-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy today telugu latest viral trending and Breaking news across globe 17Th oct 2025 kjr
-
BREAKING: మంత్రి నారాయణ వ్యాఖ్యలను వక్రీకరించారు: మాజీ ఎమ్మెల్యే వర్మ
ABN , First Publish Date - Oct 17 , 2025 | 05:56 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 17, 2025 20:53 IST
మంత్రి నారాయణ వ్యాఖ్యలను వక్రీకరించారు: మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేవు: మాజీ ఎమ్మెల్యే వర్మ
పేటీఎం బ్యాచ్ అసత్య ప్రచారాలను పట్టించుకోను: మాజీ ఎమ్మెల్యే వర్మ
కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు: వర్మ
-
Oct 17, 2025 20:53 IST
తెలంగాణలో రేపటితో ముగియనున్న మద్యం షాపు దరఖాస్తుల స్వీకరణ
2,620 మద్యం షాపులకు ఒక్కరోజే 25వేల దరఖాస్తులు
మద్యం షాపులకు ఇప్పటివరకు 50వేల దరఖాస్తులు
రేపు 50వేల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా
-
Oct 17, 2025 20:53 IST
అమరావతి: ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
పాల్గొన్న మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్, సీఎస్
దీపావళి కానుకగా ఉద్యోగులకు డీఏ ప్రకటించే అంశంపై చర్చ
ఉద్యోగుల ఇతర ఆర్థిక సమస్యలపై చర్చించిన చంద్రబాబు
ఉద్యోగుల డీఏపై రేపు స్పష్టత వచ్చే అవకాశం
-
Oct 17, 2025 20:53 IST
అమరావతి: ఉద్యోగ సంఘాలతో రేపు మంత్రుల బృందం చర్చలు
సీఎం ఆదేశాలతో చర్చలు జరపనున్న మంత్రుల బృందం
డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్న ప్రభుత్వం
ఉద్యోగ సంఘాలతో రేపు భేటీకానున్న..
మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, పయ్యావుల, సీఎస్
-
Oct 17, 2025 20:17 IST
నల్లగొండ: అధిక వడ్డీల కేసులో అరెస్టయిన బాలాజీ నాయక్ ఆడియో లీక్
అధిక వడ్డీల వ్యవహారంలో ఇటీవల జైలుకెళ్లిన బాలాజీ నాయక్
జైలు నుంచి ఏజెంట్లతో ఫోన్ మాట్లాడిన బాలాజీ నాయక్
ఖర్చులకు రూ.లక్ష పంపించాలంటూ బాలాజీ నాయక్ ఆడియో
ఎంత ఖర్చయినా పర్వాలేదు.. బెయిల్ రెడీ చేయండి: బాలాజీ
ఏజెంట్లు దొరకకుండా జాగ్రత్త పడాలి.. ఎవరూ నోరు మెదపకండి: బాలాజీ
నేను నల్లగొండ జైలులో ఉన్నట్టు ఎవరికీ చెప్పకండి: బాలాజీ నాయక్
నా కార్డులన్నీ స్వైప్ చేయండి: ఆడియో కాల్‌లో బాలాజీ నాయక్
-
Oct 17, 2025 17:50 IST
నాగారం భూములపై దాఖలైన 2 పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
194, 195 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు లేవన్న రెవెన్యూశాఖ
రెవెన్యూ శాఖ నివేదిక ఆధారంగా రెండు పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
నాగారం భూములపై పిటిషన్లు వేసిన ఉడ్త్యా రాములు, బీర్ల మహేష్
-
Oct 17, 2025 17:50 IST
మహబూబ్‌నగర్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి
ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా మంత్రులు, సీఎం అయ్యేది
జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తా: అనిరుధ్‌రెడ్డి
ఇంకో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించండి..
