-
-
Home » Mukhyaamshalu » Telangana ap Latest Breaking Viral news to national and international on 4th nov 2025 know here kjr
-
BREAKING: అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి
ABN , First Publish Date - Nov 04 , 2025 | 06:19 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 04, 2025 17:21 IST
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు కమిటీ
స్పెషల్ సీఎస్ చైర్మన్‌గా 15 మందితో కమిటీ
కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి కమిటీలో చోటు
కమిటీలో కంచ ఐలయ్య, కోదండరామ్‌కు అవకాశం
-
Nov 04, 2025 17:08 IST
ఘోర ప్రమాదం..
ఛత్తీస్‌గఢ్: బిలాస్‌పూర్‌లో ఎదురెదురుగా ఢీకొన్న రెండు రైళ్లు
ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
గూడ్స్ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్ ట్రైన్
జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో ప్రమాదం
ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
-
Nov 04, 2025 16:25 IST
వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి
అమరావతి: క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరులో చోటు చేసుకున్న పరిణామాలపై.. నివేదిక రూపంలో వివరణ ఇచ్చిన MLA కొలికపూడి శ్రీనివాస్
టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన MP కేశినేని చిన్ని
పల్లా ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ విచారణ
ఇప్పటికే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన MLA కొలికపూడి
-
Nov 04, 2025 16:24 IST
వివేకా హత్య కేసుపై CBI కోర్టులో విచారణ
ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న పిటిషన్‌పై.. కౌంటర్ దాఖలు చేసిన ఏ2 నిందితుడు సునీల్‌యాదవ్
సునీల్‌యాదవ్ కౌంటర్‌లో కీలక అంశాలు ప్రస్తావన
CBI దర్యాప్తు కొనసాగించాలన్న సునీత పిటిషన్‌పై సమ్మతం తెలిపిన సునీల్ యాదవ్
వివేకా కేసులో సంచలన అంశాలు వెలుగులోకి రావాలని కౌంటర్‌లో పేర్కొన్న సునీల్
అనేకమంది ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందన్న సునీల్
-
Nov 04, 2025 16:23 IST
అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి
లండన్‌లో IOD సంస్థ నుంచి అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి
సాయంత్రం 7 గంటలకు లండన్‌లో మే ఫెయిర్ హాల్‌లో అవార్డుల ప్రదానం
అవార్డుల ప్రదానం కార్యక్రమానికి హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు
డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును.. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో అందుకోనున్న నారా భువనేశ్వరి
ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు
-
Nov 04, 2025 14:17 IST
మంత్రి అజరుద్దీన్‌కు శాఖల కేటాయింపు
మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కేటాయింపు
-
Nov 04, 2025 14:07 IST
గడ్డి మందు తాగి.. విద్యార్థుల ఆత్మహత్యాయత్నం..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎస్వీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం.
చెడు అలవాట్లు మానుకోవాలని వార్డెన్ మందలించడం వల్లే మనస్థాపం.
అర్ధరాత్రి గ్లాసుల్లో గడ్డిమందు, నీళ్లు కలుపుకొని ఆత్మహత్యాయత్నం.
జమ్మికుంట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు.
ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు 8వ తరగతి.
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.
-
Nov 04, 2025 13:22 IST
వివేకా హత్య కేసుపై CBI కోర్టులో విచారణ
ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న పిటిషన్‌పై..
కౌంటర్ దాఖలు చేసిన ఏ2 నిందితుడు సునీల్‌యాదవ్ పిటిషన్
సునీల్‌యాదవ్ కౌంటర్‌లో కీలక అంశాలు ప్రస్తావన
CBI దర్యాప్తు కొనసాగించాలన్న సునీత పిటిషన్‌పై సమ్మతం తెలిపిన సునీల్ యాదవ్
వివేకా కేసులో సంచలన అంశాలు వెలుగులోకి రావాలని కౌంటర్‌లో పేర్కొన్న సునీల్
అనేకమంది ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందన్న సునీల్
-
Nov 04, 2025 12:56 IST
ఒకదానికొకటి ఢీకొన్న జగన్ కాన్వాయ్ వాహనాలు
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో జగన్ కాన్వాయ్.
ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఒక దానికి ఒకటి ఢీకొన్న కాన్వాయ్ వాహనాలు.
