-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy news Business movies latest viral trending and Breaking across globe 13Th oct 2025 kjr
-
BREAKING: సాక్షి మీడియాకు ఏపీ ప్రభుత్వం నోటీసులు
ABN , First Publish Date - Oct 13 , 2025 | 07:03 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 13, 2025 20:39 IST
ఢిల్లీ: ప్రధానితో భేటీ తర్వాత పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ
వివేకా హత్య తరహాలోనే.. జగన్ కల్తీ మద్యం వ్యవహారం: చంద్రబాబు
మూర్ఖుడు, క్రూరుడు అన్న పదాలు జగన్, అతని అనుచరులకే వర్తిస్తాయి
జగన్ వి ఇంకా చాలా నేర కార్యకలాపాలున్నాయి: ఎంపీలతో చంద్రబాబు
జగన్ క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరు: ఎంపీలతో చంద్రబాబు
వైసీపీ నేతలు నేరాలు చేసి టీడీపీపై నెట్టడం పరిపాటిగా మారింది: చంద్రబాబు
ఏపీలో మళ్లీ నేరాలు, ఘోరాలతో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేశారు
వైసీపీ శ్రేణుల క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి: చంద్రబాబు
ఇప్పుడు కల్తీ మద్యం వ్యవహారం కూడా అలాగే చేశారు: చంద్రబాబు
-
Oct 13, 2025 18:04 IST
ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు
సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడు జనార్దన్ రావు
వైసీపీపాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో..
నకిలీ మద్యం తయారీ చేసినట్టు అంగీకరించిన జనార్దన్ రావు
ప్రభుత్వం మారగానే నకిలీ మద్యం తయారీ నిలిపివేశాం: జనార్దన్ రావు
ఈఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ మళ్ళీ నకిలీ మద్యం తయారుచేయమన్నారు
ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి..
మళ్ళీ నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేష్ నాతో చెప్పారు: జనార్దన్ రావు
ఇబ్రహీంపట్నంలో పెట్టాలి అనుకున్నా కానీ జోగి రమేష్ ఆదేశాలతో..
తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాం: జనార్దన్ రావు
తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే ప్రభుత్వంపై బురద జల్లొచ్చని జోగి రమేష్ అన్నారు
రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చాం
ఆర్ధిక ఇబ్బందులు నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారు
అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపారు: జనార్దన్ రావు
జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు: జనార్దన్ రావు
తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు: జనార్దన్ రావు
టీడీపీ నుంచి సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు: జనార్దన్ రావు
ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని అన్నారు
జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు, సాక్షి మీడియా కూడా ముందే ఉంది
అనుకున్నది జరిగింది.. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది..
నువ్వు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని జోగి రమేష్ అన్నారు: జనార్దన్ రావు
అంతా చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తానని చెప్పి జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు
నా తమ్ముడిని కూడా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇరికించాడు: జనార్దన్ రావు
జై చంద్రారెడ్డికి నకిలీ మద్యంతో అసలు సంబంధం లేదు: జనార్దన్ రావు
-
Oct 13, 2025 17:05 IST
పిటిషన్ డిస్మిస్..
విజయవాడ: IPS సంజయ్ బెయిల్ పిటిషన్ డిస్మిస్
బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
-
Oct 13, 2025 17:05 IST
ఢిల్లీ టెస్ట్‌లో భారత్ టార్గెట్ 121 రన్స్
రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 390 ఆలౌట్
విండీస్ బ్యాటింగ్: క్యాంప్‌బెల్ 115, హోప్ 103 రన్స్
భారత్ బౌలింగ్: కుల్‌దీప్ 3, బుమ్రా 3, సిరాజ్ 2 వికెట్లు
భారత్ బౌలింగ్: జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్
తొలి ఇన్నింగ్స్: భారత్ 518/5 డిక్లేర్డ్, వెస్టిండీస్ 248
-
Oct 13, 2025 17:05 IST
భూటాన్ వల్లే బెంగాల్‌లో వరదలు: సీఎం మమతా బెనర్జీ
భూటాన్ తమకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం మమత డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వమే సహాయక చర్యలు చేపట్టింది: సీఎం మమత
కేంద్రం తమకు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు: సీఎం మమత
భారత్-భూటాన్ ఉమ్మడి నదీ కమిషన్ ఏర్పాటుచేయాలి: సీఎం మమత
కమిషన్‌లో పశ్చిమ బెంగాల్‌ను భాగస్వామ్యం చేయాలి: సీఎం మమత
-
Oct 13, 2025 16:19 IST
మచిలీపట్నం పీఎస్‌లో హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని
మెడికల్ కాలేజ్ దగ్గర అనుమతులు లేకుండా..
