-
-
Home » Mukhyaamshalu » ap telangana states to national international live updates on 28th oct vreddy
-
BREAKING: 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
ABN , First Publish Date - Oct 28 , 2025 | 06:27 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 28, 2025 16:01 IST
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
అమరావతి: స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
గ్రామీణ స్థానికసంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
రూ.410 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ
2025-26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్‌లైన్ గ్రాంట్ కింద రూ.365 కోట్లు..
అదనపు నిధులు మరో రూ.45 కోట్లు కలిపి మొత్తం రూ.410 కోట్లు విడుదల
-
Oct 28, 2025 16:01 IST
పోలీసుల ఎదుట లొంగిపోయిన మరో మావోయిస్టు కీలక నేత
పోలీసుల ఎదుట లొంగిపోయిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న
బండి ప్రకాష్‌తో కలిసి డీజీపీ ఎదుట లొంగిపోయిన పుల్లూరి ప్రసాదరావు
అజ్ఞాతంలో ఉన్న 64 మంది తెలంగాణా మావోయిస్టులు
ఇప్పటి వరకు 427మంది మావోయిస్టులు లొంగుబాటు
8 మంది స్టేట్ కమిటీ, 2 సెంట్రల్ కమిటీ మెంబెర్స్ లొంగుబాటు
అజ్ఞాతంలో ఉన్న 64 మంది మావోయిస్టులు
-
Oct 28, 2025 16:01 IST
ప్రశాంత్ కిషోర్‌కు షాక్..
ఢిల్లీ: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
రెండు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ ఓటు నమోదు వివరణ ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
బిహార్, బెంగాల్‌లో ఓటరుగా నమోదు చేయించుకున్న ప్రశాంత్ కిషోర్
-
Oct 28, 2025 15:18 IST
ఢిల్లీ: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
8వ పే కమిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
మరో 18 నెలల్లో సిఫారసులు చేయనున్న వేతన సంఘం
జనవరిలో 8వ వేతన సంఘాన్ని నియమించిన కేంద్రం
-
Oct 28, 2025 09:22 IST
మూసీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
MRDCLకు 734.07 ఎకరాల భూమి కేటాయింపు
హిమాయత్‌సాగర్, బుద్వేల్, రాజేంద్రనగర్,..
శంషాబాద్ ప్రాంతాల భూములు కేటాయింపు
ఏడీబీతో రూ.4,100 కోట్ల రుణ ఒప్పందం పూర్తి
మూసీ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
నవంబర్‌లో డీపీఆర్ కేంద్రానికి పంపే యోచన
మూసీ ప్రాజెక్ట్ కోసం కేంద్రం సూత్రపాయ ఆమోదం
ఫ్యూచర్ సిటీలో ప్రత్యామ్నాయ భూమి కేటాయింపులకు ప్రభుత్వం కసరత్తు
-
Oct 28, 2025 09:04 IST
యానాం వైపుకు దూసుకొస్తున్న 'మొంథా' తుఫాన్
'మొంథా' తుఫాన్‌పై పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆరా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రంగస్వామి
పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఫోన్ చేసి..
తుఫాన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం రంగస్వామి
యానాంలో రక్షణ చర్యలపై సీఎంకు వివరించిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి
తుఫాన్‌పై అన్ని చర్యలు తీసుకున్నాం: పుదుచ్చేరి సీఎం రంగస్వామి
-
Oct 28, 2025 08:32 IST
తమిళనాడులో 'మొంథా' తుఫాన్ ప్రభావం
భారీ వర్షాలతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కడలూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Oct 28, 2025 08:13 IST
బంగాళాఖాతంలో దూసుకొస్తున్న 'మొంథా' తుఫాన్
తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం
రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం
రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Oct 28, 2025 06:51 IST
భారత్-లండన్ మధ్య ఇండిగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులు
బోయింగ్ 789-9 డ్రీమ్‌లైనర్ విమానం లండన్‌లోని..
హీత్రో ఎయిర్‌పోర్టు నుంచి భారత్‌కు నేరుగా విమాన సేవలు
-
Oct 28, 2025 06:51 IST
ట్రంప్ సర్కార్‌పై కేంద్రమంత్రి జైశంకర్ పరోక్ష విమర్శలు
రష్యా చమురుపై భారత్ సెలక్టివ్‌గా చర్యలు అన్న వ్యాఖ్యలపై అభ్యంతరం
కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియాన్ దేశాల సదస్సులో వ్యాఖ్యలు
-
Oct 28, 2025 06:51 IST
తెలంగాణలో 19 మద్యం దుకాణాలకు నేడు మరోసారి నోటిఫికేషన్
లాటరీ నిర్వహించిన 19 దుకాణాలకు నోటిఫికేషన్
నవంబర్ 1 వరకు 19 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరణ
నవంబర్ 3న 19 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా
ఆసిఫాబాద్ జిల్లాలో 7, ఆదిలాబాద్ జిల్లాలో 6, భూపాలపల్లి జిల్లాలో 2,..
శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలోని ఒక దుకాణానికి నోటిఫికేషన్
-
Oct 28, 2025 06:42 IST
ఢిల్లీ: నేటి నుంచి 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ
నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్
కేరళ, తమిళనాడు, యూపీ, బెంగాల్, రాజస్థాన్, గోవా, గుజరాత్,..
మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఎస్ఐఆర్
డిసెంబర్ 9న ముసాయిదా ఎస్ఐఆర్ జాబితా
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రకటన: సీఈసీ
-
Oct 28, 2025 06:41 IST
ఏపీ ఇంటర్ పరీక్షల ఫీజుచెల్లించడానికి ఆఖరు తేదీ పొడిగింపు
ఈ నెల 30 వరకు ఇంటర్ ఫీజు చెల్లించే అవకాశం
రూ.1,000 ఫైన్‌తో వచ్చే నెల 6 వరకు చెల్లించే అవకాశం
-
Oct 28, 2025 06:41 IST
హైదరాబాద్: నేడు యూసుఫ్‌గూడలో సీఎం రేవంత్ రెడ్డి సభ
సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల అభినందన సభ
ఇటీవల సినీపరిశ్రమలో సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి
సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్‌గ్రౌండ్‌లో కార్యక్రమం
-
Oct 28, 2025 06:30 IST
హరీష్ రావుకు పితృ వియోగం
హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం
-
Oct 28, 2025 06:28 IST
చెన్నైలో స్పైస్ జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
మదురై నుంచి దుబాయ్ వెళుతున్న విమానం
సాంకేతిక లోపంతో చెన్నైలో అత్యవసర ల్యాండింగ్
-
Oct 28, 2025 06:27 IST
మొంథా తుఫాన్ నేపథ్యంలో ద.మ.రైల్వే అప్రమత్తం
రైల్వే అధికారులతో ద.మ.రైల్వే జీఎం శ్రీవాత్సవ
రైల్వే ట్రాక్స్ వెంట పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశం
ట్రాక్స్ వెంట నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశం
-
Oct 28, 2025 06:27 IST
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై HRCలో ఫిర్యాదు
HRCలో ఫిర్యాదు చేసిన రియాజ్ తల్లి, భార్య
డీజీపీని నివేదిక కోరిన మానవహక్కుల కమిషన్
వచ్చే నెల 3లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం