-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy telugu latest viral trending and Breaking news across globe 9Th oct 2025 kjr
-
BREAKING: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బొంతు రామ్మోహన్ రియాక్షన్..
ABN , First Publish Date - Oct 09 , 2025 | 06:22 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 09, 2025 21:41 IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్‌ను అభినందించిన మోదీ
వాణిజ్య చర్చల్లో పురోగతిపై ట్రంప్‌తో చర్చించా: ప్రధాని మోదీ
భవిష్యత్‌లో సన్నిహిత సంబంధాలపై ట్రంప్‌తో చర్చించా: మోదీ
-
Oct 09, 2025 21:36 IST
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్..
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు SEC ప్రకటన
సెప్టెంబర్ 29న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నిలిపివేసిన ఈసీ
-
Oct 09, 2025 21:07 IST
కేబినెట్ ముందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ..
ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్ష
రేపు ఏపీ కేబినెట్ ముందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ: మంత్రి లోకేష్
త్వరలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పెండింగ్ రాయితీలు చెల్లింపు: లోకేష్
-
Oct 09, 2025 20:43 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బొంతు రామ్మోహన్ రియాక్షన్..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న ప్రచారం అవాస్తవం: బొంతు రామ్మోహన్
బీజేపీలో అంతర్గత చర్చకు, నాకు సంబంధం లేదు: బొంతు రామ్మోహన్
నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాను.. ఉంటాను: బొంతు రామ్మోహన్
-
Oct 09, 2025 19:06 IST
నర్సీపట్నం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు: జగన్
మెడికల్ కాలేజీల నిర్మాణంతో కోట్లాదిమంది ప్రజలకు మేలు: జగన్
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు వైద్యం ఎలా అందుతుంది?: జగన్
ఇప్పటికీ స్థానిక రోగులు విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి: జగన్
పేదలకు భవిష్యత్ లేని కార్యక్రమాలను చంద్రబాబు చేస్తున్నారు: జగన్
ఉచితంగా వైద్యం చేసే కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు: జగన్
-
Oct 09, 2025 19:06 IST
హైకోర్టు ఆర్డర్ కాపీ కోసం వేచిచూస్తున్న తెలంగాణ SEC
ఆర్డర్ కాపీ వచ్చాక లీగల్ టీంతో సంప్రదించనున్న SEC
సంప్రదింపుల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల..
నోటిఫికేషన్ రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేయనున్న SEC
-
Oct 09, 2025 19:06 IST
రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం తీరు దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
రేవంత్ సర్కార్ చేతకానితనం వల్లే బీసీలకు అన్యాయం: కిషన్‌రెడ్డి
బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌కు లేనేలేదు: కిషన్‌రెడ్డి
రాజ్యాంగపరమైన నిబంధనలపై కనీస అవగాహన లేకుండా..
రేవంత్ సర్కార్ వ్యవహరించింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే..
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 50 శాతం క్యాప్ నిర్దేశించింది: కిషన్‌రెడ్డి
-
Oct 09, 2025 19:06 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిపై బీజేపీలో కీలక పరిణామం
కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించిన ఎంపీ అర్వింద్
బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని..
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావుకు ప్రతిపాదించిన ఎంపీ అర్వింద్
బొంతు రామ్మోహన్‌కు ABVP బ్యాక్‌గ్రౌండ్ ఉందని తెలిపిన ఎంపీ అర్వింద్
-
Oct 09, 2025 19:06 IST
హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం: భట్టి
ఢిల్లీలో మేం పోరాటం చేసినప్పుడు మీరంతా ఏమయ్యారు?: భట్టి
BRS, BJP నేతలు హైకోర్టులో ఇంప్లీడ్ కాలేదు: డిప్యూటీ సీఎం భట్టి
BRS, BJP నేతలు చరిత్రహీనులు అవుతారు: డిప్యూటీ సీఎం భట్టి
-
Oct 09, 2025 17:01 IST
కాకినాడ: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చించాం: పవన్ కల్యాణ్
చేపల వేటపై 7 వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి: పవన్ కల్యాణ్
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా రూ.20 వేలు ఇస్తున్నాం: పవన్
పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతోందనే ఆందోళన ఉంది: పవన్
ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈనెల 14న సమావేశం: పవన్ కల్యాణ్
ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని మత్స్యకారులకు పవన్ కల్యాణ్ హామీ
రూ.323 కోట్లతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలం: పవన్
ఉప్పాడ-కొణపాక మధ్య తీరరక్షణ పనులు ప్రారంభించాం: పవన్ కల్యాణ్
పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు విడతల్లో పరిశీలిస్తా: పవన్ కల్యాణ్
మత్స్యకారులు ఎక్కడికి చెబితే అక్కడికి మూడ్రోజుల్లో వస్తా: పవన్ కల్యాణ్
వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడికే బోటులో వెళ్తా: పవన్ కల్యాణ్
ప్రజలను వంచించాలని నాకు ఎప్పుడూ ఉండదు: పవన్ కల్యాణ్
ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా: పవన్
100 రోజుల సమయం ఇస్తే.. కాలుష్యం తగ్గింపుపై ప్రణాళిక రూపొందిస్తా: పవన్
-
Oct 09, 2025 16:35 IST
స్థానిక ఎన్నికలపై స్టే.. రాజకీయ నేతల రియాక్షన్..