నేను కూడా సీఎం అభ్యర్థి అవుతా: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
-
Oct 17, 2025 15:36 IST
తిరుమల లడ్డూ ధరల పెంపు ప్రసక్తే లేదు: టీటీడీ ఛైర్మన్
లడ్డూ ధరలు పెంపు అనేది అవాస్తవం: బీఆర్ నాయుడు
కొన్ని ఛానళ్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి
టీటీడీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి: టీడీడీ ఛైర్మన్
-
Oct 17, 2025 15:36 IST
అమరావతి: విధ్వంసమైన పోలవరానికి చంద్రబాబు ప్రాణం పోశారు: కొలికపూడి
జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారు: కొలికపూడి శ్రీనివాసరావు
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్‌ను వరదల్లో ముంచేశారు: ఎమ్మెల్యే కొలికపూడి
పోలవరం నిర్వాసితులకు వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదు: కొలికపూడి
పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వం 16 నెలల్లో రూ.2,100 కోట్లు విడుదల చేసింది
పోలవరం ప్రాజెక్ట్ పనులు 86శాతం పూర్తయ్యాయి: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
-
Oct 17, 2025 15:36 IST
గుంటూరు: అంధురాలు పాములపాటి జ్యోతికి అండగా అమెరికా కమ్మ సంఘం
జ్యోతి పేరిట పోస్టాఫీస్‌లో రూ.10.50లక్షలు జమ చేసిన అమెరికా కమ్మ సంఘం
డిపాజిట్ పేపర్‌ను జ్యోతికి అందజేసిన మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమ్మ సంఘం నేతలు
-
Oct 17, 2025 15:36 IST
విజయవాడ: IPS అధికారి సంజయ్ రిమాండ్ పొడిగింపు
ఈనెల 31 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయిన సంజయ్
-
Oct 17, 2025 15:36 IST
విజయవాడ: లిక్కర్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై వాదనలు ప్రారంభం
వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్దార్ద్ లూథ్రా
నిందితుల తరఫున వాదనలు వినిపిస్తున్న పొన్నవోలు
-
Oct 17, 2025 15:36 IST
పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా అందరం P4లో భాగస్వాములవుదాం: చంద్రబాబు
స్వర్ణాంధ్ర విజన్ 2047లోని ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన: సీఎం చంద్రబాబు
పేదరిక నిర్మూలనకు మా ప్రభుత్వం తొలిరోజు నుంచి పనిచేస్తోంది: చంద్రబాబు
16 నెలల్లో రూ.లక్ష కోట్లకుపైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం: చంద్రబాబు
-
Oct 17, 2025 13:11 IST
ప్రపంచ ప్రఖ్యాత పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో విశాఖ గూగుల్ ఏఐ డేటా హబ్ ప్రస్తావన
విశాఖ పేరు, గూగుల్ పెట్టుబడులను వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ప్రస్తావించారు: చంద్రబాబు
టెక్నాలజీ పెట్టుబడుల రంగంలో విశాఖ ఇప్పుడు ప్రపంచపటంలో నిలుస్తోంది
ఈ పురోగతి నాకు ఎంతో ఆనందంగా ఉంది: సీఎం చంద్రబాబు
-
Oct 17, 2025 13:06 IST
నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో మన రాష్ట్రం ముందుంది: కిషన్‌రెడ్డి
తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాలు 122కు చేరాయి: కిషన్‌రెడ్డి
తెలంగాణలో ఏడాది పత్తి ఉత్పత్తి పెరిగే అవకాశం: కిషన్‌రెడ్డి
కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతుల వివరాలు..
