47:25+05:30
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య..
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కుటుంబ సభ్యులు
-
2025-01-18T08:45:50+05:30
ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు..
అమరావతి: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.
ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన టిడిపి హైకమాండ్.
వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు.
సమాజానికి ఉపయోగపడేటువంటి పలు సేవాకార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని పిలుపు.
ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులు అర్పించనున్న టీడీపీ నేతలు కార్యకర్తలు.
మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన నున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
-
2025-01-18T08:19:08+05:30
తిరుపతి: తొక్కిసలాట ఘటనలో చర్యలు ప్రారంభం
విధులలో నిరక్ష్యం వహించిన టౌన్ డిఎస్పీ వెంకటనాయణపై బదిలీ వేటు
హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు.
తొక్కిసలాట ఘటనకు బాధ్యున్ని చేస్తు సస్పెన్సన్ గురైన డిఎస్పీ రమణకుమార్.
ఆయన స్థానంలో సీసీఎస్ డిఎస్పీగా శ్యాం సుందర్ నియమాకం.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో విధుల పట్ల నిర్లక్షం వహించిన తిరుపతి డిఎస్పీ వెంకట నారాయణపై బదిలీ చేస్తూ ఉత్తర్యలు జారీ చేసిన డిజిపి.
తొక్కిసలాట ఘటన బాదితులను పరామార్శకు వచ్చిన పవన్.
అదే ఘటనలో భాదితులను పరామర్శకు వచ్చిన జగన్.
జగన్‌ను నిలువరించడంలో పోలీసులు నిర్లక్షంగా వ్యవహరించారని ఎయిర్ పోర్టు వద్ద పవన్ ఆగ్రహం.
ఈ నేపథ్యంలో డిఎస్పీ వెంకటనారాయణపై బదిలీ.
రెండు ప్రభుత్వాలలో రాష్ట్ర డిజిపిలకు తలనొప్పిగా మారిన తిరుపతి పోలీసు యునిట్.
-
2025-01-18T08:15:47+05:30
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..
తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వారా దర్శనం.
ఎనిమిది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 5 లక్షల 36 వేల మంది భక్తులు.
రేపు అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను మూసివేయనున్న అర్చకులు.