బీసీల నోటికాడ ముద్దను ఆపారు: ఆర్.కృష్ణయ్య
ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగింది
ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తాం: ఆర్.కృష్ణయ్య
బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేక పోతున్నారు
బీసీల సత్తా ఏంటో చూపిస్తాం: ఆర్.కృష్ణయ్య
కాసేపట్లో న్యాయనిపుణులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
నోటిఫికేషన్ స్టేపై సుప్రీంకు వెళ్లే యోచనలో ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా చేస్తోంది: హరీష్‌రావు
55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్..
ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా?: హరీష్‌రావు
చిత్తశుద్ధి ఉంటే మీ ఢిల్లీ నేతలతో పోరాటం చేయండి
కలిసి రావడానికి బీఆర్ఎస్ సిద్ధం: హరీష్‌రావు
హైకోర్టు తీర్పుపై నిరాశ చెందాం: మంత్రి వాకిటి శ్రీహరి
42శాతం బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీహరి
ఇంప్లీడ్ కావాలని విపక్షాలను కోరాం: వాకిటి శ్రీహరి
-
Oct 09, 2025 15:58 IST
స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే..
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు..
జీవో 9 పైనా స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
బీసీ రిజర్వేషన్లపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
-
Oct 09, 2025 15:43 IST
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ
ముగిసిన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు
ప్రభుత్వం తరఫున కొనసాగుతోన్న రవివర్మ వాదనలు
50శాతం రిజర్వేషన్లు దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదు: రవివర్మ
రిజర్వేషన్లకు రాజ్యాంగం ఎలాంటి పరిమితి విధించలేదు: రవివర్మ
సమాజ శ్రేయస్సు కోసం రిజర్వేషన్లు పెంచుకోవచ్చు: రవివర్మ
85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 67% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు: రవివర్మ
15% ఉన్న ఓసీలకు 33శాతం రిజర్వేషన్లు ఓపెన్‌గానే ఉన్నాయి: రవివర్మ
-
Oct 09, 2025 15:32 IST
ఇందిరా సహాని కేసుపై స్పష్టత ఇచ్చిన ఏజీ సుదర్శన్‌రెడ్డి
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు వేరు
ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినది: ఏజీ
సహాని కేసు స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదు: ఏజీ సుదర్శన్‌రెడ్డి
రాజకీయ రిజర్వేషన్ల కోసం మాత్రమే జోవో తెచ్చాం: ఏజీ సుదర్శన్‌రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది: ఏజీ సుదర్శన్‌రెడ్డి
ఈ సమయంలో కోర్టుల జోక్యం సరికాదు: ఏజీ సుదర్శన్‌రెడ్డి
శాస్త్రీయ సమాచారంతో రిజర్వేషన్లు తీసుకొచ్చాం: ఏజీ సుదర్శన్‌రెడ్డి
ఏ రాష్ట్రం దగ్గర శాస్త్రీయ సమాచారం లేదు: ఏజీ సుదర్శన్‌రెడ్డి
-
Oct 09, 2025 14:52 IST
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోన్న విచారణ
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ సుదర్శన్‌రెడ్డి
సమగ్ర సర్వే చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది: ఏజీ
డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి: ఏజీ
అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపాం: ఏజీ
బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏజీ
సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలింది: ఏజీ
సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారు
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించింది
బీసీ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు: ఏజీ
రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే: ఏజీ
ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే..
అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేది: ఏజీ సుదర్శన్‌రెడ్డి
మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉంది: ఏజీ
గవర్నర్ గడువులోపు ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది
తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం..
ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు: ఏజీ సుదర్శన్‌రెడ్డి
బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా అని ప్రశ్నించిన హైకోర్టు
ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించిందని తెలిపిన ఏజీ సుదర్శన్
-
Oct 09, 2025 14:51 IST
హైదరాబాద్: సచివాలయంలో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై కీలక సమీక్ష
పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి, సీఎస్, R&B అధికారులు
మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అద్దంలా R&B రోడ్లు: మంత్రి కోమటి రెడ్డి
ఫేజ్‌ల వారిగా హ్యామ్ రోడ్లు, యాక్సిడెంట్స్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై దృష్టి: కోమటిరెడ్డి
మొదటి ఫేజ్‌లో 5,587 కి.మీ, రూ.10,986 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్,..
జిల్లా కేంద్రాల నుండి రాజధానికి నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం: కోమటిరెడ్డి
మొదటి ఫేజ్‌కు వచ్చే నెలలో టెండర్లు: డిప్యూటీ సీఎం భట్టి
-
Oct 09, 2025 14:29 IST
బీసీ రిజర్వేషన్.. విచారణ ప్రారంభం..
