-
-
Home » Mukhyaamshalu » Live Breaking News Updates on Top Stories Around the World Operation Sindoor India Pakistan News Siva
-
Breaking News: 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేశాం: ఎయిర్ మార్షల్ AK భార్తి
ABN , First Publish Date - May 11 , 2025 | 09:34 AM
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-05-12T00:20:46+05:30
భారత్‌కు సంపూర్ణ మద్దతు:బలూచ్ లిబరేషన్ ఆర్మీ
పాకిస్థాన్ మీద బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించింది. పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామంది. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించింది. తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు ఈ సారి భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నడుమ మరింతగా దూసుకెళ్తున్నారు.
-
2025-05-12T00:02:41+05:30
వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలిన హీరో విశాల్
చెన్నై: తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలో ఏటా పెద్ద ఎత్తున జరిగే కూత్తాండవర్ ఆలయ చిత్తిరై వేడుకలకు హాజరైన హీరో విశాల్ అందాల పోటీల వేదికపైనే స్పృహ కోల్పోయారు. దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ట్రాన్స్ జెండర్లు పాల్గొనే ఈ వేడుకలో ఆదివారం రాత్రి ‘మిస్ కూవాగం 2025’ పోటీలు నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు విశాల్ వేదికపై అకస్మాత్తుగా సొమ్మసిల్లి కింద పడిపోయారు.వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో తిరిగి కోలుకున్నారు.దీంతో అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి ఆయన్ను ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.ఇటీవలి కాలంలో విశాల్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. -
2025-05-11T23:33:18+05:30
వీరమరణం పొందిన జవాను మురళీనాయక్ కుటుంబానికి రూ.75 లక్షల ఆర్థిక సాయం: పవన్ కళ్యాణ్
గోరంట్ల: పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత ఘన నివాళి అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించి, మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు.
కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయన్నారు. వారికి రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. జిల్లా కేంద్రంలో మురళీనాయక్ కాంస్య స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని, మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాలు భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు.
అంతేకాదు,మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని కూడా పవన్ హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
-
2025-05-11T23:17:56+05:30
అమెరికా అధ్యక్షుడి ప్రకటనను తప్పుబట్టిన రాహుల్ గాంధీ
భారత్ - పాకిస్థాన్ ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి తొలుత అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మన దేశ సమస్య అయిన కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చేయడాన్ని వ్యతిరేకించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం తదితర విషయాలు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానిని కోరారు. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడానికి భారత్‌కు పాక్ నుంచి ఏమి ప్రయోజనం వచ్చిందని ప్రశ్నించారు.
-
2025-05-11T23:14:16+05:30
పీవోకేను పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందే: కాంగ్రెస్ పార్టీ
పీవోకేను పాకిస్థాన్ ఖాళీ చేయాలని కోరుతూ 1994లో లోక్‌సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించబడిన తీర్మానం గురించి కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ..పీవోకే ఎప్పటికీ భారత్ భూభాగమే అని..దానిని మనం వెనక్కి తీసుకోవాలని అన్నారు. 1994 ఫిబ్రవరి 22న దేశంలో జరిగిన ఉగ్రదాడుల అనంతరం దేశంలో జమ్మూ కశ్మీర్ అంతర్భాగంగా ఉంటుందని లోక్‌సభ, రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించాయని సచిన్ గుర్తు చేశారు. అందులో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో పాక్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలను తప్పనిసరిగా వదిలి పెట్టాలని డిమాండ్ చేశామన్నారు. ఈ తీర్మానాన్ని పునరుద్ఘాటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
-
2025-05-11T19:11:56+05:30
100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేశాం: AK భార్తి..