పలువురికి స్వల్ప గాయాలు.. భారీగా ట్రాఫిక్ జామ్.
పోలీసులు ఎంత మొరపెట్టుకుంటున్నా వినకుండా... ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగుతున్న జగన్ కాన్వాయ్.
-
Nov 04, 2025 11:41 IST
లోన్ యాప్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య..
మెదక్: లోన్ యాప్ సిబ్బంది వేధింపులు భరించలేక రామాయంపేటలో సామల శ్రీశైలం (31) ఆత్మహత్య.
అవసర నిమిత్తం లోన్ యాప్‌లో రూ.80 వేలు అప్పుగా తీసుకున్న శ్రీశైలం
వడ్డీతో కలిపి లక్షా 90 వేల రూపాయలు చెల్లించాలని శ్రీశైలంను వేధిస్తున్న లోన్ యాప్ సిబ్బంది
వారి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య
-
Nov 04, 2025 11:18 IST
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
విజయవాడ: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
గోవాలో నకిలీ మద్యం కేంద్రాన్ని గుర్తించిన సిట్
వైసీపీ హయాంలో జనార్ధన్‍రావుతో కలిసి గోవాలో కల్తీ లిక్కర్ డంప్ ఏర్పాటు చేసిన జినేష్
సౌత్, నార్త్ గోవా, పనాజీ, మార్గావ్‍లో కల్తీ లిక్కర్ విక్రయం
నిందితుడు జినేష్ కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించిన సిట్
-
Nov 04, 2025 09:24 IST
డ్రగ్ పార్టీ భగ్నం
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్ పార్టీ భగ్నం
కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీ భగ్నం
డ్రగ్స్ పార్టీలో ఎండీఎంతోపాటు గంజాయి స్వాధీనం
ఆరుగురు డ్రగ్ పెడ్లర్లు, మరో ఆరుగురు డ్రగ్ కన్జ్యూమర్స్ అరెస్ట్
-
Nov 04, 2025 08:23 IST
విశాఖలో భూప్రకంపనలు..
విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున 4:19 గంటల సమయంలో భూప్రకంపనలు..
అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగులలో.. 10 కిలోమీటర్ల మీటర్ల లోతులో ప్రకంపనలు..
రెక్టార్ స్కేల్ పై 3.7 గా నమోదు.. దాని ప్రభావంతో విశాఖ, అనకాపల్లి , జిల్లాలో స్వల్ప ప్రకంపనలు..
G మాడుగులలోనూ కంపించిన భూమి..
-
Nov 04, 2025 08:20 IST
జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి
నేడు కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన
మొంథా తుఫాన్ బాధిత రైతులను పరామర్శించనున్న జగన్
జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి
గతంలో జరిగిన ఘటనల నేపధ్యంలో నిబంధనలు పాటించాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసుల సూచన
హైవేపై గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదు.
హైవేపై వాహన రాకపోకలకు అంతరాయం కలిగించరాదు.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పర్యటనకు అనుమతి..
రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో పర్యటనకు అనుమతి
ఆయా గ్రామాలలో 500 మందికి మరియు 10 కాన్వాయ్ వాహనాలకు మాత్రమే అనుమతి
ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఏదైనా సంభవిస్తే దానికి కార్యక్రమ నిర్వహకులే పూర్తి బాధ్యులు.
-
Nov 04, 2025 07:34 IST
బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి
ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడిన జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు
శ్రీ సత్య సాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని దామాజిపల్లి వద్ద గల చోటుచేసుకున్న ఘటన
ఒకరు మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు.
అర్ధరాత్రి 2గంటల సమయంలో ఘటన.
బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో జబ్బర్ ట్రావెల్స్ బస్సు (NL 01B 3382) ఐచర్ వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా
క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు.
-
Nov 04, 2025 07:32 IST
ట్రాక్టర్, బస్సు ఢీ.. 15 మందికి గాయాలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ బస్సు ఢీ
వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనక నుంచి ఢీకొన్న బస్సు..
ట్రాక్టర్ డ్రైవర్ బస్సులో ఉన్న 15 మందికి గాయాలు..
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ హాస్పిటల్‌కి తరలింంపు
మెట్‌పల్లి డిపోకి చెందిన బస్సు
హైదరాబాద్ నుంచి మెట్టుపల్లికి వెళ్తుండగా రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రమాదం