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ సుదర్శన్‌రెడ్డి
-
Oct 09, 2025 14:29 IST
NTR వైద్య సేవలపై బంద్‌పై మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
స్పెషాలిటీ ఆస్పత్రులు సేవలు ఆపొద్దని కోరుతున్నాం
గత ప్రభుత్వం రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టింది..
మేము వచ్చాక విడతల వారీగా చెల్లిస్తున్నాం: సత్యకుమార్
ఆస్పత్రులు నిర్వహణ కష్టంగా ఉందనేది మాకు తెలుసు: సత్యకుమార్
ప్రజలు కూడా ఇబ్బందులకు గురికావొద్దు: సత్యకుమార్
-
Oct 09, 2025 14:04 IST
మరికాసేపట్లో జీవో 9 పై ప్రారంభం కానున్న విచారణ
మరికాసేపట్లో హైకోర్టులో జీవో 9 పై ప్రారంభం కానున్న విచారణ
హై కోర్ట్ వద్ద పెరుగుతున్న సందడి.. కోర్టుకు చేరుకుంటున్న బీసీ సంఘాల నాయకులు
ఈ రోజు ప్రభుత్వం పక్షాన వాదనలు వినిపించనున్న AG
తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న ఇంప్లీడ్ పిటిషనర్లు
ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనల అనంతరం తీర్పు వెల్లడించే అవకాశం
హై కోర్ట్ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ
ఈ రోజు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్
జీవోకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే యధావిధిగా కోన సాగనున్న ఎన్నికలు
జీవోను కొట్టేస్తే నిలిచిపోనున్న ఎన్నికల ప్రక్రియ
-
Oct 09, 2025 13:23 IST
రైల్లో మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు
రైల్లో మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు..
చిత్తూరుకు చెందిన టెక్స్‌టైల్స్ వ్యాపారి అరెస్ట్..
తమిళనాడు ఈరోడ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగం.
మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి తన స్వస్థలం ఈరోడ్‌కు కుర్లా ఎక్స్ ప్రెస్ రైల్లో రిజర్వ్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం.
నిన్న ఉదయం రైలు ధర్మపురి దాటిన సమయంలో మహిళపై లైంగిక వేధింపులు.
షాక్‌కు గురై కేకలు వేసిన మహిళ.. తోటి ప్రయాణికుల సాయంతో పట్టుబడిన నిందితుడు.
నిన్న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేలం రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు.
చిత్తూరుకు చెందిన శంకర్(45)గా గుర్తింపు.
వస్త్ర వ్యాపారం కోసం ఈరోడ్ కు వచ్చినట్లు గుర్తింపు.
-
Oct 09, 2025 11:21 IST
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో ఊరట
గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరణ
హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే నియామకాలు జరగాలన్న సుప్రీంకోర్టు
15న హైకోర్టు విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు
-
Oct 09, 2025 09:23 IST
విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు..
చెన్నైలోని నీలాంగరైలో తమిళనాడు వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు.
విజయ్ నివాసంలో గురువారం ఉదయం బాంబు పేలబోతోందని పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్..
విజయ్ ఇంట్లో బాంబు స్క్వాడ్ నిపుణుల సోదాలు..
బాంబు బెదిరింపు బూటకమని సోదాల్లో తేలింది.
బాంబు బెదిరింపు చేసిన అనుమానిత వ్యక్తి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు..
-
Oct 09, 2025 08:35 IST
బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్..
BRS పార్టీ తలపెట్టిన ఛలో బస్ భవన్ కార్యక్రమానికి వెళ్తున్న ఆ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు..
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్..
బీఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ను ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..
-
Oct 09, 2025 07:54 IST
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
నేటితో ముగియనున్న ఏలూరు ద్వారకాతిరుమల చిన్న వెంకన్న అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు
నేడు శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న
ఉదయం వసంతోత్సవం చూర్ణోత్సవం..
రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
-
Oct 09, 2025 07:50 IST
నేడు మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటన
ఉదయం 10 గంటలకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో భేటీ
మధ్యాహ్నం 1:45కి జియో వరల్డ్ సెంటర్‌లో..
సీఈవోఫోరం భేటీకి హాజరుకానున్న మోదీ, కీర్ స్టార్మర్
మధ్యాహ్నం 2:45 గంటలకు గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మోదీ ప్రసంగం
-
Oct 09, 2025 07:46 IST
కంటైనర్ బీభత్సం..
యాదాద్రి రామన్నపేటలో సుభాష్ చౌరస్తాలో కంటైనర్ బీభత్సం
వాహన తనిఖీలు చేస్తోన్న హోంగార్డును ఢీకొట్టి, పైనుండి వెళ్లిన డ్రైవర్
రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన హోంగార్డు ఉపేందర్ అక్కడికక్కడే మృతి
తెల్లవారుజామున 4 గంటలకు ఘటన
-
Oct 09, 2025 07:00 IST
స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్..
స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
ఉదయం 11 గంటలకు పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ జూమ్ మీటింగ్
పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు
స్థానిక ఎన్నికలు, నామినేషన్ పక్రియపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న పీసీసీ ఛీఫ్
-
Oct 09, 2025 06:28 IST
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించిన ఏఐసీసీ