-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking news across globe 23RD sept 2025 vreddy
-
BREAKING: ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం
ABN , First Publish Date - Sep 23 , 2025 | 05:59 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 23, 2025 16:21 IST
ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న మోహన్‌లాల్
ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్న షారుఖ్ ఖాన్
ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్న విక్రాంత్ మస్సే
ఉత్తమ నటి అవార్డు అందుకోనున్న రాణి ముఖర్జీ
-
Sep 23, 2025 15:51 IST
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు.
విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్.
అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.
-
Sep 23, 2025 13:28 IST
మేడారం వనదేవతలకు తులాభారం వేసి బంగారం (బెల్లం) సమర్పించిన ముఖ్యమంత్రి
-
Sep 23, 2025 13:25 IST
మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆలయ అభివృద్ధిపై ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మేడారం ఆలయ పూజారులు, ఉన్నతాధికారులు
ఆలయ విస్తరణ, మాస్టర్ ప్లాన్ పై చర్చిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
2026 మహాజాతరకు ముందే పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు
-
Sep 23, 2025 13:23 IST
ఢిల్లీ: ఈడీ విచారణకు హాజరైన యువరాజ్‌సింగ్
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు యువరాజ్ సింగ్
ఇప్పటికే సురేష్ రైనా, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్పను ప్రశ్నించిన ఈడీ
-
Sep 23, 2025 13:20 IST
దేశవ్యాప్తంగా 'ఆపరేషన్ నమకూర్' పేరుతో కస్టమ్స్ సోదాలు
కొచ్చిలోని దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ నివాసాల్లో తనిఖీలు
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణల కేసుపై దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్
-
Sep 23, 2025 12:25 IST
కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట హాజరైన మంత్రి ఉత్తమ్
కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటాపై వాదనలు
ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టీఎంసీల్లో..
70 శాతం తెలంగాణకు కేటాయించాలని వాదన
-
Sep 23, 2025 10:50 IST
వ్యక్తిగత కారణాలతో ఇండియా-ఎ జట్టు నుంచి వైదొలిగిన శ్రేయస్ అయ్యర్
ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌కు ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్
-
Sep 23, 2025 09:47 IST
గుంటూరు జిల్లాలో కలరా కలకలం
జీజీహెచ్‌కు డయేరియా లక్షణాలతో రోగుల తాకిడి
జిల్లా వ్యాప్తంగా 114 మంది అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిక
4 కలరా కేసులు, 16 ఈకోలీ బ్యాక్టీరియా కేసులు నమోదు
-
Sep 23, 2025 09:37 IST
నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
వైద్యారోగ్యంపై చర్చ, సమాధానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు
పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న ఏపీ అసెంబ్లీ
పొగాకు, మిరప, మామిడి పంటకు మద్దతు ధరపై చర్చ
మండలిలో వార్షిక నివేదికలు సమర్పించనున్న మంత్రులు
మండలిలో పరిశ్రమలు, పెట్టుబడులు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చ
అబ్కారీ సవరణ బిల్లు ప్రతిపాదించనున్న మంత్రి కొల్లు రవీంద్ర
-
Sep 23, 2025 08:31 IST
తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలతో పోస్ట్ పెట్టిన సుభాష్
-
Sep 23, 2025 07:17 IST
మండలిలో వివిధ వార్షిక నివేదికలు సమర్పించనున్న..
మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్
అబ్కారీ సవరణ బిల్లు ప్రతిపాదించనున్న మంత్రి కొల్లు రవీంద్ర
పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై చర్చ
-
Sep 23, 2025 07:13 IST
నేడు, రేపు లోక్‌సభ సబార్డినేట్ లేజిస్టేషన్ కమిటీ భేటీ
హాజరుకానున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 12 మంది ఎంపీలు
విద్యుత్ రంగ సంస్థలు NTPC, REC, PFC CMDలతో ఎంపీల చర్చ
-
Sep 23, 2025 06:50 IST
నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నేడు శాంతిభద్రతలపై అసెంబ్లీలో చర్చ
-
Sep 23, 2025 06:49 IST
నేటి నుంచి ఐరాస సర్వసభ్య సమావేశం
సమావేశంలో పాల్గొననున్న 150కు పైగా దేశాల అధినేతలు
యుద్దాలతో పాటు పర్యావరణ అంశాలపై చర్చ
భారత్ తరపున హాజరుకానున్న జైశంకర్
-
Sep 23, 2025 06:48 IST
సింగరేణి కార్మికుల ఖాతాల్లో ఇవాళ బోనస్ జమ
లాభాల్లో 34 శాతం బోనస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
రూ.819 కోట్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం
దీపావళికి మళ్లీ బోనస్ ప్రకటిస్తామన్న సీఎం రేవంత్
-
Sep 23, 2025 06:48 IST
నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
భక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్న టీటీడీ
-
Sep 23, 2025 06:03 IST
ఓజీ ప్రీమియర్ షో సమయం మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి
రేపు రాత్రి 10 గంటలకు ఓజీ ప్రీమియర్ షోకు అనుమతి
-
Sep 23, 2025 06:02 IST
ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఈ నెల 26న బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం
ఈ నెల 27న వాయుగుండం తీరం దాటే అవకాశం
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర దగ్గర తీరం దాటే అవకాశం
-
Sep 23, 2025 06:01 IST
రేపు ఏపీకి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
ఉపరాష్ట్రపతిగా తొలిసారి రాష్ట్రానికి వస్తున్న రాధాకృష్ణన్
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు..
విజయవాడ ఉత్సవ్‌కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
-
Sep 23, 2025 06:00 IST
నేడు బీజేపీ ఆధ్వర్యంలో..
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బతుకమ్మ వేడుకలు
హాజరుకానున్న ఖుష్బూ, బీజేపీ నేతలు
-
Sep 23, 2025 05:59 IST
నేడు మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు