IRCTC Navratri Tour Package: భక్తులకు శుభవార్త.. IRCTC నవరాత్రి స్పెషల్ టూర్ ప్యాకేజీ
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:21 AM
నవరాత్రి పండుగ ఆధ్యాత్మికతకు ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా IRCTC భక్తుల కోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీను ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో నవరాత్రులను ఆధ్యాత్మికతకు ప్రత్యేక సీజన్‌గా పరిగణిస్తారు. భారతదేశం అంతటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈ పండుగ సందర్భంగా IRCTC భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు నాలుగు ప్రధాన జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు . అలాగే, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా చూడవచ్చు. సో లేట్ చేయకుండా, IRCTC ప్రకటించిన టూర్ ప్యాకేజీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్యాకేజీ వివరాలు
IRCTC నవరాత్రి టూర్ ప్యాకేజీ అక్టోబర్ 25 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ కింద ప్రత్యేకంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నడపాలని IRCTC నిర్ణయించింది. ఈ రైలు మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలకు భక్తులను తీసుకెళ్తుంది. ఈ ప్యాకేజీ పంజాబ్, హర్యానా, ఢిల్లీ నుండి వచ్చే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్రయాణం అమృత్‌సర్ నుండి ప్రారంభమై జలంధర్ సిటీ, లూధియానా, చండీగఢ్, అంబాలా కంటోన్మెంట్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, సోనిపట్, ఢిల్లీ కంటోన్మెంట్, రేవారి వంటి స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్యాకేజీ ద్వారా మీరు నాలుగు జ్యోతిర్లింగాలైన మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. ఈ ప్రయాణం 9 రోజులపాటు ఉంటుంది. ఒక్క రోజుకు దాదాపు రూ. 2200 ఖర్చు అవుతుంది. ఈ ప్రయాణం ఉజ్జయిని నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగాలను సందర్శిస్తారు. దీని తరువాత రైలు గుజరాత్‌లోని కెవాడియా వైపు కదులుతుంది, అక్కడ మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం. దీని తరువాత ప్రయాణం ద్వారక వైపు ఉంటుంది. అక్కడ ద్వారకాధీశ ఆలయం, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించవచ్చు. ప్రయాణంలో చివరి స్టాప్ సోమనాథ్, ఇక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని సందర్శించడం ద్వారా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తవుతుంది.
ఛార్జీలు
ఈ IRCTC నవరాత్రి టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు వేర్వేరు క్లాస్‌లలో టిక్కెట్లు తీసుకునే అవకాశం ఉంది.
స్లీపర్ క్లాస్‌లో 640 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఛార్జీ రూ. 19,555
3ACలో 70 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఛార్జీ రూ. 27,815
2ACలో 52 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఛార్జీ రూ. 39,410
ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?
ఈ ప్యాకేజీలో కేవలం రైలు టిక్కెట్ మాత్రమే కాకుండా ఉండటానికి గదులు, భోజనం, ఆలయాలకు వెళ్లేందుకు స్థానిక రవాణా కూడా ఉంటుంది. అదనంగా, భక్తుల సౌకర్యం కోసం AC బస్సులు, నాన్-AC బస్సులు కూడా ఏర్పాటు చేశారు.
బుకింగ్
IRCTC టూరిజం వెబ్‌సైట్ https://www.irctctourism.com ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. సో లేట్ చేయకుండా ఇప్పుడే మీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి..
Also Read:
ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ
జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్..ఓ ఉగ్రవాది మృతి, జవానుకు గాయాలు
For More Latest News