పహల్గామ్ దాడికి భారత సైన్యం బదులిచ్చింది: ఎయిర్ మార్షల్ AK భార్తి
LoC దగ్గర ప్రతి నిబంధనను పాక్ ఉల్లంఘించింది: ఎయిర్ మార్షల్ భార్తి
ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి: AK భార్తి
ఉగ్రస్థావరాలను అంతం చేయడమే లక్ష్యం: ఎయిర్ మార్షల్ AK భార్తి
బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్ లక్ష్యంగా భారత్ దాడులు చేసింది: AK భార్తి
మురిద్కేలో 4 కీలక ఉగ్రస్థావరాలు ధ్వంసం: ఎయిర్ మార్షల్ AK భార్తి
లాహోర్‌లో రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం: ఎయిర్ మార్షల్ AK భార్తి
కసబ్, హెడ్లీ వంటి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం: ఎయిర్ మార్షల్ AK భార్తి
దాడికి యత్నించిన పాక్ డ్రోన్లను నేలకూల్చాం: ఎయిర్ మార్షల్ AK భార్తి
లాహోర్, గుజ్రన్ వాలా బేస్‌లపై దాడులు చేశాం: AK భార్తి
లాహోర్‌లో పాక్ రాడార్లను ధ్వంసం చేశాం: ఎయిర్ మార్షల్ AK భార్తి
ఆపరేషన్ సిందూర్‌లో 35-40 మంది పాక్ సైనికులు మృతి: AK భార్తి
ఈ నెల 9, 10 తేదీల్లో జమ్ము, ఉధంపూర్, పఠాన్‌కోట్‌లో డ్రోన్లతో దాడులకు పాక్ యత్నించింది: AK భార్తి
రాత్రి వేళ డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి పాక్ యత్నించింది: AK భార్తి
భారత ఎయిర్ డిఫెన్స్ అప్రమత్తంగా ఉండడంతో పౌరులు, సైనిక స్థావరాలకు నష్టం జరగలేదు: ఎయిర్ మార్షల్ AK భార్తి
-
2025-05-11T18:44:24+05:30
ఢిల్లీ: రక్షణ శాఖ అధికారుల ప్రెస్‌మీట్..
ఆపరేషన్ సిందూర్‌లో మృతిచెందిన ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన రక్షణశాఖ అధికారులు
పాక్‌లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం: లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్
9 ఉగ్రవాద స్థావరాలను నేలకూల్చాం: Lt Gen రాజీవ్
ఉగ్రవాదుల లక్ష్యంగా మాత్రమే దాడులు: Lt Gen రాజీవ్
POKలో ఉగ్రవాదుల శిబిరాలను పూర్తింగా ధ్వంసం చేశాం: Lt Gen రాజీవ్
ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ గుణపాఠం చెప్పింది: Lt Gen రాజీవ్
ఉగ్రవాదుల అంతానికే ఆపరేషన్ సిందూర్: Lt Gen రాజీవ్
-
2025-05-11T18:43:46+05:30
వన్డే సిరీస్ భారత్ కైవసం
కొలంబో: మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ భారత్ కైవసం
ఫైనల్‌లో 97 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం
భారత మహిళల జట్టు: 342/7, శ్రీలంక మహిళల జట్టు 245 ఆలౌట్
సెంచరీతో రాణించిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన
వన్డే కెరీర్‌లో 10వ సెంచరీ చేసిన స్మృతి మంధాన
-
2025-05-11T18:43:05+05:30
పాక్‌తో చర్చలg.. BLA కీలక ప్రకటన
రేపు పాక్‌తో చర్చల నేపథ్యంలో BLA కీలక ప్రకటన
భారత్‌కు మద్దతు ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ
భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తాం: BLA
పాక్‌ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలి: BLA
పాక్‌పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే..
పశ్చిమ సరిహద్దు నుంచి పాక్‌పై దాడి చేస్తాం: BLA
LeT, JeM, ISIS వంటి ఉగ్రవాద సంస్థలకు..
పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోంది: బలూచ్ లిబరేషన్ ఆర్మీ
పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా మారింది: BLA
పాకిస్థాన్‌ను నమ్మొద్దు: బలూచ్ లిబరేషన్ ఆర్మీ
-
2025-05-11T17:16:48+05:30
ఘోర రోడ్డుప్రమాదం..