ధర్నా చేసిన కేసులో పేర్ని నాని సహా 400 మందిపై కేసు నమోదు
41A కింద 100 మంది వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు
వైసీపీ నగర అధ్యక్షుడు సుబ్బన్న అరెస్ట్‌తో పీఎస్‌కు క్యూకట్టిన నేతలు
వైసీపీ నేతల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన ఎస్ఐ ప్రభాకరరావు
-
Oct 13, 2025 16:19 IST
సీఆర్డీఏ ఆఫీస్‌లో రాజధాని నిర్మాణాలపై చంద్రబాబు సమీక్ష
సమయాన్ని నిర్దేశించుకుని నిర్మాణాలు పూర్తి చేయాలి: చంద్రబాబు
వీలైనంత వర్క్ ఫోర్స్ పెట్టండి... మిషనరీని తీసుకురండి
నిర్మాణాల్లో వేగం పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం
-
Oct 13, 2025 15:35 IST
హైదరాబాద్: మీర్‌పేట మాధవి హత్య కేసు
హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
ఈ నెల 17 నుంచి రోజువారీ విచారణ
మాధవిని ముక్కలుముక్కలుగా చేసి హత్య చేసిన గురుమూర్తి
ఆధారాలు కోర్టుకు సమర్పించిన పోలీసులు
2 నెలల్లో తీర్పు వస్తుంది: రాచకొండ సీపీ సుధీర్
-
Oct 13, 2025 15:35 IST
మరో ముగ్గురికి నోబెల్
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
జోయల్ మోకిర్, ఫిలిప్, పీటర్‌కు నోబెల్ పురస్కారం
-
Oct 13, 2025 15:04 IST
అమరావతి: సాక్షి మీడియాకు ఏపీ ప్రభుత్వం నోటీసులు
కల్తీ మద్యం మరణాలపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ..
జగన్ మీడియా సంస్థ సాక్షికి ప్రభుత్వం నోటీసులు
ఆధారాలు చూపాలి అంటూ సెక్షన్ 179(1) కింద నోటీసులు
-
Oct 13, 2025 15:03 IST
పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు: డీజీపీ శివధర్‌రెడ్డి
యూనిఫాం, కరప్షన్ ఒకే దగ్గర ఉండవు: డీజీపీ శివధర్‌రెడ్డి
ఎవరైనా లంచం తీసుకుంటే శాఖ మొత్తానికి చెడ్డ పేరు: డీజీపీ శివధర్‌రెడ్డి
లంచం తీసుకుంటే ఇకపై కఠిన చర్యలు: డీజీపీ శివధర్‌రెడ్డి
బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీని వాడాలి: డీజీపీ శివధర్‌రెడ్డి
-
Oct 13, 2025 14:10 IST
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు.
స్వతంత్ర అభ్యర్థిగా రెండో నామినేషన్ దాఖలు చేసిన పెసరికాయల పరీక్షిత్ రెడ్డి.
మూడవ స్వతంత్ర అభ్యర్థిగా చాలోక చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు.
ఒక్కొ సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల ఆర్వో సాయిరాం కు అందజేసిన స్వతంత్ర అభ్యర్థులు..
ఇప్పటి వరకు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు.
-
Oct 13, 2025 13:17 IST
మేడారంలో మంత్రులు శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటన
మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటన
వనదేవతలను దర్శించుకున్న మంత్రులు
కాసేపట్లో మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష
హాజరుకాని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
-
Oct 13, 2025 12:45 IST
ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్
గోనెగొండ్ల మండలం వైసీపీ మండల ఉపాధ్యక్షులు రమణి కుమారి వైసీపీ పార్టీ కి రాజీనామా...
కూటమి పథకాలకు ఆకర్షతులై ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షులు రమణ కుమారితో పాటు 200 మంది అనుచరులతో టీడీపీ పార్టీలో చేరిక...
టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి
-
Oct 13, 2025 12:15 IST
సేఫ్టీ ఛాలెంజ్‌ని ప్రారంభించిన CP సజ్జనార్
పౌరుల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సేఫ్టీ ఛాలెంజ్
#SafeRideChallenge అనే సోషల్ మీడియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ సజ్జనార్
మనమందరం కలిసి సేఫ్టీని 2025లో కూలెస్ట్ ట్రెండ్‌గా మార్చుదాం
-
Oct 13, 2025 12:12 IST
బాల సదన్‌కు చేరుకున్న సైదాబాద్ పోలీసులు
లైంగిక దాడి ఘటనపై వివరాలు సేకరిస్తున్న సైదాబాద్ ఇన్స్పెక్టర్, మహిళ ఎస్సై
బాల సదన్ సూపరింటెండెంట్‌తో వివరాలు సేకరిస్తున్న సైదాబాద్ ఇన్స్పెక్టర్
రెహమాన్ ఎంతకాలంగా పనిచేస్తున్నాడు, అతని ప్రవర్తనపై వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు
-
Oct 13, 2025 11:00 IST
కరూర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు
కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు
సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే చీఫ్ నటుడు విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట
తొక్కిసలాటలో 41 మందికి పైగా మృతి, పలువురికి గాయాలు
-
Oct 13, 2025 10:44 IST
లైంగిక దాడి నిజమే.. నిర్ధారించిన పోలీసులు
సైదాబాద్ అబ్జర్వేషన్ హోంలో లైంగిక దాడి నిజమే అని నిర్ధారించిన పోలీసులు
మైనర్ బాలుడుపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ
మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన స్టాఫ్ గార్డ్ రహమాన్
మరో ఐదుగురిపై కూడా లైంగిక దాడి జరిగినట్టు అనుమానం
ఐదుగరు బాలురను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
కొనసాగుతున్న వైద్య పరీక్షలు.. ఇప్పటికే బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు
ప్రస్తుతం స్టాఫ్ గార్డ్ రెహమాన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం
జువైనల్ హోమ్‌లో లైంగిక దాడి ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్
-
Oct 13, 2025 10:16 IST
కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.
ఉదయం 9.54 గంటలకు భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.
సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం పలికిన పండితులు.
రాజధాని పనులు రీ-స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం.
భవనాన్ని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తోన్న ముఖ్యమంత్రి, భవన నిర్మాణ తీరును వివరిస్తోన్న మంత్రి నారాయణ.
భవనం ప్రారంభానికి ముందు భూములిచ్చిన రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి.
రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారన్న సీఎం.
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు
-
Oct 13, 2025 09:45 IST
దొంగల బీభత్సం
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద అంబర్‌పేట్‌లో దొంగల బీభత్సం
సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడిన దొంగలు
ఐదు కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, రూ.60,000 నగదుతో పాటు ఖరీదైన చీరలను ఎత్తుకెళ్లిన దుండగులు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హయత్ నగర్ పోలీసులు
-
Oct 13, 2025 09:31 IST
కొనసాగుతున్న దర్శనాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన ఆలయంలోనే కొనసాగుతున్న దర్శనాలు
భీమేశ్వర ఆలయంలో దర్శనాలకు మూడు నాలుగు రోజుల సమయం
బీజేపీ, రాజన్న భక్తుల ఆందోళనతో అధికారుల్లో గందరగోళం
ప్రధాన ఆలయంలో పనులు పూర్తిగా ప్రారంభమయ్యే నాటికి దర్శనాల నిలిపివేత
ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను భీమన్న ఆలయానికి తరలింపుతో గందరగోళం
-
Oct 13, 2025 08:23 IST
నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
ఉదయం 10గంలకు రహమత్ నగర్ SPR గ్రౌండ్స్‌లో మీటింగ్
5వేల మందితో జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం
హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు
ఉప ఎన్నిక ప్రచారం, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, ర్యాలీలపై క్యాడర్‌కు దిశానిర్దేశం
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోన్న బీఆర్ఎస్
మరోవైపు ఈనెల 15న తమ అభ్యర్థి మాగంటి సునీతతో నామినేషన్ వేయించాలని భావిస్తోన్న బీఆర్ఎస్ నాయకత్వం
-
Oct 13, 2025 07:35 IST
గుంతకల్లులో.. వ్యక్తి దారుణ హత్య
అనంతపురం గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య
తిలక్ నగర్‌కు చెందిన ఆనంద్ అనే వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసిన సలీం
ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు
-
Oct 13, 2025 07:28 IST
బీసీ కోటాపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్
జీవో 9పై హైకోర్టు స్టేను సవాల్ చేయనున్న ప్రభుత్వం
సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు
సింఘ్వీ, సిద్ధార్థ్ దవేతో చర్చించిన సీఎం
ఇందిరా సాహ్నీ కేసు తీర్పు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి కాదని వాదన
విద్యా, ఉపాధి రంగాలకు మాత్రమే 50 శాతం పరిమితి అంటున్న ప్రభుత్వం
ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.. నేడు ఢిల్లీకి వెళ్లనున్న పలువురు మంత్రులు
నేడు న్యాయ నిపుణులతో భేటీ అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
-
Oct 13, 2025 07:06 IST
పల్టీ కొట్టిన ప్రైవేట్ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు
మహబూబాబాద్ మరిపెడ మండల కేంద్ర శివారు ఖమ్మం- వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం
అదుపు తప్పి పల్టీ కొట్టిన ప్రైవేట్ బస్సు.. పలువురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ నుంచి కురవి వీరభద్ర స్వామి ఆలయానికి దర్శనం కోసం 25 మందితో వస్తున్న బస్సు