పంటల విస్తీర్ణం సేకరిస్తున్నాం: కిషన్‌రెడ్డి
9 ప్రాంతీయ భాషల్లో కపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చాం: కిషన్‌రెడ్డి
రైతులకు మేలు జరిగేలా జిన్నింగ్ మిల్లులను మ్యాపింగ్ చేశాం
పత్తికి మద్దతు ధర పెంచి సీసీఐ కొనుగోలు చేస్తోంది: కిషన్‌రెడ్డి
కేంద్రం రూ.600 కోట్లతో కపాస్ క్రాంతి మిషన్‌ను ఏర్పాటు చేసింది: కిషన్‌రెడ్డి
-
Oct 17, 2025 12:03 IST
బీసీ రిజర్వేషన్లను బీజేపీనే అడ్డుకుంటోంది: డిప్యూటీ సీఎం భట్టి
రేపటి బీసీ బంద్‌కు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి
రేపటి ఓబీసీ బంద్‌కు ప్రధాన కారణం బీజేపీనే: భట్టి
రేపటి బంద్‌లో అందరూ విజయవంతం చేయాలి: భట్టి
సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తాం: భట్టి
అఖిలపక్షంతో ప్రధాని మోదీని కలవాలనుకున్నాం: భట్టి
మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు: డిప్యూటీ సీఎం భట్టి
-
Oct 17, 2025 11:56 IST
తెలంగాణ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్
రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్
ఈసీ నోటిఫికేషన్ సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్
పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సురేందర్
విచారణ రెండు వారాలకు వాయిదా
-
Oct 17, 2025 11:55 IST
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ
బస్తర్ జిల్లా జగదల్‌పుర్‌లో లొంగిపోయిన 208 మంది మావోయిస్టులు
సీఎం విష్ణుదేవ్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆశన్న
153 తుపాకులు, 11 గ్రనేడ్ లాంచర్లు, 19 AK47లు, 17 SLRలు,..
36 303 రైఫిళ్లు, 11 GGL లాంఛర్లు, 41 సింగిల్ షాట్ గన్స్, మెషీన్ గన్స్ అప్పగింత
నక్సల్ రహిత ప్రాంతంగా బస్తర్ ఉత్తర ప్రాంతం
-
Oct 17, 2025 11:41 IST
టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టులో విచారణ
కౌంటర్ దాఖలు చేయనందుకు న్యాయమూర్తి ఆగ్రహం
ఈనెల 27న కోర్టు ముందు ఈఓను హాజరుకావాలన్న న్యాయమూర్తి
లేని పక్షంలో ఏపీ న్యాయవాదుల అసోసియేషన్‌కు..
రూ.20 వేలు జరిమానా చెల్లించాలన్న న్యాయమూర్తి
పరకామణి కేసు సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్‌లో రిజిస్టర్‌కు అందజేసిన సీఐడీ అధికారులు
గత నెల సెప్టెంబర్ 19 న కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన టీటీడీ ఈఓ
ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయనందుకు హైకోర్టు ఆగ్రహం
కథలు చెప్పొద్దంటూ టీటీడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం
తదుపరి విచారణ కేసు ఈనెల 27కి వాయిదా
-
Oct 17, 2025 11:41 IST
ఏసీబీ కోర్టుకు ఐపీఎస్ అధికారి సంజయ్ తరలింపు
రిమాండ్ గడువు ముగియడంతో కోర్టుకు తీసుకొచ్చిన ఏసీబీ అధికారులు
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ సంజయ్‌పై కేసు
విజయవాడలోని జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంజయ్
-
Oct 17, 2025 11:40 IST
బెంగళూరులో యువతి దారుణ హత్య
ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యామిని ప్రియ గొంతుకోసి హత్య
ఒంటరిగా వెళ్తున్న సమయంలో యామిని హత్య
మంత్రి మాల్ దగ్గర రైల్వే ట్రాక్ వరకు వెంటపడ్డ విగ్నేష్
యామిని కళ్లలో కారంపొడి చల్లిన నిందితుడు విగ్నేష్
పదునైన ఆయుధంతో కంటి దగ్గర, గొంతు కోసిన విగ్నేష్
-
Oct 17, 2025 11:07 IST
ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి ములకలచెరువు నకిలీ మద్యం కేసు నిందితులు
10 మందిని కస్టడీకి తీసుకున్న మదనపల్లె ఎక్సైజ్ పోలీసులు
మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
రేపు కూడా నిందితులను ప్రశ్నించనున్న మదనపల్లె ఎక్సైజ్ పోలీసులు
ప్రధాన నిందితుడు సురేంద్రనాయుడు, కట్టా రాజు సహా 10 మందికి కస్టడీ
-
Oct 17, 2025 10:38 IST
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణం
జవహర్‌నగర్‌లో అద్దె ఇంట్లో సీసీ కెమెరా కలకలం
అద్దెకు ఉంటున్న వారి బాత్‌రూమ్‌లో..
ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి సీసీ కెమెరా ఏర్పాటు చేసిన ఇంటికి యజమాని
ఈనెల 4న బల్బు హోల్డర్‌లో రహస్య కెమెరా ఏర్పాటు
ఈనెల 13న సీసీ కెమెరాను గుర్తించిన అద్దెకు ఉంటున్న దంపతులు
ఇంటి యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు
పరారీలో ఎలక్ట్రీషియన్ చింటూ, గాలిస్తున్న పోలీసులు
-
Oct 17, 2025 10:38 IST
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి పవనాలు తిరోగమనం
ఉత్తర జార్ఖండ్ దగ్గర ఉపరితల ఆవర్తనం
ఏపీలో ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
పలు ప్రాంతాలు మేఘావృతం, కొన్ని చోట్ల మోస్తరు వర్ష సూచనలు
అగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం
-
Oct 17, 2025 10:37 IST
ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఆవర్తనం
సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం
24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం
48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం
-
Oct 17, 2025 10:25 IST
కొమురంభీం జిల్లా: లింగాపూర్ మం. ఎల్లాపటార్‌లో దారుణం
భార్యపై కోపంతో అత్తింటికి నిప్పుపెట్టిన అల్లుడు
భర్త ముజాహిద్‌పై అలిగి పుట్టింకి వెళ్లిన భార్య
అత్తింటికి వెళ్లి గొడవ పడిన అల్లుడు
గ్యాస్ లీక్ చేసి నిప్పు పెట్టి పరారైన అల్లుడు, ఇల్లు దగ్ధం
-
Oct 17, 2025 10:25 IST
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై IPSలు దృష్టి పెట్టాలి: BSF DG దల్జిత్ సింగ్
డ్రగ్స్, స్మిగ్లింగ్, టెక్రరిజాన్ని అడుడకోవడంలో IPSలే కీలకం
మానవ హక్కులను కాపాడాలి: BSF DG దల్జిత్ సింగ్ చౌదరి
చట్టం అమలు విషయంలో ప్రజలందరిని ఒకేలా చూడాలి: దల్జిత్ సింగ్
సాంకేతిక మీద మాత్రమే ఆధారపడొద్దు.. క్షేత్రస్థాయిలో పనిచేయాలి
కొత్త చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి: దల్జిత్ సింగ్
-
Oct 17, 2025 10:24 IST
నకిలీ ఓటర్ల జాబితాపై మధురానగర్ పీఎస్‌లో ఎన్నికల అధికారి ఫిర్యాదు
సినీనటుల పేరుతో నకిలీ ఓటర్ల జాబితాతో సోషల్ మీడియాలో పోస్టులు
-
Oct 17, 2025 10:24 IST
కడప: హత్య సినిమా యూనిట్‌కు సునీల్ యాదవ్ నోటీసులు
సినిమాలో తన తల్లి పాత్రను అసభ్యంగా చూపారని లీగల్ నోటీసులు
-
Oct 17, 2025 09:33 IST
హైదరాబాద్: గోషామహల్‌లో హైడ్రా కూల్చివేతలు
కుల్సుంపురాలో 1.3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
-
Oct 17, 2025 09:10 IST
పెద్దపల్లి: రామగుండం దగ్గర డీజిల్ ట్యాంక్ పగిలి కారులో మంటలు
కారు దగ్ధం, కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డ కుటుంబం
హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్తుండగా ఘటన
-
Oct 17, 2025 09:10 IST
హైదరాబాద్‌లో బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,410
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,690
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,86,000
-
Oct 17, 2025 08:42 IST