శ్రీ సత్యసాయి జిల్లా: నల్లచెరువులో ఘోర రోడ్డుప్రమాదం
నల్లచెరువు మండలం పెద్దఎల్లంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
ప్రమాదంలో ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
మృతులు నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు
-
2025-05-11T17:15:40+05:30
రక్షణశాఖ ప్రెస్‌మీట్..
ఢిల్లీ: సాయంత్రం 6.30 గంటలకు రక్షణశాఖ ప్రెస్‌మీట్
ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడనున్న త్రివిధ దళాధిపతులు
-
2025-05-11T17:14:56+05:30
POK అంశంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
POK అంశంలో మాకు మధ్యవర్తుల అవసరం లేదు: మోదీ
కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే: మోదీ
POKను భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు: మోదీ
కశ్మీర్ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదు: మోదీ
-
2025-05-11T17:14:30+05:30
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
ఆపరేషన్ సిందూర్ ముగియలేదు: ప్రధాని మోదీ
అటునుంచి తుపాకీ గుళ్లు వస్తే భారత్ నుంచి మిస్సైల్స్ ప్రయోగించాలి: ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి కొత్త సందేశం పంపాం: మోదీ
ఉగ్ర శిబిరాలు సహా హెడ్‌క్వార్టర్స్‌ను ధ్వంసం చేశాం: మోదీ
వైమానిక దాడుల తర్వాత పాక్ చేతులెత్తేసింది: మోదీ
సింధూ జలాల ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టాం: మోదీ
ఉగ్రదాడులు ఆగేవరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుంది: మోదీ
పాక్ దాడులకు దిగితే.. భారత్ కూడా ఎదురుదాడి చేస్తుంది: మోదీ
-
2025-05-11T16:14:56+05:30
డీసీసీబీ ఛైర్మన్లు వీరే..
ఏలూరు DCCB చైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు(TDP)
ప్రకాశం DCCB చైర్మన్‌గా కామేపల్లి సీతారామయ్య(TDP)
కాకినాడ DCCB చైర్మన్‌గా తుమ్మల రామస్వామి(JSP)
ఏలూరు DCMS చైర్మన్‌గా చాగంటి మురళీకృష్ణ(JSP)
ప్రకాశం DCMS చైర్మన్‌గా కసిరెడ్డి శ్యామల(TDP)
కాకినాడ DCMS చైర్మన్‌గా పి.చంద్రమౌళి(TDP)
APCOB చైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు(TDP)
-
2025-05-11T15:43:18+05:30
ఏ ముఖ్యమంత్రీ అలా చేయలేదు: హరీశ్ రావు
సీఎం రేవంత్ సచివాలయానికే రావట్లేదు: ఎమ్మెల్యే హరీశ్ రావు
కమాండ్ కంట్రోల్ సెంటర్, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ల నుంచి సీఎం రేవంత్ పాలన సాగిస్తున్నారు: 'ఎక్స్'లో హరీశ్ రావు
పోటీ పరీక్షల ఫలితాలను ఏ ముఖ్యమంత్రీ తని ఇంటి నుంచి విడుదల చేయలేదు: హరీశ్ రావు
ఇది రేవంత్‌రెడ్డి అహంభావానికి నిదర్శనం: హరీశ్ రావు
-
2025-05-11T15:41:14+05:30
భారత్-పాక్ యుద్ధం.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన..
ఆపరేషన్ సిందూర్ ముగియలేదు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్
పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం: రాజ్‌నాథ్
ఉగ్రవాదాన్ని భారత్ సహించదు: రాజ్‌నాథ్
పాక్‌లోకి చొచ్చుకెళ్లి అనేక దాడులు చేశాం: రాజ్‌నాథ్
పాక్ ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇచ్చాం: రాజ్‌నాథ్
పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదు, కానీ భారత ప్రజలపై పాక్ దాడి చేసింది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్
ఆలయాలు, గురుద్వారాలపై దాడి చేశారు: రాజ్‌నాథ్
భారత్ సంకల్పాన్ని ఆపరేషన్ సిందూర్ చాటిచెప్పింది: రాజ్‌నాథ్
రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేశాం: రాజ్‌నాథ్
సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనం: రాజ్‌నాథ్
బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశాం: రాజ్‌నాథ్
పాక్ దాడులను మన సైన్యం దీటుగా తిప్పికొట్టింది: రాజ్‌నాథ్
-
2025-05-11T15:41:13+05:30
భారత వాయుసేన కీలక ప్రకటన..
