Share News

Cleaning Tips: ఇల్లు శుభ్రం చేసేటప్పుడు.. జస్ట్ ఇలా చేయండి..

ABN , Publish Date - May 04 , 2025 | 03:34 PM

Cleaning Tips: ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. దోమలు, ఈగలు, బొద్దింకలు ఇంట్లోకి చేరవు.

Cleaning Tips: ఇల్లు శుభ్రం చేసేటప్పుడు.. జస్ట్ ఇలా చేయండి..

ఇది వరకు పాము కుడితే చనిపోయేవారు. కానీ ప్రస్తుతం దోమ కుడితేనే చనిపోయే పరిస్థితులు దాపురించాయి. అంతేకాదు.. దోమల వల్ల సంక్రమించే వ్యాధులు సైతం బాగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో నేలను తుడుచేందుకు.. మార్కెట్లో లభించే రసాయనాలను ఉపయోగించకుండా జస్ట్. కొన్ని సింపిల్ చిట్కాలు పాటిస్తే చాలు.

భారీ వర్షాల కారణంగా.. ఇంటి చుట్టూ నీరు నిలిచిపోతుంది. దీంతో ఇంట్లోకి చీమలు, దోమలు, ఈగలు రావడం ప్రారంభమవుతోంది. వర్షం కారణంగా.. అవి వంటగది, బాత్రూమ్ మురుగు కాలువల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. వీటి వల్ల ఆహారం సైతం కలుషితం అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేసుకోవడం ముఖ్యం. నేలను తుడుచేటప్పుడు నీటిలో కొద్దిగా డిష్ సోప్ కలపండి.


ఈ రెండు వస్తువులను మీరు తుడిచే నీటిలో వేస్తే..

  • ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయాలి. రసాయన పురుగు మందులను..నేల శుభ్రపరిచే ద్రవాన్ని వాడే బదులు.. పటిక, నిమ్మరసాన్ని నీటిలో కలిపి వాడాలి.

  • ముఖ్యంగా పటికను ఉపయోగించడం వల్ల కీటకాలు చనిపోతాయి. ఇది పురుగు మందులా పని చేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. నీటిలో ముంచి నేలను తుడవడం ద్వారా.. నేలపై ఉన్న అన్ని కీటకాలు, ఈగలు, చీమలు, బొద్దింకలు సైతం పారిపోతాయి.


Updated Date - May 04 , 2025 | 03:34 PM