-
-
Home » Mukhyaamshalu » Andhra Pradesh Telangana national and International latest breaking news and live updates on 17th Decem 2025 vreddy
-
BREAKING: జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు
ABN , First Publish Date - Dec 17 , 2025 | 07:05 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 17, 2025 10:51 IST
మరో 7 దేశాలపై యూఎస్ ట్రావెల్ బ్యాన్
ఇప్పటికే 12 దేశాలపై పూర్తి నిషేధం విధించిన ట్రంప్
19కి చేరుకున్న ఫుల్‌బ్యాన్ దేశాల లిస్ట్
అమెరికా తాత్కాలిక నిషేధ జాబితాలో 15 దేశాలు
-
Dec 17, 2025 10:41 IST
మంచి ఆలోచనలు ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం: చంద్రబాబు
మనం చేసేపనిలో జవాబుదారీతనం ఉండాలి: చంద్రబాబు
మెరుగైన ఫలితాలు వచ్చేవాటికి ప్రాధాన్యత ఇవ్వాలి
లక్ష్యం కోసం ఎలా పనిచేస్తున్నాం అనేది ముఖ్యం: చంద్రబాబు
ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదా గమనించాలి: చంద్రబాబు
ప్రజలు మెచ్చేలా అధికారుల పాలన ఉండాలి: సీఎం చంద్రబాబు
-
Dec 17, 2025 09:45 IST
రాష్ట్రవ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 23.52 పోలింగ్ శాతం నమోదు
-
Dec 17, 2025 09:32 IST
టీటీడీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావుకు మాతృవియోగం
రామ్మోహన్‌రావు తల్లి వెంకటనరసమ్మ(99) కన్నుమూత
సంతాపం తెలిపిన చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలు
గన్నవరం నియోజకవర్గం పెద్దఅవుటపల్లిలో అంత్యక్రియలు
-
Dec 17, 2025 09:31 IST
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
బచావత్ తీర్పునకు విరుద్ధంగా గోదావరి జలాలను తరలిస్తున్నారని పిటిషన్
ప్రాజెక్ట్‌పై ముందుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం
-
Dec 17, 2025 08:10 IST
అమరావతి: భారతి సిమెంట్స్‌కు నోటీసులు
సున్నపురాయి లీజ్ రద్దుకు మైనింగ్ శాఖ నోటీసులు
2024లో చట్ట విరుద్ధంగా 50 ఏళ్లకు లీజు
కడప జిల్లాలో 744 ఎకరాలు కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం
అక్రమ లీజ్‌లపై విచారణ జరపాలని జనవరిలోనే కేంద్రం ఆదేశం
15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ..
ACC, రామ్ కో సిమెంట్స్‌కు కూడా మైనింగ్‌శాఖ నోటీసులు
-
Dec 17, 2025 08:10 IST
నేడు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం
సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా కాన్ఫరెన్స్
18 నెలల పాలనపై సమీక్ష, కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
నూతన లక్ష్యాలు, కార్యాచరణపై సీఎం చంద్రబాబు మార్గదర్శనం
శాంతి భధ్రతలపై రేపు ఎస్పీలతో చర్చించనున్న సీఎం చంద్రబాబు
-
Dec 17, 2025 07:09 IST
నేడు ఢిల్లీలో వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం
-
Dec 17, 2025 07:09 IST
తెలంగాణలో నేడు తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్
మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడి
3,752 పంచాయతీలు, 28,410 వార్డులకు పోలింగ్
ఎన్నికల బరిలో 12,652 మంది సర్పంచ్ అభ్యర్థులు
ఎన్నికల బరిలో 75,725 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు
-
Dec 17, 2025 07:07 IST
ఎల్లుండి రామోజీ ఫిల్మ్‌సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆలిండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల..
జాతీయ సదస్సు ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈనెల 20న గచ్చిబౌలి శాంతి సరోవర్ సదస్సుకు రాష్ట్రపతి ముర్ము నేటినుంచి ఈనెల 22 వరకు అల్వాల్, గచ్చిబౌలి పరిధిలో..
డ్రోన్లు, పారా గ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఎగురవేతపై నిషేధం
-
Dec 17, 2025 07:06 IST
శీతాకాల విడిదికి నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము
మ.2.25 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు రాష్ట్రపతి
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో 5 రోజులు ఉండనున్న ముర్ము
-
Dec 17, 2025 07:05 IST
జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు
రేపు డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసనలకు టీపీసీసీ పిలుపు