కీసర పీఎస్ పరిధిలోని రాంపల్లిలో హనుమాన్ విగ్రహం ధ్వంసం
హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 17, 2025 08:41 IST
సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్ IPS శిక్షణ పూర్తి
పాసింగ్ అవుడ్ పరేడ్‌లో పాల్గొన్న BSF డైరెక్టర్ దల్జిల్ సింగ్ చౌదరి
శిక్షణ పూర్తి చేసుకున్న 190 మంది IPSలు
-
Oct 17, 2025 08:41 IST
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
300 మార్క్ దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
దీపావళికి ముందే పెరిగిన వాయు కాలుష్యం
-
Oct 17, 2025 08:28 IST
నేడు 11:30కు మైన్స్, రెవెన్యూ జనరేషన్, ఉచిత ఇసుకపై చంద్రబాబు సమీక్ష
మ.12:30 గంటలకు కార్మిక సంక్షేమ శాఖపై చంద్రబాబు సమీక్ష
-
Oct 17, 2025 08:27 IST
ఇవాళ శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ భేటీ
నిన్న పుతిన్‌తో 2 గంటలకు పైగా ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్
పుతిన్‌తో సంభాషణలో గొప్ప పురోగతి సాధించామని నమ్ముతున్నా: ట్రంప్
పుతిన్‌తో త్వరలో భేటీ కానున్నట్టు తెలిపిన ట్రంప్
హంగరీలోని బుడాపెస్ట్‌లో పుతిన్‌తో భేటీ ఉంటుందన్న ట్రంప్
కీలకమైన అంతర్జాతీయ అంశాలపై చర్చించిన ట్రంప్, పుతిన్
ఇజ్రాయెల్, గాజా సమస్యను ట్రంప్ పరిష్కరించడంపై పుతిన్ హర్షం
పశ్చిమాసియాలో శాంతి తీసుకొచ్చి ట్రంప్‌ను అభినందించిన పుతిన్
-
Oct 17, 2025 08:15 IST
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్
ఉదయం 10.25 గంటలకు సచివాలయానికి వెళ్తారు.
11.30 గంటలకు మైన్స్, రెవెన్యూ జనరేషన్, ఉచిత ఇసుకపై సమీక్ష చేస్తారు.
12.30 గంటలకు కార్మిక సంక్షేమ శాఖపై సమీక్షిస్తారు.
సాయంత్రం 5.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
-
Oct 17, 2025 08:07 IST
విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసు
రిమాండ్‌లో ఉన్న నిందితులను నేడు మరోసారి కోర్టులో హాజరుపరచనున్న సిట్
సిట్ తరపున నిన్న వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూథ్రా
నేడు కోర్టుకు హాజరుకానున్న రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,..
వెంకటేష్ నాయుడు, యద్దాల నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్
లిక్కర్ స్కామ్ కేసులో 49 మందిని నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు
-
Oct 17, 2025 07:20 IST
అసోం: నేడు గౌహతిలో రాహుల్‌గాంధీ పర్యటన
సింగర్ జుబిన్‌గార్గ్‌కు నివాళులర్పించనున్న రాహుల్
-
Oct 17, 2025 07:20 IST
నేడు గుజరాత్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ
ఉ.11:30కి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో మార్పులు
ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న నడ్డా, అమిత్ షా
-
Oct 17, 2025 07:20 IST
నేడు విజయవాడలో బీసీ సంఘాల కీలక సమావేశం
ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం
పార్లమెంట్‌లో బీసీ బిల్లు సాధన కోసం..
బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు దిశగా చర్యలు
-
Oct 17, 2025 07:19 IST
నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చేపపిల్లల పంపిణీ
మక్తల్‌లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
చేపపిల్లలను పంపిణీ చేయనున్న వాకిటి శ్రీహరి, దామోదర
-
Oct 17, 2025 07:19 IST
నారాయణపేట: నేడు జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న..
మంత్రులు రాజ నర్సింహా, వాకిటి శ్రీహరి
-
Oct 17, 2025 06:56 IST
మేడ్చల్: పేట్ బషీరాబాద్‌లో అగ్నిప్రమాదం
దూలపల్లిలోని పాలిమర్స్ కంపెనీలో చెలరేగిన మంటలు
మంటలార్పిన ఫైర్ సిబ్బంది, భారీగా ఆస్తి నష్టం
-
Oct 17, 2025 06:56 IST
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు
-
Oct 17, 2025 06:55 IST
నేడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి నవీన్‌యాదవ్ ర్యాలీ
బంజారాహిల్స్ వరకు ర్యాలీ చేపట్టనున్న నవీన్ యాదవ్
-
Oct 17, 2025 06:55 IST
నేడు డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్
హాజరుకానున్న మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్
బీసీ సంఘాల బంద్‌పై చర్చించనున్న నేతలు
-
Oct 17, 2025 06:55 IST
నేడు మిథురెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు
అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ పిటిషన్
-
Oct 17, 2025 06:54 IST
ఏపీ లిక్కర్ కేసులో సిట్ కస్టడీ పిటిషన్
ఏ1 కేసిరెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్‌రెడ్డి, ఏ8 చాణక్య..
నవీన్‌కృష్ణను కస్టడీకి కోరిన సిట్ అధికారులు
నేడు విచారణకు కస్టడీ పిటిషన్ వచ్చే అవకాశం
-
Oct 17, 2025 06:54 IST
నేడు ఏపీ లిక్కర్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ
నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారించనున్న కోర్టు
నిందితులను కోర్టుకు తీసుకురానున్న సిట్
-
Oct 17, 2025 06:54 IST
పాకిస్థాన్: ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ప్రమాదం
ట్రక్కు బోల్తా, ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మృతి
మరో 8 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Oct 17, 2025 06:54 IST
ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం కోరుతూ సుప్రీంలో పిల్
నేడు పిల్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు
-
Oct 17, 2025 06:53 IST
మావోయిస్టు ఉద్యమ చరిత్రలో నేడు మరో అతిపెద్ద లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట 200 మంది మావోయిస్టులు లొంగిపోయేలా భారీ ఏర్పాట్లు
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగదల్‌పుర్‌లో లొంగిపోనున్న మావోయిస్టులు
-
Oct 17, 2025 06:53 IST
పాక్-అఫ్గానిస్థాన్ ఘర్షణలను నిశితంగా పరిశీలిస్తున్నాం: భారత్
భారత్ తరపున మాపై అఫ్గాన్ పరోక్ష యుద్ధం: పాక్ మంత్రి
-
Oct 17, 2025 06:53 IST
గాజాలో రక్తపాతం కొనసాగితే.. లోపలకు వెళ్లి చంపడమే మార్గం: హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక
బుడాపెస్ట్‌లో పుతిన్‌తో చర్చిస్తా: ట్రంప్
వెనెజువెలా సీఐఏ రహస్య ఆపరేషన్ వాస్తవమే: ట్రంప్
-
Oct 17, 2025 06:52 IST
ఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నెస్లే ఇండియా లాభం రూ.74.17 కోట్లు
2024-25 లాభంతో పోలిస్తే 17.37శాతం తక్కువ
-
Oct 17, 2025 06:32 IST
ఢిల్లీ: దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే హవా
భారతదేశం అంతర్జాతీయ సహకారానికి పూర్తిగా కట్టుబడి ఉంది: RBI గవర్నర్
-
Oct 17, 2025 06:32 IST
ఢిల్లీ: జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన విప్రో లాభం
రూ.3,346 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన విప్రో