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది: ఎయిర్‌ఫోర్స్
మాకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తిచేశాం: ఎయిర్‌ఫోర్స్
ఆపరేషన్ సిందూర్‌పై ఊహాగానాలు నమ్మొద్దు: ఎయిర్‌ఫోర్స్
-
2025-05-11T12:58:16+05:30
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులను ఖచ్చితత్వంతో, వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేసింది.
జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, ఉద్దేశపూర్వకంగా, వివేకంతో కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి.
కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున, తగిన సమయంలో వివరణాత్మక బ్రీఫింగ్ నిర్వహించబడుతుంది.
అనధికారిక సమాచారం ఊహాగానాల వ్యాప్తికి దూరంగా ఉండాలని ప్రకలను కోరిన భారత వాయిసేన.
-
2025-05-11T11:27:47+05:30
తెలంగాణ EAPCET అగ్రీ ఫలితాలు విడుదల...
ఫలితాలను ఈ https://eapcet.tgche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
-
2025-05-11T11:27:46+05:30
TG EAPCET 2025 ఫలితాలు విడుదల
జూబ్లీహిల్స్ నివాసంలో ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-
2025-05-11T11:13:52+05:30
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం.
సమావేశంలో పాల్గొన్న త్రివిధ దళాధిపతులు.
కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై చర్చ.
-
2025-05-11T10:57:26+05:30
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన..
భారత్, పాకిస్తాన్ బలమైన, నిశ్చలమైన నాయకత్వంపై నాకు చాలా గర్వంగా ఉంది.
వారు ధైర్యం, జ్ఞానం, బలాన్ని చూపించి ఇప్పుడే ఆగిపోవాల్సిన సమయమని గ్రహించారు.
ప్రస్తుతం దాడులు కొనసాగి ఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది.
లక్షలాది మంది నిర్దోషుల ప్రాణాలు పోయేవి.
మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం మరింత గొప్పదిగా మారింది.
అమెరికా ఈ చారిత్రకమైన, వీరోచితమైన నిర్ణయానికి మద్దతు ఇచ్చినందుకు నాకు గర్వంగా ఉంది.
ముందుగా చర్చించినప్పటికీ, ఈ గొప్ప దేశాలతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను.
వేల సంవత్సరాల తర్వాత అయినా కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనిపెట్టేందుకు మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను.
భారత్, పాకిస్తాన్ నాయకత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలి. అద్భుతమైన పని చేశారు.
-
2025-05-11T10:00:52+05:30
మరికాసేపట్లో రక్షణ శాఖ కీలక సమావేశం..
ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మీడియా సమావేశం.
నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలపైన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్న కేంద్ర రక్షణ శాఖ.
నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రధాని చేసిన ఆరోపణలకు బదులు ఇవ్వనున్న కేంద్ర రక్షణ శాఖ.
-
2025-05-11T09:34:29+05:30
ఢిల్లీ: కాల్పుల విరమణ అనంతరం భారత్ పాకిస్తాన్ నడుమ నెలకొన్న ప్రశాంత వాతావరణం.
జమ్ముకాశ్మీర్, శ్రీ నగర్, ఉదంపూర్, జైసల్మేర్, అమృత్ సర్, పంచుకుల హర్యానా, ఉరి, బారాముల్లా, రాజస్థాన్ బార్మీర్‌లో నెలకొన్న సాధారణ పరిస్థితిలు. రాత్రిపూట డ్రోన్లు, కాల్పులు కానీ షెల్లింగ్ జరగలేదని నివేదించిన అధికారులు.
జమ్ము ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న సాధారణ జనజీవనం.